పోలింగ్ కేంద్రంలో పిడుగుపడి.. ఒకరి మృతి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మహారాష్ట్రలోని 288 స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా, సావనీయ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో పిడుగు పడి ఒకరు మృతి చెందారు. తాడ్‌దేవ్ ప్రాంతంలోని గుజరాతీ పాఠశాలలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విదర్భ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది.