Wage employees
-
‘ఆకాశం’లోకి నేల జారిపోతోంది
వడ్డీల్లో వేతన జీవులు.. హైదరాబాద్‌లో ఓ ఐటీ ఎంప్లాయ్.. ఉద్యోగంలో చేరి మూడేళ్లయ్యింది. లక్ష దాకా శాలరీ వస్తోంది. ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. అదీ ఆఫీసుకు 20 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడాయన తన శాలరీలో 50 వేలు ఈఎమ్ఐ కడుతున్నాడు. అలా 20 ఏళ్లు కట్టాలి. ఇక మధ్య బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచితే మరో ఐదేళ్లు.. అంటే ఈ కిస్తులు రిటైర్మెంట్ దాకా పోయినా ఆశ్చర్యం లేదు. అంటే జీతంలో సగం. అసలే ప్రైవేటు ఉద్యోగం.. ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో తెలియదు. పప్పు, ఉప్పు లాంటి నిత్యావసర సరుకులు కాసింత పెరిగి తేనే నెలాఖరుకు ఇబ్బంది పడే మధ్యతరగతి ఉద్యోగి జీతంలో సగం తలదాచుకోవడానికి పెట్టాల్సివస్తోంది. లైఫ్ క్వాలిటీని నిలువెల్లా తినేస్తోంది. మధ్యతరగతి జీవితం నుంచి బయటపడాలి, ఐదంకెల జీతం రావాలి అని పాతికేళ్లు చదివి లక్ష రూపాయల ఉద్యోగం దాకా చేరిన వారు. అంతులేకుండా పెరిగిన ఇళ్ల ధరల కారణంగా బొటాబొటి ఆదాయంతోనే బతికే పరిస్థితి వచ్చింది. మళ్లీ అదే మధ్యతరగతి... అదే నెలాఖరు. లోన్లు, వడ్డీలు నడ్డి విరుస్తుంటే జీవితం ఎప్పుడూ చేబదుల్లోనే ఉంటోంది. నిత్యావసరమైన నేల అంగడి సరుకయ్యింది. బంగారంలా పెట్టుబడి అయ్యింది. పేద మధ్య తరగతి కాళ్లకిందనుంచి నేల జారిపోయింది. నేల.. ఓ సేల్ డీడ్ డబ్బు పెరిగి పిల్లలు పెట్టాలంటే ఆర్థిక నిపు ణులు మూడు విధాలుగా పెట్టుబడి పెట్టడం మార్గంగా చెబుతున్నారు. ఒకటి రియల్ ఎస్టేట్, రెండవది బంగారం కొనడం, మూడవది షేర్ మార్కెట్లో మదుపు చెయ్యడం. ఈ మూడు విధాలుగా దాచే డబ్బూ విలువ పెంచుతుంది. ఇప్పుడీ మూడింటిలో మనిషికి నీడనివ్వాల్సిన నేల ధనికుల పెట్టెల్లో షేర్ పత్రాల్లాగా సేల్ డీడ్స్ రూపంలో పడి ఉంటోంది. స్టాక్ మార్కెట్ తర్వాత ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే రంగం ఇదే అయ్యింది . ట్యాక్స్ కట్టని నల్లడబ్బు పునాదుల మీద రియల్ ఎస్టేట్ ‘హైరైజ్’లో ఉంది. సర్కార్.. మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ మదుపు చేసేవారంతా అవినీతి పరులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే అని నిర్ధారించడం కాదు.. నేల వ్యాపారం అయితే దాని విలువ నిలువ నీడ లేకుండా చేస్తుంది. ఈ ధోరణిని మార్కెట్టే కాదు.. సర్కారు కూడా ఎంకరేజ్ చేస్తోంది. కోకాపేటలో ఎకరం వందకోట్లు, నియో పోలీస్ లలో వంద కోట్లు.. బుద్వేల్‌లో 46 కోట్లు.. ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు కొనొచ్చు.. ఇవన్నీ నిజంగా గర్వ పడాల్సిన మాటలేనా..? ఈ చుట్టు పక్క ప్రాంతాల వైపు సాధారణ ప్రజలు కన్నెత్తి చూడ లేస్తారా...? పేద, మధ్యతరగతికి ఆరడుగుల నేల దూరం చేసే ధోరణి కాదా...? మెజారిటీ ప్రజలు తమ జీవిత కాలంలో ఒక ఇల్లు కొనుక్కోవటమే గగనం. ఎలాగోలా కష్టపడి కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువ మొత్తం బ్యాంకు లోన్ తీసుకుంటే తప్ప ఆ ఒక్క ఇల్లు కొనటం కూడా సాధ్యం కాదు. ఓ వంద గజాలు కొనుక్కోవాలంటే ఆ ఇంటి అప్పు తీర్చటానికి జీవిత కాలం పడుతుంది. ఇలాంటి వారికి ఎక రాలు, అవి సర్కారుకు