Wage agreement
-
గుడ్‌న్యూస్! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..
గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్ అలవెన్స్ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది. ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్(ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్(హెచ్ఎంఎస్), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్(బీఎంఎస్) పాల్గొన్నారు. -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ!
ఐబీఏ-ఉద్యోగ సంఘాల సంతకాలు ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఒక వేతన ఒప్పందంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంతకం చేసింది. ఐబీఏ, ఉద్యోగ సంఘాల, ఆఫీసర్స్ అసోసియేషన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2012 నవంబర్ 1వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఈ తాజా వేతన సవరణ అమలవుతుంది. ఈ 15 శాతం వేతన పెంపు.. ఇంక్రిమెంటల్ వేతనం, అలవెన్సుల రూపంలో బ్యాంకులపై ఏడాదికి రూ.4,725 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది. పదవీ విరమణ వ్యయ భారాలను సైతం కలుపుకుంటే ఈ భారం రూ.8,370 కోట్లని ఐబీఏ చైర్మన్ టీఎం భాసిన్ సోమవారం నాడు ఇక్కడ విలేకరులకు తెలిపారు. సాధారణ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. అధికారుల విషయంలో ఈ శ్రేణి 4 నుంచి 6 నెలల కాలమని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. సెలవు దినాలకు సంబంధించి ఆర్బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందనీ, ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు.