కవలల పుట్టుకకు కారణం..
న్యూయార్క్: కొంత మంది మహిళలు ఒకే పోలిక లేని కవలలకు జన్మనివ్వడానికి రెండు జన్యువులు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సదరు మహిళ బంధువుల్లో ఒకే పోలిక లేని కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ గనుక ఉంటే ఆమె కూడా కవలలకు జన్మనిచ్చే అవకాశాలు ఉంటాయని నెదర్లాండ్స్‌లోని వ్రిజే వర్సిటీ శాస్త్రవేత్త బూమ్సా తెలిపారు.
కొంతమందికి కవలలు జన్మిస్తే మరికొంత మందికి ఎందుకు కలగరు? ఈ ప్రశ్న చాలా తేలిగ్గా ఉన్నప్పటికీ దీనికి వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనడానికి ఇది ఉపయోగపడిందని పేర్కొన్నారు. రెండు జన్యువుల వల్లే కవలలు జన్మిస్తారని కనుగొన్నట్లు వెల్లడించారు. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, యూఎస్ కవలల జన్యు డేటా క్రోడీకరించి ఫలితాలను రాబట్టామన్నారు.