గమన్ ఇన్ఫ్రా 9 ప్రాజెక్టుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ : గమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆరువేల కోట్ల రూపాయల విలువచేసే 9 ప్రాజెక్ట్ కంపెనీలను బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్ పీటీఈకు విక్రయించనున్నది. ఈ మేరకు కంపెనీ అనుబంధ సంస్థ గమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ (జీఐపీఎల్) ఒక ఒప్పందాన్ని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్ పీటీఈతో కుదుర్చుకుంది. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ఆరు రోడ్డు ప్రాజెక్టులు కాగా మూడు విద్యుత్ ప్రాజెక్టులని గమన్ ఇన్ఫ్రా బీఎస్ఈకి నివేదించింది. భారత ఇన్ఫ్రా రంగంలో ఒకేసారి ఇంత భారీ స్థాయిలో ఆస్తులు విక్రయించడం ఇదే మొదటిసారి.
రెండేళ్లు పూర్తియిన ప్రాజెక్టుల్లో వంద శాతం ఈక్విటీని విక్రయించుకోవడానికి హైవే డెవలర్స్కు కేంద్రం అనుమతించిన రెండు రోజుల్లోనే ఈ లావాదేవీ చోటు చేసుకోవడం విశేషం. విక్రయించనున ప్రాజెక్టుల్లో ఆంధ్రా ఎక్స్ప్రెస్వే, రాజమండ్రి ఎక్స్ప్రెస్వే ఉన్నాయి., అంతేకాకుండా వైజాగ్ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో 50 శాతం వాటా విక్రయానికి జీఐపీఎల్ బోర్డ్ ఆమోదం తెలిపింది.