అందిస్తున్న వందల కోట్లు ఆనందాన్నిస్తాయా...? రాష్ట్రం ప్రగతి ప«థంలో పడుతుందన్న సంబురాన్నిస్తుందా? తలదాచుకోవడానికి ఉపయోగపడాల్సిన నేల, ఇల్లు .. రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారి దాని లోకి నేరుగా ప్రభుత్వాలే దిగడం మరింత ఆందోళనకరం. ఇది క్రమంగా రాజకీయాలకు అవసరంగా, ఎన్నికల ఇంధనంగా మారిపోయింది. క్రమంగా స్థిరాస్తి రంగం అన్ని రంగా లను శాసిస్తోంది. పెద్ద పెద్ద తలకాయలు అన్ని దీనిలో తలదూర్చాయి. మెజారిటీ ప్రజల మీద వీర విహారం చేస్తున్నాయి. ఈ ధోరణి నగరాల నుంచి క్రమంగా పల్లెల మీద పడింది. వ్యవసాయ భూముల్లో కలుపు మొక్క ల్లాగా పెరుగుతోంది. స్టీల్, సిమెంట్, ఇసుక, ఇటుక, టైల్స్, గ్రానైట్, ఒకటేమిటి... చాలా రంగాలు, వ్యాపారాలు రియల్ ఎస్టేట్‌తో ముడి పడి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అన్ని రంగాలను శాసిస్తోంది. ఇప్పుడివన్నీ రాజకీయ నాయకులు, పెద్దల చేతుల్లోకి వెళ్లి పోయాయి. 30 మంది.. 8,000 ఇళ్లు.. ఇది మన ఒక్కరి సమస్యే కాదు. ఉదాహరణగా, ఈ వార్త చూడండి.. దక్షిణ కొరియాకు సంబంధించినది. 30 మంది వ్యక్తులు ఐదున్నర సంవత్సరాల కాలంలో 8,000 ఇళ్ళు కొనుగోలు చేశారు. వీటి మొత్తం విలువ మన భారతీయ కరెన్సీలో 7,446 కోట్ల రూపాయలు. 2018 సంవత్సరం నుంచి 2023 జూన్ మధ్య కాలంలో ఈ ముప్పై మంది 8,000 ఇళ్ళు కొనుగోలు చేశారు. చైనాలో 100 కోట్ల ఇళ్లు ఖాళీ.. మితి మీరిన వ్యాపారం ఎక్కడికి దారి తీస్తుందో చైనా వార్త చెబుతుంది. ఇక్కడ దాదాపు 100 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉన్నా యట. ఇప్పటికే దే«శవ్యాప్తంగా నిర్మాణాల్లో ఉన్న నివాస గృహాలన్నీ అందుబాటులోకి వస్తే 300 కోట్ల మందికి సరిపోతాయట. చైనా దేశ స్టాటి స్టిక్స్ బ్యూరో మాజీ డిప్యూటీ హెడ్ హే కేంగ్ స్వయంగా చెప్పిన విషయం ఇది. చైనా జీడీపీలో 30 శాతం రియల్టీదే. ఇప్పుడా రంగమే చైనాకు పెను భారమైంది. వ్యాపార కాంక్షతో హైదరా బాద్ చుట్టూ ఆకాశం దాకా విస్తరిస్తున్న కాంక్రిట్ జంగిల్‌కు ఇదో హెచ్చరిక. స్థలాలు, గృహాల ధరలు పరిమితికి మించి పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరంలో ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గిపోతున్నాయి. ఓ ప్రైవేటు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ అంచనా ప్రకారం.. 2022 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లో 1,460 కొత్త ఇళ్లు అమ్ముడవగా.. 2023లో ఇదేకాలానికి 720 ఇళ్లే అమ్ముడ య్యాయి. స్థలాలు, ఇళ్ల ధరలు పెరిగిపోవడమే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలే చెప్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మూడు, నాలు గేళ్ల కింద వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్ సుమారు రూ. 50 లక్షల్లో వస్తే.. ఇప్పుడది రూ. 70 లక్షల నుంచి రూ. 