వేతన సవరణపై ఈయూతో నేడు చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరగాల్సిన వేతన సవరణపై ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ)తో శుక్రవారం సంస్థ యాజమాన్యం చర్చలు జరపనుందని సంఘం ప్రధా న కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా నిలిచిపోయిన చర్చలను ఆర్టీసీ యాజమాన్యం మళ్లీ ప్రారంభించిందన్నారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.