అడ్డొస్తే చంపేస్తాం..!
సిరిసిల్ల క్రైం: అడ్డదారిలో ఇసుక తరలిం చొద్దని సూచించిన వీఆర్వోను ఇసుకాసు రులు చంపుతామని బెదిరించారు. బాధిత వీఆర్వో సంతోష్ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు వాగు నుంచి స్థానిక అవసరాలకు ఇసుక తరలిం చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇసుక అవసరమైన వారు తొలుత మున్సిప ల్ అధికారులకు దరఖాస్తు చేయాలి. వారి చ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకులో డీడీ చెల్లించి రెవెన్యూ కార్యాలయంలో సమర్పిం చాలి.
అధికారులు దానిని పరిశీలించి ఇసుక తరలించడానికి అవసరమైన వేబిల్లులను వీఆర్వో ద్వారా ఇస్తారు. దీని ఆధారంగా వారంలో మంగళ, గురు, శనివారాల్లోనే రోజూ 200–400 ట్రిప్పుల వరకు ఇసుక తర లించేందుకు అవకాశం ఉంటుంది. కానీ, అధికారుల పర్యవేక్షణ లోపం, రద్దీని ఆసరా చేసుకున్న కొందరు ఇసుకాసురులు నిబంధ నలు అతిక్రమించి ఇసుక తరలిస్తున్నారు. గురువారం సైతం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక తరలిస్తూ సిరిసిల్ల వీఆర్వో సంతోష్ కంటప డ్డాడు.
ఆ వాహనాన్ని ఆపిన వీఆర్వో వే బిల్లు చూపాలని ట్రాక్టర్ డ్రైవర్ను కోరగా... ట్రాక్టర్ను పక్కన పెడతానని చెప్పిన డ్రైవర్, కొంత దూరం వెళ్లి, ఇసుకను రోడ్డుపై పోసి ఉడాయించాడు. ఆ తర్వాత ట్రాక్టర్ యజ మానినంటూ అక్కడకొచ్చిన ఓ వ్యక్తి... ‘ఎవడివిరా నువ్వు.. నా ట్రాక్టర్నే ఆపుతా వా? అడ్డొస్తే... చంపేస్తా’ అని బెదిరించాడు. ఇతర ట్రాక్టర్ యజమానులు జోక్యం చేసుకోవడంతో వివాదం సమసిపోయింది. సదరు ట్రాక్టర్ యజమానిపై ఫిర్యాదు చేస్తానని వీఆర్వో సంతోష్ తెలిపారు.