ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద మృతి
నెల్లూరు జిల్లా కావలిలోని ఓ ప్రైవేట్ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవనం నుంచి పడి ఓ విద్యార్థి చనిపోయాడు. సీఈఈ చదువుతున్న విశ్వకుమార్ గురువారం రాత్రి భవనంపైనుంచి కిందపడి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ కుమారుడిని తోటి వారే కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేశారు. శివకుమార్ స్వగ్రామం అనంతసాగరం మండలం గొల్లపల్లి.