voter ID card linking aadhar card
-
ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ఎన్నికల గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఓటర్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోయినా ఓటర్ల జాబితాలో వారి పేరు కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అనుసంధానం పూర్తిగా ఐచ్ఛికమని పేర్కొంది. శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ఈ మేరకు బదులిచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం యోచన లేదు దేశంలో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో లేదని మరొక ప్రశ్నకు బదులుగా రిజిజు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు -
ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఆధార్‌తో ఓటర్ గుర్తింపు కార్డును అనుసంధానం చేస్తూ కేంద్రం తెచ్చిన వివాదాస్పద చట్టంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రభుత్వం శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో 24 గంటల వ్యధిలోనే ఆమోదింపజేసుకున్న ఈ చట్టంలో రాజ్యాంగ విరుద్ధమైన అంశాలున్నాయని పిటిషనర్ కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ఇలా చేయడం వల్ల ప్రజల గోప్యత, సమానత్వపు హక్కులకు ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ‘గుర్తింపు ప్రయోజనం కోసం‘ ఓటర్లుగా నమోదు చేసుకోవాలనుకునే వ్యక్తుల ఆధార్ నంబర్‌ను కోరేందుకు అనుమతిస్తుంది. ఆధార్–ఓటర్ ఐడీ లింకింగ్ కారణంగా దేశ పౌరులు కాని వారికి కూడా ఓటు హక్కు లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఎన్నికల సంఘం ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆధార్‌ను ఎలక్టోరల్ డేటాతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికల జాబితాలో పేర్లు పునరుక్తం కాకుండా, తప్పులు దొర్లకుండా చేయడమే తమ ఉద్దేశమని పేర్కొంటోంది. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. ఆధార్, ఓటర్ ఐడీ లింకింగ్ ఐచ్ఛికం మాత్రమే తప్పనిసరి కాదు. ఇది కూడా చదవండి: పోలీసులుంది ప్రజలకు భద్రత కల్పించడానికి.. మోదీకి బ్యానర్లు కట్టడానికి కాదు -
నిజామబాద్ ఫస్ట్, నల్గొండ సెకండ్
కరీంనగర్ : ఈ నెల 15లోగా ఓటర్లందరూ ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ సూచించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వంద శాతం అనుసంధానంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, 87 శాతం అనుసంధానంతో నల్గొండ జిల్లా రెండోస్థానం ఉందని తెలిపారు. ఇక 84 శాతంతో కరీంనగర్ జిల్లా మూడోస్థానంలో నిలిచినట్లు చెప్పారు. హైదరాబాద్ మినహా తెలంగాణలో 80 శాతం ఆధార్‌తో అనుసంధానం జరిగిందని భన్వర్‌లాల్ తెలిపారు. ఆధార్ కార్డు లేనివారి కోసం మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటరు గుర్తింపు అడ్రసు, ఆధార్ కార్డు అడ్రస్‌కు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.