రూ.13 లక్షల అవినీతికి రూ.75 లక్షల జరిమానా!
న్యూఢిల్లీ: రూ. 13 లక్షల అవినీతికి రూ. 75 లక్షల జరిమానా విధించి స్థానిక సీబీఐ కోర్టు సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల కిందటి ఈ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించడం సరికాదని, అది దేశాభివృద్ధినే అడ్డుకోగలదని సోమవారం వ్యాఖ్యానించింది. ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్(ఏడీజీ) హోదాలో పనిచేసిన విశ్వ విభూతి(67) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ 1996లో కేసు నమోదు చేసింది.