పంజాబ్లో 48 చోట్ల రీపోలింగ్
చండీగఢ్: ఈ నెల 4న పంజాబ్ పోలింగ్ సమయంలో ఓటర్ వెరిఫైడ్ ఆడిట్ పేపర్ ట్రేల్(వీవీపీఏటీ) ఈవీఎం యంత్రాలు మెరాయించిన 48 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఫిబ్రవరి 9న ఈ పోలింగ్ మాజితా, ముక్త్సర్, సంగ్రూర్ నియోజక వర్గాల్లో జరుగుతుంది. అలాగే మాక్ పోల్స్ సందర్భంగా పోలైన ఓట్లను ఈవీఎంలు చూపిన మోగా, సర్దుల్గఢ్ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరుగుతుంది.
పంజాబ్లో ఈసీ తొలిసారి వీవీపీఏటీని 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 6668 పోలింగ్ కేంద్రాల్లో, అమృత్సర్ లోక్సభ స్థానం పరిధిలోని రెండు సెగ్మెంట్లలో ఉపయోగించింది. ఓటింగ్ యంత్రాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా మాజితాలో 25 కేందాల్లో, సంగ్రూర్, ముక్త్సర్లలో పదేసి కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యమైంది. దీనిపై నివేదిక సమర్పించాలని ఈసీ పంజాబ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.