Vugar gashimov memorial international chess tournament
-
ఆనంద్‌కు మూడో గెలుపు
షామ్‌కిర్ (అజర్బైజాన్) : వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయం సాధించాడు. మమెదైరోవ్ (అజర్బైజాన్)తో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 38 ఎత్తుల్లో గెలిచాడు. ఈ విజయంతో ఆనంద్ పాయింట్ల పట్టికలో 5.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. దాంతోపాటు మరోసారి 2800 ఎలో రేటింగ్‌ను అందుకొని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు. -
ఆనంద్‌కు తొలి గెలుపు
షామ్‌కిర్ (అజర్బైజాన్) : వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తొలి విజయాన్ని సాధించాడు. వరుసగా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్‌కు ఐదో రౌండ్లో విజయం దక్కింది. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోతో మంగళవారం జరిగిన ఐదో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన ఆనంద్ 45 ఎత్తుల్లో గెలుపొందాడు. ఈ టోర్నీలో వెస్లీ సోకిదే తొలి ఓటమి కావడం గమనార్హం. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం జరిగే ఆరో రౌండ్లో రవూఫ్ మమెదోవ్ (అజర్బైజాన్)తో ఆనంద్ తలపడతాడు.