90 లక్షల వరకు పెరిగిందని అంటున్నాయి. వీధుల్లో పేదలు.. వేతన జీవుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక పేదల పరిస్థితి ఏమిటి..? ► 27 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతి లక్ష మందికి ఫ్రాన్స్‌లో 217 మంది, యూఎస్‌లో 177, చిలీలో 155, ఐర్లాండ్‌లో 78, స్పెయిన్ లో 49, పోర్చుగల్‌లో 20 మంది పూర్తిగా నిరాశ్రయులే. ► సొంత ఇల్లు, ఉపాధి లేక.. షెల్టర్లలో ఆశ్రయం పొందినవారూ ఈ దేశాల్లో ఉన్నారు. యూకేలో 7.7 శాతం, యూఎస్‌లో 6.2 శాతం, ఇటలీలో 4 శాతం, బెల్జియంలో 3.4 శాతం, జర్మనీలో 2.4 శాతం మంది తాము జీవితంలో ఒకసారైనా ఇలాంటి పరిస్థితిని అనుభవించామని ఒక సర్వేలో వెల్లడించారు. ► ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. జపాన్‌లో నిరాశ్రయుల సంఖ్య అతి తక్కువ. ఉత్తమ గృహ కల్పన విధానాలు, డ్రగ్స్ నియంత్రణ, మానసిక ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటివి దీనికి కారణం. ► ప్రపంచంలో నిరాశ్రయుల సంఖ్య అతిఎక్కువగా ఉన్న దేశం నైజీరియా. అక్కడి జనాభాలో 12 శాతం వరకు నిరాశ్రయులే. ► మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం పలు పథకాలను అమలు చేస్తున్నా, యూఎన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ నివేదిక ప్రకారం... మన దేశ జనాభాలో 6.7 శాతం నిరుపేదలే. వీరిలో చాలా మంది నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న వారే. దీనికి సంబంధించి ‘కోల్డ్ అండ్ అన్ కేర్డ్ ఫర్ (సీఏయూఎఫ్) సొసైటీ’ తమ నివేదికలో పలు కీలక అంశాలను వెల్లడించింది. ► దేశంలోని చాలా నగరాల్లో ఇళ్లు, స్థలాల ధరలు పేదలకు అందుబాటు ధరల్లో లేకపో వడం సమస్యగా మారింది. కనీసం అద్దెలను కూడా భరించలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆదాయ అసమానతలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వివక్ష వంటివి కూడా.. ఇళ్లు కొన లేకపోవడానికి కారణమవుతున్నాయి. ► దేశంలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో ఇళ్లులేని పేదల సంఖ్య ఎక్కువగా ఉంది. - సారాంశం: సరికొండ చలపతి -
30, 31 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసి యేషన్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 30, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) ఏపీ, తెలంగాణ శాఖలు వెల్లడించాయి. సమ్మె కారణంగా దేశంలోని బ్యాంక్‌లు మూతపడనున్నాయని, ఖాతాదారులు పరిస్థితిని అర్థం చేసుకొని ఉద్యోగులకు సహకరించాలని బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూఎఫ్‌బీయూ కన్వీనర్ వీవీఎస్ఆర్ శర్మ కోరారు. వేతన సవరణ త్వరితగతిన అమలు చేయాలని, అధికారులకు వేతన సవరణతోపాటు పాక్షిక ఆదేశాలను అమలు చేయాలని దేశంలో 10 లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 5 ఉద్యోగుల, 4 అధికారుల సంఘాల సంయుక్త వేదిక, యూఎఫ్బీయూలు సమ్మె బాటపట్టాయని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు 2017 నవంబర్ నుంచి వేతన సవరణ జరపాల్సి ఉండగా ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదన్నారు. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. ప్రతియేటా ప్రభుత్వరంగ బ్యాంకులు నికరలాభం సంపాదిస్తున్నా, లాభాల్లో వస్తున్న తరుగుదలను కుంటిసాకుగా చూపి కేవలం 2 శాతం వేతన పెంపును ప్రతిపాదించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో పి.వెంకటరామయ్య (బీఈఎఫ్ఐ), అనిల్‌కుమార్, గిరిశ్రీనివాస్ (ఏఐబీవోఏ), బి.సుక్కయ్య (ఏఐబీఓసీ), టి.వెంకటస్వామి (ఐఎన్‌బీఈఎఫ్)లు పాల్గొన్నారు. -
జీతం నిలిపివేత..!
