పీలేరులో వ్యక్తి దారుణ హత్య
పీలేరు(చిత్తూరు జిల్లా): పీలేరులో తిరుపతి వెళ్లే మార్గంలో వీఎస్ఆర్ కల్యాణ మండపం వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలను మొండెం నుంచి వేరు చేశారు. చనిపోయిన వ్యక్తి వయసు 35 నుంచి 40 మధ్య ఉండవచ్చు.
స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.