
'ఏం జరిగినా గుజరాత్ ప్రభుత్వానిదే బాధ్యత'
అహ్మదాబాద్: పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలంటూ హార్దిక్ పటేల్ అనే యువకుడి ఆధ్వర్యంలో జరుగుతున్న మహార్యాలీ ఘర్షణకు దారి తీసింది. అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీలో వారు రిజర్వేషన్ వ్యతిరేకులతో గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతవారణం నెలకొంది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయడంతోపాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దీనిపై హార్దిక్ పటేల్ స్పందిస్తూ పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అనవసరంగా జోక్యం చేసుకున్నారన్నారు. లాఠీ చార్జి చేస్తున్నారని ఎవరికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. మంగళవారం నిర్వహించిన ర్యాలీకి దాదాపు 60 వేలమంది హాజరయ్యారు.