vitamine
-
ట్యాబ్లెట్లు నింపేస్తునారు!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఎఫెక్ట్‌తో జనం నానా తిప్పలు పడుతున్నారు. ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎన్నెన్నో దారులు వెదుకుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)పెంచుకునేందుకు కషాయం తాగడం లాంటి వంటింటివైద్యానికి ప్రాముఖ్యతనిస్తూనే..విటమిన్స్, మినరల్స్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ మెడికల్ షాపులకు భారీగా గిరాకీ పెరిగింది. కొందరు వ్యక్తిగతంగా టాబ్లెట్లు కొనుగోలు చేస్తుంటే..మరికొందరు డాక్టర్ల సలహాతో మందులువాడుతున్నారు. గత వారం రోజులుగా పలు విటమిన్స్, మినరల్స్‌కుసంబంధించిన మందుల కొరత ఏర్పడింది. మెడికల్ షాపుల్లోనో స్టాక్ అని చెప్పేస్తున్నారు. దీన్నిబట్టి నగర జనంఏ స్థాయిలో ఈ ముందులు వాడుతున్నారో ఇట్టే అర్థం అవుతుంది. సోమవారం ‘సాక్షి’ నగరంలోని పలు మెడికల్ షాపులనుసందర్శించగా..పలుఆసక్తికర విషయాలు తెలిశాయి. మెడికల్ షాప్‌లకు వచ్చే సుమారు వంద మంది కస్టమర్స్‌లో దాదాపు 90 మంది విటమిన్ సి,డితో పాటు ఇతర మినరల్ మాత్రలను కొనుగోలు చేయడం కన్పించింది. కొందరైతే ఇంట్లోని కుటుంబ సభ్యుల అందరి కోసం మాత్రలు కొనేశారు. వీటితో పాటు రోగ నిరోధక శక్తినిచ్చే ఇతర ఇమ్యూనిటీ బూస్టింగ్ పౌడర్లు, టానిక్స్, జింక్, ఐరన్, మల్టీవిటమిన్స్ కొనుగోలు చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శరీరంలో అన్ని విధాలుగా శక్తి సమకూర్చడానికి ఈ రకమైనా మందులు కొంటున్నామని చెబుతున్నారు. ఇలా నగరవాసులు శరీంలో విటమిన్స్‌ను నింపేస్తున్నారు. ఆక్సీమీటర్లు, నెబులైజర్లకు పెరిగిన డిమాండ్ కరోనా వ్యాధి లక్షణాలుంటే శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గతుందని నగర ప్రజల్లో ప్రచారం ఎక్కువగా ఉంది. శరీరంలో ఆక్సిజన్ శాతం తెలుసుకోవడానికి ఆక్సీమీటర్ ఉపయోగపడుతుంది. దీంతో చాలా మంది ఆక్సీమీటర్లు సైతం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో వీటికి డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. కరోనా వ్యాధి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. జలుబు, జ్వరం ఉండి డాక్టర్ల వద్దకు వెళ్తే ముందు ఆక్సీమీటర్ పెట్టి చూస్తున్నారు. దీంతో ప్రజలు కూడా ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు, స్క్రీనింగ్ మిషన్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక ప్రజల అవసరాలను మెడికల్ షాపుల నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో ట్యాబెట్లు, ఇతర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. ధరలు ఎక్కువగా ఉన్నాయని అడిగితే స్టాక్ లేదని సమాధానం చెబుతున్నారు. గతంలో కోఠిలోని ఇందర్‌బాగ్ హోల్‌సేల్ మెడికల్ షాపుల సముదాయంలో మందులపై ఎక్కువగా డిస్కౌంట్ ఉండేది. కరోనా కారణంగా ఇప్పుడు ఎలాంటి డిస్కౌంట్ లభించడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. వాటికే డిమాండ్ ఉంది.. ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి రక్షణ కోసం, రోగనిరోధ శక్తి పెంచడానికి జనం వివిధ రకాల విటమిన్స్, కాల్షియం, మినరల్స్ మందులు ఎక్కువగా వాడుతున్నారు. డాక్టర్లు కూడా ప్రతి రోగికి ఇలాంటి మందులే రాస్తున్నారు. ప్రత్యేకంగా విటమిన్–సి, డి, కాల్షియం మందులకు బాగా డిమాండ్ ఉంది. అలాగే ఈజీ బ్రీత్ మిషన్లతో ఆవిరి పడుతున్నారు. – గోపీనాథ్, మెడ్‌ప్లస్ ఉద్యోగి, ఆనంద్‌నగర్ -
తగినంత వాడితే విటమిన్లతో లాభమే...
