మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు | Bad loans exceed market value of public sector banks | Sakshi
Sakshi News home page

మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు

Published Mon, Feb 22 2016 1:54 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు

మార్కెట్ విలువను మించిన పీఎస్‌యూ బ్యాంకుల ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రూ. 100కు సమానమైన షేర్లు మీ దగ్గర ఉన్నాయా ? అయితే రూ.150 విలువైన మొండి బకాయిల భారం మీ నెత్తిన ఉన్నట్లే. ప్రభుత్వ రంగ బ్యాంకుల మార్కెట్ విలువకు ఒకటిన్నర రెట్లకు అంటే రూ. 4 లక్షల కోట్లకు మొండి బకాయిలు పేరుకుపోయాయి. మొండి బకాయిలుగా మారే అవకాశమున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మొండి బకాయిల విలువ రెట్టింపై రూ.8 లక్షల కోట్లకు చేరతాయని అంచనా.  ప్రైవేట్ రంగ బ్యాంకుల మొండి బకాయిలు ఈ బ్యాంకుల విలువలో 7% వరకే ఉన్నాయి.  

గతేడాది డిసెంబర్ 31 నాటికి ఎస్‌బీఐ సహా మొత్తం లిస్టైన 24 బ్యాంకుల మొండి బకాయిలు రూ.3,93,035 కోట్లుగా ఉన్నాయి. ఇది  ఈ 24 బ్యాంకుల మార్కెట్ విలువ రూ.2,62,955 కోట్లతో పోల్చితే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. బ్యాంక్‌లు ఇచ్చిన రుణాల్లో మూడు నెలలలోపు ఎలాంటి చెల్లింపులు రుణగ్రస్తుడి నుంచి రాకపోతే ఆ రుణాన్ని మొండి బకాయిగా వ్యవహరిస్తారు. ఎస్‌బీఐ మినహా చాలా బ్యాంక్‌ల స్థూల మొండిబకాయిలు వాటివాటి మార్కెట్ విలువను మించి పోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement