ఈ కార్ మైలేజీ 110 కి.మీ.
పేరు: ఫోక్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్ 1
రేటు: జస్ట్.. 94 లక్షలు
ఏంటి స్పెషాలిటీ: మామూలు కారైతే మహా అయితే లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుంది. ఈ కారు కొంటే.. లీటరు కొట్టిస్తే.. కనీసం 110 కిలోమీటర్లు తిరిగేయొచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మైలేజీ ఇచ్చే కారు(మనం రెగ్యులర్‌గా వాడుకునే వీలుండేది) అని రూపకర్తలు చెబుతున్నారు.
ఇంకా ఏమున్నాయ్: అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొం దించిన ఈ డీజిల్-ఎలక్ట్రిక్ హైబ్రీడ్ కారు తక్కువ బరువు(795 కిలోలు) ఉండటంతోపాటు తక్కువ కాలుష్యాన్నీ విడుదల చేస్తుంది. చెప్పుకోవడానికి హైబ్రీడ్ అయినా.. చూడ్డానికి లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోదు. ఏరోడైనమిక్ డిజైన్‌తో మన దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. సాధారణ కార్లకు ఉండేలా వీటికి వింగ్ మిర్రర్స్ లేవు. వాటి స్థానంలో చిన్నపాటి కెమెరాలను అమర్చారు. ఆ కెమెరాలే కారు లోపల ఉండే స్క్రీన్‌పై బయటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. అత్యధిక వేగం గంటకు 160 కిలోమీటర్లు. మైనస్సుల్లేవా: ఒక్కటే.. ఇందులో ఉండేవి 2 సీట్లే. అంటే వెనుక సీట్లు లేవన్నమాట.