జీవక్రియలు సక్రమంగా సాగేందుకు ఉపకరించే విటమిన్లు, ఖనిజాలను తగినంత మోతాదులో వాడితే వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలను వాయిదా వేయవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆసుపత్రిలో పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ఆధారంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బ్రూస్ ఏమ్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొత్తం 30 విటమిన్లతో పాటు ఇప్పటివరకూ విటమిన్లుగా గుర్తించని 11 ఇతర పదార్థాలను... దీర్ఘాయుష్షును అందించేవిగా గుర్తించాలని ఏమ్స్ అంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడే ఎంజైమ్‌లలో కీలకమైన భాగాలని, దురదృష్టవశాత్తూ చాలామందికి ఇవి తగుమోతాదులో అందడం లేదని చెప్పారు. చాలామంది కొద్దిపాటి విటమిన్ లోపాలను పట్టించుకోరని, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. కణాల్లోని వందలాది ఎంజైమ్‌లకు ఈ విటమిన్లు, ఖనిజాలు అత్యవసరమన్న అంశాన్ని పోషకాహార నిపుణులు విస్మరించినందుకు ఫలితంగా శరీరం అందుబాటులో ఉన్నవాటిని రోజువారీ పనులకు ఉపయోగిస్తుందని, దీంతో డీఎన్ఏ మరమ్మతులకు, వయో సంబంధిత సమస్యల నివారణకు విటమిన్లు, ఖనిజాలు దొరక్కుండా పోతున్నాయని వివరించారు. -
ఇది కీళ్లనొప్పుల కాలం!
చలికాలంలో కీళ్లనొప్పులు మరీ ఎక్కువవుతాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఎండాకాలంలోలా ఈ సీజన్లో సూర్యరశ్మి ఎక్కువగా తగిలే అవకాశం ఉండదు. దాంతో ఆటోమేటిగ్గా ఎముకలకు కావాల్సిన విటమిన్–డి కూడా తగ్గడం లాంటి అనేక కారణాలు దీనికి దోహదపడతాయి. ఆ నొప్పులు తగ్గాలంటే కొన్ని మార్గాలివి... ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైతే ఇన్డోర్ వ్యాయామాలు చేయండి. శీతకాలం కీళ్ల నొప్పులు తగ్గాలంటే శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామాలు, తగినంత శారీరక శ్రమ మంచి మార్గం. మన కీళ్లలో ఎప్పుడూ కదలికలు ఉండేలా చేసుకోవడం వల్ల కీళ్ల ఆరోగ్య నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. ∙ఇంట్లో పనులు చేయడం... అంటే ఇల్లు శుభ్రం చేయడం, వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వంటివి. ∙ఇన్డోర్ స్విమ్మింగ్ ∙ఇంట్లోనే తేలికపాటి మ్యూజిక్కు డాన్స్ చేయడం. ∙ఆఫీసులో లేదా మీరు వెళ్లిన చోట లిఫ్ట్‌కు బదులు మెట్లనే ఉపయోగించడం. ∙టీవీ చూస్తున్నప్పుడు కూర్చునే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం. నొప్పిని తగ్గించుకునేందుకు కొన్ని సూచనలు... ⇔ ఈ సీజన్లో వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగండి. చాలామంది చలి వాతావరణం కారణంగా నీళ్లు తక్కువగా తాగుతారు. ఒంటిని వెచ్చబరచుకోడానికి దోహదం కాఫీ, టీ వంటివి ఎక్కువగా తాగేస్తారు. పైగా దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీరు బయటకు వెళ్తుంది. ఈ అన్ని కారణాలతో శరీరంలో నీళ్లు, లవణాల పాళ్లు తగ్గుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. ⇔ ఈ సీజన్లో రూమ్ హీటర్లు వాడే సౌకర్యం ఉన్నవారు తమకు తెలియకుండానే శరీరంలోని ద్రవాలను కోల్పోతారు. అందుకే ఈ సీజన్లో అందరూ నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ⇔ మోకాళ్లపై ఎలాంటి భారం పడకుండానే మంచి వ్యాయామాన్ని చేకూర్చే ఈదడం వంటి ప్రక్రియలు ఈ సీజన్లో చాలా మంచిది. అయితే స్విమ్మింగ్‌పూల్‌లో బాగా చల్లటి నీళ్లుంటే మళ్లీ అది నొప్పులను పెంచేందుకే దోహదం చేయవచ్చు. అందుకే ఒకింత వేడిగా ఉండే నీళ్లు ఉండే పూల్స్‌లో ఈత మంచిది. పైగా ఆ వేడినీటి ప్రభావంతో (వార్మ్ బాత్ కారణంగా) కీళ్లనొప్పులూ బాగా తగ్గుతాయి. అయితే ఈత తర్వాత నేరుగా చల్లటి వాతావరణంలో వెళ్లకండి. పూల్ నుంచి బయటకు వచ్చాక ముందుగా కాసేపు బయటివాతావరణానికి మిమ్మల్ని మీరు అడ్జెస్ట్ చేసుకోండి. ఆ తర్వాతే బయటి వాతావరణంలోకి ప్రవేశించండి. ⇔ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడండి. ఒకవేళ మీరు ఆస్టియో ఆర్థరైటిస్ రోగులైతే చలి మీ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది కాబట్టి డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు వాడండి. అలాగే ఆహారంలో అది ఎక్కువగా ఉండే వెన్న, పాలు వంటి పదార్థాలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోండి. ⇔ ఈ సీజన్లో మీకు దెబ్బలు తగలకుండా చూసుకోండి. బయటకు వెళ్తున్నప్పుడు మంచి షూస్ ధరించడం, వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్ వంటివి ధరించండి. ⇔ ఈ సూచనలు పాటిస్తున్నా మీ కీళ్ల నొప్పులు ఎంతకూ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తగిన మందులు వాడాలి. ఇలా ఈ సీజన్లో కీళ్లనొప్పుల నుంచి, కండరాల నొప్పుల నుంచి వీలైనంత రక్షణ పొందవచ్చు.