ఐబీఏ-ఉద్యోగ సంఘాల సంతకాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులుసహా 43 బ్యాంకులకు చెందిన దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు ఒక వేతన ఒప్పందంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సంతకం చేసింది. ఐబీఏ, ఉద్యోగ సంఘాల, ఆఫీసర్స్ అసోసియేషన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, 2012 నవంబర్ 1వ తేదీ నుంచీ వర్తించే విధంగా ఈ తాజా వేతన సవరణ అమలవుతుంది. ఈ 15 శాతం వేతన పెంపు.. ఇంక్రిమెంటల్ వేతనం, అలవెన్సుల రూపంలో బ్యాంకులపై ఏడాదికి రూ.4,725 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది.
పదవీ విరమణ వ్యయ భారాలను సైతం కలుపుకుంటే ఈ భారం రూ.8,370 కోట్లని ఐబీఏ చైర్మన్ టీఎం భాసిన్ సోమవారం నాడు ఇక్కడ విలేకరులకు తెలిపారు. సాధారణ ఉద్యోగులకు బకాయిలు వెంటనే చెల్లించడం జరుగుతుందని అన్నారు. అధికారుల విషయంలో ఈ శ్రేణి 4 నుంచి 6 నెలల కాలమని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులకు త్వరలో రెండవ, నాల్గవ శనివారాలు సెలవు దినాలుగా ఉంటాయి. సెలవు దినాలకు సంబంధించి ఆర్‌బీఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందనీ, ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు.
బ్యాంకింగ్‌లో 15% వేతన పెంపు షురూ!
Published Tue, May 26 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM
Advertisement
Advertisement