వీటీయూ వీసీ సస్పెన్షన్
అధికార దుర్వినియోగంతో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్శిటీ (వీటీయూ) వీసీ మహేశప్ప సస్పెండ్ అయ్యారు. ఈమేరకు గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీలో మౌలికసదుపాయాల కల్పన, సాంకేతిక పరిజ్ఞానం పెంపు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకం తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడినట్లు మహేశప్పపై ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై న్యాయమూర్తి కేశవ నారాయణ నేతత్వంలోని కమిటీ తన నివేదికను ఇప్పటికే అందజేసింది. ఇందులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని మహేశప్పను సస్పెండ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రిజి్ర్టర్ శేఖరప్ప వీసీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.