విశాఖపట్నం– తిరుపతికి ప్రత్యేక రైళ్లు
* యథావిధిగా కాచిగూడ– గుంటూరు డెబుల్ డెక్కర్ రైలు
* ‘పల్నాడు’కు అదనపు కోచ్‌లు
నగరంపాలెం: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం– తిరుపతి– విశాఖపట్నంకు సువిధ డబల్డెక్కర్ రైలు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజను సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజరు కె.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై న్ నెం 82851 విశాఖపట్నం– తిరుపతి ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబరు 21, 28, డిసెంబరు 5,12,19, 26 తేదీల్లో విశాఖపట్నంలో 22.55 గంటలకు S బయలుదేరి న్యూగుంటూరు రైల్వేస్టేషన్‌కు మరుసటిరోజు 06.10/06.12కి చేరుకుంటుంది. తిరుపతికి 13.25 గంటలకు చేరుకుంటుంది. ట్రై న్నెం 82852 తిరుపతి– విశాఖపట్నం వీక్లీ ప్రత్యేక సువిధ రైలు నవంబరు 22,29, డిసెంబరు 6, 13, 20 ,27 తేదీల్లో తిరుపతితో 15.30 గంటలకు బయలుదేరి న్యూగుంటూరు స్టేషన్‌కు 22.20/22.22కు చేరుకుంటుంది.Sవిశాఖపట్నంకు మరుసటి రోజు 06.50కి చేరుకుంటుంది.
డబుల్ డెక్కర్ రైలు పునరుద్ధరణ..
ట్రైన్ నెం– 22118/ 22117 కాచిగూడ– గుంటూరు– కాచిగూడ ఎసీ డబుల్ డెక్కర్ రైలు సర్వీసును పునరుద్దరించి యధవిధిగా నడుపుతున్నట్లు తెలిపారు. ట్రైన్ నెం– 12747/12748 గుంటూరు– వికారాబాద్–గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు నవంబరు 11 నుంచి 30 వ తేది వరకు అదనంగా ఒక ఏసీ చైర్ కారును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.