కనురెప్పలు మరింత విశాలంగా!
బ్యూటిప్స్
కనురెప్పలు విశాలంగా కనిపించాలంటే రెప్పల వెంట్రుకలు దళసరిగా ఉండాలి. అందుకు..రాత్రి పడుకునే ముందు ఆముదం కొద్దిగా వేలికి అద్దుకొని కనురెప్పల వెంట్రుకలకు మెల్లగా రాయాలి.మస్కారా వల్ల కనురెప్పల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు అలొవెరా జెల్‌ను రాసుకోవాలి. అలొవెరాలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కనురెప్పల వెంట్రుకల పెరుగుదలకు దోహదం చేస్తుంది.
రోజూ 2 నిమిషాలు ఆలివ్ ఆయిల్‌తో కనురెప్పల భాగంలో మృదువుగా మర్దనా చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, వెంట్రుకలు రాలిపోవడం తగ్గిపోతుంది. విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్‌లోని ఆయిల్‌ను శుభ్రమైన మెత్తటి బ్రష్‌తో అద్దుకొని, మెల్లగా అప్లై చేయాలి. దీని వల్ల కనురెప్ప వెంట్రుకంతటికీ ఆయిల్ అంది, ఆరోగ్యమైన ఎదుగుదల ఉంటుంది.