voilent
-
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
హింసాత్మకంగా మారిన రిజర్వేషన్ల ఉద్యమం
ముంబై : రిజర్వేషన్ల కోసం మరాఠా సామాజిక వర్గం చేపట్టిన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల్లో మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా క్రాంతి మోర్చా గత కొంత కాలంగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం నిరసనల్లో పాల్గొన్న 28 ఏళ్ల రైతు కాకాసాహెబ్ శిండే గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ వర్గం నేతలు మంగళవారం రాష్ట్ర బంద్‌కు పిలిపునిచ్చారు. ఔరంగబాద్‌లో ఈ రోజు ఉదయం బంద్‌లో పాల్గొన్న ఓ నిరసనకారుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ.. బ్రిడ్జిపై నుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరాఠా సామాజిక వర్గం తలపెట్టిన ఈ బంద్ ప్రభావం పశ్చిమ మహారాష్ట్రతో పాటు, ఔరంగబాద్, ఉస్మాన్‌బాద్, బీడ్, అహ్మాద్‌నగర్ ప్రాంతాల్లో అధికంగా ఉంది. నిరసనకారులు ఔరంగబాద్‌లో పలు వాహనాలపై దాడికి దిగారు. ఉస్మాన్‌బాద్‌లో ప్రభుత్వ కార్యాలయాల ముందు టైర్లను కాల్చివేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ క్షమాపణలు చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని మరాఠా రిజర్వేషన్ల సమితి నేత రవీంద్ర పాటిల్ తెలిపారు. అవసరమైతే ముంబైలో తాము ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఆందోళనలపై ఫడ్నవీస్ స్పందిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధకరమని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఆందోళకారులను శాంతియుతంగా ఉండాలని కోరారు. కాగా ఫడ్నవీస్ ఆదివారం రోజున సోలాపూర్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా అక్కడ కొందరు మరాఠా నాయకులు తనపై దాడి చేస్తారనే కారణంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై సీఎం క్షమాపణలు చెప్పాలంటూ మరాఠా సామాజిక వర్గం నేతలు ఆందోళనలు చేపట్టారు. -
వామపక్షాల ర్యాలీ హింసాత్మకం
కోల్‌కతా: రైతుల సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ వామపక్షాలు గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీ హింసాత్మక రూపం దాల్చింది. రైతులంతా నిరసనకారులుగా మారగా పోలీసులు వారిని అడ్డుకునే చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొని పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. వామపక్ష నేతలు, కార్యకర్తలు, రైతుల్లో చాలామంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీపీఎం సెక్రటరీ సూర్జ్యా కాంత మిశ్రాను, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ , ప్రముఖ మావోయిస్టునేత బిమన్ బోస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యపట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమను ఒక ఆందోళనకారులుగా భావించి పోలీసులు ఇటుకలతో కొట్టారని ఆరోపించారు. దాదాపు 100 మంది ఇందులో గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా, ఈ ర్యాలీ పట్ల ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఈ వామపక్షాల ర్యాలీకి ఒక డిమాండ్, లక్ష్యం ఏమి లేదని అన్నారు. ర్యాలీకి వచ్చేవారు ఇటుకలు, బాంబులతో వస్తారా.. అలాంటి చర్యలు ఈరోజు వామపక్షాలు చేశాయి అని ఆరోపించారు. -
గుజరాత్లో పటేల్ గిరీ
-
గుజరాత్లో పటేల్ గిరీ
ఓబీసీలో చేర్చాలంటూ అహ్మదాబాద్‌లో భారీ ర్యాలీ * లేదంటే రాష్ట్రంలో బీజేపీ ఓటమి ఖాయమని హెచ్చరిక అహ్మదాబాద్: ఇతర వెనకబడిన తరగతుల్లో(ఓబీసీ) తమను చేర్చాలంటూ గుజరాత్‌లోని పటేల్ సామాజిక వర్గం చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి(పీఏఏఎస్) ఆధ్వర్యంలో మంగళవారం అహ్మదాబాద్‌లో ‘మహా క్రాంతి ర్యాలీ’ పేరుతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. పటేల్ వర్గాన్ని ఓబీసీల్లో చేర్చకపోతే 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, కమలం వికసించబోదని పీఏఏఎస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ హెచ్చరించారు. సీఎం ఆనందీబెన్ పటేల్ వచ్చి తమ నుంచి వినతి పత్రం స్వీకరించేంతవరకు వేదిక వద్దే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. పటేళ్ల కోసం పనిచేయని కాంగ్రెస్‌ను 1985లో రాష్ట్రంలో నేలమట్టం చేశామని, అదే తీరున వ్యవహరిస్తే బీజేపీకీ అదే గతి పడ్తుందన్నారు. ‘ఒక ఉగ్రవాది కోసం తెల్లవారుజామున సుప్రీంకోర్టును తెరిచారు. దేశం కోసం, యువత భవితవ్యం కోసం ఆ పనిచేయలేరా?’ అని ఆగ్రహంగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని 1.8 కోట్ల మంది పటేళ్లు రోడ్లమీదికొస్తే ప్రభుత్వమే ఓబీసీ కోటా ఇస్తుందన్నారు. అంతకుముందు, సుప్రీంకోర్టు తీర్పులను కారణంగా చూపుతూ పటేల్ వర్గాన్ని ఓబీసీల్లో చేర్చడానికి సంబంధించి తన అశక్తతను ఆనందీబెన్ పటేల్ పటేల్ సామాజిక వర్గ నేతలకు వివరించినప్పటికీ నిరసనను విరమించేందుకు వారు అంగీకరించలేదు. గుజరాత్లో ఆర్థికంగా, సామాజికంగా, సంఖ్యాపరంగా బలమైన పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో అహ్మదాబాద్ నగరం కొన్ని గంటలపాటు స్తంభించిపోయింది. ర్యాలీ సందర్భంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య.. అలాగే వాదజ్లో దళితులు, పటేల్ వర్గీయులకు మధ్య గొడవలు జరగడంతో నగరంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సిటీ బస్సులను తగలబెట్టి ధ్వంసం చేశారు.పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు దౌర్జన్యం చేయడం వల్లనే ర్యాలీ హింసాత్మకమైందని హార్దిక్ పేర్కొన్నారు. అంతకుముందు సభలో మాట్లాడుతూ.. తమ ఉద్యమం రాజకీయాలకు అతీతమైందన్నారు. దేశవ్యాప్తంగా తమకు 170 మంది ఎంపీలున్నారన్నారు. ‘బిహార్‌లోని నితీశ్ మావాడే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మావాడే’ అన్నారు. హార్దిక్ అరెస్ట్, విడుదల.. అనంతరం, మరో ముగ్గురితో కలిసి వేదిక వద్ద ఆమరణ దీక్షకు దిగిన హార్దిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాష్ట్రమంత్రి రజిని పటేల్ ఇంటికి నిప్పంటించే ప్రయత్నం చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడం తో కాసేపటి తరువాత హార్దిన్కు విడుదల చేశారు. -
'ఏం జరిగినా గుజరాత్ ప్రభుత్వానిదే బాధ్యత'
అహ్మదాబాద్: పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలంటూ హార్దిక్ పటేల్ అనే యువకుడి ఆధ్వర్యంలో జరుగుతున్న మహార్యాలీ ఘర్షణకు దారి తీసింది. అహ్మదాబాద్‌లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో వారు రిజర్వేషన్ వ్యతిరేకులతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీనిపై హార్దిక్ పటేల్ స్పందిస్తూ పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారన్నారు. లాఠీ చార్జి చేస్తున్నారని ఎవరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన ర్యాలీకి దాదాపు 60 వేలమంది హాజరయ్యారు.