Vitamin E
-
Beauty Tips: అలోవెరా, కాఫీ పొడి, విటమిన్ ఈ క్యాప్సూల్.. ఎండుగడ్డిలా ఉండే జుట్టు సైతం!
నిర్జీవంగా... ఎండుగడ్డిలా ఉండే కేశాలను సిల్కీగా, షైనింగ్‌గా మార్చుకునేందుకు ఇంట్లో దొరికే వాటితో ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం... ►టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను కాఫీ పొడి, టీస్పూను సాధారణ షాంపు, విటమిన్ ఈ క్యాప్సూల్‌ను ఒక గిన్నెలో వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు కండీషనర్‌లా అప్లైచేసి గంట తరువాత నీటితో కడిగేయాలి. ►వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతోపాటు సిల్కీగా మెరిసిపోతుంది. ►ఇక జట్టు తరచుగా చిక్కులు పడుతుంటే.. కెరాటిన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మేలు. దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది. ►అదే విధంగా.. మార్కెట్లో అనేక రకాల సీరమ్‌లు దొరుకుతున్నాయి. వాటిలో మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను ఎంచుకుని వాడితే కురులు మృదువుగా మారతాయి. ►ఇక చర్మ సంరక్షణలో వాడే గ్లిజరిన్ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది. గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గి మృదుత్వాన్ని సంతరించకుంటాయి. చదవండి: Tara Sutaria: ఇలా చేస్తే చాలు.. ముఖం మెరిసిపోతుంది! బ్యూటీ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ Hair Care Tips: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే! ఈ సమస్యలు తప్పవు! -
Health: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఉల్లిపాయ, కొత్తిమీర, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో!
Nose Bleeding Problem: ఎండ వేడిమి ఎక్కువైతే కొంత మందిలో ముక్కులో నుంచి రక్తం విపరీతంగా కారుతుంది. వేడి ఎక్కువగా ఉన్న శరీరంలో అయితే తీవ్రత అధికంగా కనిపిస్తుంది. ఇలా రక్తం కారిన ప్రతిసారి ఆందోళనపడటం, భయపడటం చేస్తుంటారు. తగ్గడం కోసం రక రకాల మందులను ఉపయోగిస్తారు. అయితే కారణం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మందులు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్సు వస్తాయి. అలా కాకుండా సహజ సిద్ధంగా ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే కింది చిట్కాలను పాటిస్తే సరిపోతుంది... ఇలా చేయండి! ►ముక్కులో నుంచి ఎక్కువగా రక్తం కారుతుంటే.. ఉల్లిపాయను గుండ్రంగా కట్ చేసుకొని, ఆ ఉల్లి ముక్కను ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూడాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. ఇలా చేయటం తొందరగా ఉపశమనం పొందుతారు. ►రక్తం కారటాన్ని తగ్గించటంలో కొత్తిమీర పాత్ర కీలకం. కొత్తిమీర సహజంగానే చల్లదనాన్నిస్తుంది. ఇది ముక్కుకు సంబంధించిన అన్ని రకాల ఎలర్జీలను నివారించటంలో మంచి ఔషధంలా పని చేస్తుంది. ముక్కు నుంచి రక్తం అధికంగా కారితే కొత్తిమీర తాజా రసాన్ని ముక్కు లోపలి అంచులకు రాసుకుంటే సరిపోతుంది. ►ముక్కు నుంచి రక్తం కారటాన్ని తగ్గించటంలో తులసి మంచి ఔషధం. తులసి రసాన్ని ముక్కులో రెండు చుక్కలు వేసుకోవటం లేదా తాజా తులసి ఆకులను నమలటం వల్ల కూడా ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి. ►చిన్న పిల్లలకు ముక్కులో నుంచి రక్తం ఎక్కువగా కారితే విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కత్తిరించి అందులో కొంచెం పెట్రొలియం జెల్లీ కలిపి డ్రాపర్‌తో ముక్కులో రెండు చుక్కలు వేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ►ఈ సమస్య అధికంగా వేధిస్తుంటే విటమిన్ ’సి’ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు రోజూ తినటం మంచిది. ►అలాగే గోధుమలు, గోధుమ గడ్డితో తయారు చేసిన పదార్థాలను రోజూ తినటం మంచిది. ఎందుకంటే గోధుమల్లో జింక్, ఐరన్, నూట్రీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక రక్త ప్రసరణను అదుపులో ఉంచుతాయి. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! -
శీతాకాలం చర్మ సమస్యలా? బాదం, పాలకూర, అవకాడో.. ఇవి తిన్నారంటే..
శీతాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పొడి చర్మం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో జుట్టు, చర్మానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. సాధారణంగా చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో విటమిన్ ‘ఇ’నూనెలు వాడుతారు. ఐతే ఈ నూనెల్లో ఇతర కెమకల్స్ కూడా ఉంటాయి. సహజ పద్ధతుల్లో శరీరానికి ఈ విటమిన్ అందాలంటే.. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవడం ఉత్తమ పద్ధతి. విటమిన్ ‘ఇ’తో ఎన్నో ప్రయోజనాలు ఈ విటమిన్ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నిరోధించి ఇమ్యునిటీని పెంచడంతోపాటు చర్మ, కేశ ఆరోగ్యాన్నిపెంపొందిస్తుంది. విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే కొన్ని రకాల ఆహారాలను ప్రముఖ రేడియాలజిస్ట్ డా. మనోజ్ అహుజా సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.. బాదం రాత్రి అంతా నానబెట్టిన ఐదు బాదం పప్పులను ఉదయాన్నే పరగడుపున తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నా మంచిదేనని తరచుగా చెబుతారు ఎందుకంటే బాదంలో విటమిన్ ‘ఇ’ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీనిలో ఇతర పోషకాలు కూడా నిండుగా ఉంటాయి. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! పాలకూర ఉదయం పూట అల్పాహారంగా ఆకు పచ్చ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉడికించిన గుడ్డుతో లేదా తరిగిన పాలకూర ఆకులను గుడ్డులో కలిపి ఆమ్లేట్లా చేసుకుని తిన్నా మీ శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పాలకూరతో రావియోలి కూడా తయారు చేసుకోవచ్చు లేదా పాలకూర, పనీర్లను శాండ్విచ్లో స్టఫ్ గా కూడా వాడొచ్చు. అవకాడో పండు అవకాడో పండు మెత్తగా క్రీమీగా ఉంటుంది. దీనిని టోస్ట్ లేదా గుడ్డు, మాంసం, కూరగాయలు దేనితోనైనా ఈ పండును మెత్తగా స్మాష్ చేసి కలుపుకుని బ్రెడ్‌లో స్టఫ్‌గా తినొచ్చు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! పొద్దుతిరుగుడు విత్తనాలు పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ‘ఇ ’ పుష్కలంగా ఉంటుంది. కాల్చిన పొద్దుతిరుగుడు గింజలను మార్నింగ్ కాఫీతో స్నాక్స్‌లా తినొచ్చు. లేదా ఓట్స్, పాన్ కేక్ వంటి ఇతర భోజనాలపై ఈ విత్తనాలను చల్లుకుని తినొచ్చు. వేరుశెనగ బ్రెడ్‌పై వేరుశెనగ వెన్న పూసి ఉదయం అల్పాహారంగా తినొచ్చు. ఉప్మా, పోహాలలో వేరుశెనగను జోడించి తిన్నా మంచిదేనని డా. మనోజ్ అహుజా సూచిస్తున్నారు. చదవండి: Lake of No Return: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తిన్నారంటే..
►రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు (సన్ ఫ్లవర్ విత్తనాలు) తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ►ఈ విత్తనాల్లో ప్రొటిన్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ►ఈ గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. ►విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. ►బరువుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు. ►ఇంకా దీనిలో ఉన్న విటమిన్ ‘ఈ’ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చదవండి: బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం -
ఈ విటమిన్‌తో బ్లాడర్ క్యాన్సర్లకు చెక్
విటమిన్ ‘ఈ’ ఉన్న ఆహారాలు తీసుకోవడం ద్వారా మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ల నివారణ జరుగుతుందన్నది కొన్ని అధ్యయనాల ద్వారా కచ్చితంగా తెలియవచ్చిన వాస్తవం. ఉదాహరణకు... యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ క్యాన్సర్ సెంటర్లో నిర్వహించిన అధ్యయనాల్లో విటమిన్–ఈ లోని ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం... బ్లాడర్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తుందని తేలింది. మనం తీసుకునే ఆహారపదార్థాల్లో మిరియాలు, పాలకూర, బాదంలతో పాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఈ పాళ్లు ఎక్కువ. అలాగే క్రూసిఫెరస్ వెజిటబుల్స్గా పేర్కొనే... క్యాబేజీ, బ్రకోలీ, కాలీఫ్లవర్ వంటివి కూడా మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయని తేలింది. అందుకే మీ డైట్లో ఈ ఆహారాలు ఉండేలా చూసుకోండి. మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్లను నివారించుకోండి. -
కనురెప్పలు మరింత విశాలంగా!
బ్యూటిప్స్ కనురెప్పలు విశాలంగా కనిపించాలంటే రెప్పల వెంట్రుకలు దళసరిగా ఉండాలి. అందుకు..రాత్రి పడుకునే ముందు ఆముదం కొద్దిగా వేలికి అద్దుకొని కనురెప్పల వెంట్రుకలకు మెల్లగా రాయాలి.మస్కారా వల్ల కనురెప్పల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అలొవెరా జెల్‌ను రాసుకోవాలి. అలొవెరాలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కనురెప్పల వెంట్రుకల పెరుగుదలకు దోహదం చేస్తుంది. రోజూ 2 నిమిషాలు ఆలివ్ ఆయిల్‌తో కనురెప్పల భాగంలో మృదువుగా మర్దనా చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది. విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్‌లోని ఆయిల్‌ను శుభ్రమైన మెత్తటి బ్రష్‌తో అద్దుకొని, మెల్లగా అప్లై చేయాలి. దీని వల్ల కనురెప్ప వెంట్రుకంతటికీ ఆయిల్ అంది, ఆరోగ్యమైన ఎదుగుదల ఉంటుంది.