రెవెన్యూ శాఖది కీలకపాత్ర
మహబూబ్నగర్ న్యూటౌన్ : ప్రజాసేవలో రెవెన్యూ శాఖది కీలకపాత్ర అని జేసీ ఎం.రాంకిషన్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వీఆర్వోలు, మీసేన ఆపరేటర్లకు వెబ్ల్యాండ్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో టీంవర్క్ ముఖ్యమన్నారు. మ్యుటేషన్ దరఖాస్తులు ఎందుకు పెండింగ్లో ఉంచుతున్నారని వీఆర్వోలను ప్రశ్నించారు. పనుల్లో పురోగతి పెంచాలని, ఎల్ఈసీ కార్డుల జారీ, మ్యుటేషన్లు, సాదాబైనామా, ప్రభుత్వ భూముల పరిశీలనపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్ఐసీ డీఐఓ మూర్తి, మీసేన సూపరింటెండెంట్ బక్కా శ్రీనివాసులు పాల్గొన్నారు.