వివరాల సమర్పణలో ఉద్యోగుల నిర్లక్ష్యం 6,081 మంది మాత్రమే సమర్పించిన వైనం ఆగిన 3,537 మంది ఉద్యోగుల వేతనం 31 అంశాలతో ఎంప్లాయి డేటా ఫాం ఆయా శాఖల వారీగా వివరాల సేకరణ మార్చి 15 వరకు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ వివరాల సమర్పణకు మార్చి 3 నుంచి అవకాశం కరీంనగర్ సిటీ : ఉద్యోగుల సమగ్ర సమాచార సేకరణలో నిర్లక్ష్యానికి తగిన మూల్యం.. ప్రభుత్వ కఠిన నిర్ణయంతో జిల్లాలోని 3,537 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఫిబ్రవరి నెల జీతం నిలిచిపోయింది. దాదాపు రూ.60 కోట్ల జీతాలు ఆపినట్లు జిల్లా కోశాగార అధికారుల ద్వారా తెలిసింది. ఆన్లైన్లో కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 31 అంశాలతో కూడిన ఎంప్లా యి డేటా ఫాంను రూపొందించి వివరాలు సేకరించాలని ఆదేశించినా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగులు స్పందించలేదు. రెండు దఫాలుగా ఈ నెల 10, 25 తేదీల్లోగా అవకాశమిచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించడంతో çసర్కారు ఆదేశాల మేరకు జీతాలు ఆగిపోయాయి. కరీంనగర్ సిటీ : రాష్ట్ర విభజన, జిల్లాల విభజన, ఉద్యోగుల విభజన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి సచివాల యం వరకు ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం వద్ద లేకుండాపోయాయి. దీంతో ఆ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో కం ప్యూటరీకరించాలని నిర్ణయించింది. అవకతవకలకు చెక్‌పెడుతూ భవిష్యత్తులో ఖాళీల భర్తీకి అవకాశముంటుందని భావించారు. అందుకు శాఖలవారీగా ఎంత మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు? నేపథ్యం, జీతం, కుటుంబ వివరాలు, సెలవులు, పీఆర్సీ, తీసుకున్న రుణాలు తదితర సమగ్ర వివరాలను సేకరించేందుకు 31 అం శాలతో కూడిన ఎంప్లాయి డేటా ఫాం రూ పొందించారు. అందులో సమగ్ర వివరాలు పొందుపరిచి ఈ నెల 25లోగా సమర్పించాలని డెడ్‌లెన్ విధించారు. లేనిపక్షంలో ఫిబ్రవరి నెల జీతం నిలిపివేస్తామని హెచ్చరించి నా 40 శాతం మంది ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. ట్రెజరీలో ఆయా శాఖల్లోని ఉద్యోగుల జీతాల బిల్లుల రిజిస్టర్ ఆధారంగా జిల్లాలో 12,952 మం జూరు పోస్టులున్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో 9,618 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 3,334 పోస్టు లు ఖాళీలున్నట్లు అంచనా వేశారు. ఫిబ్రవరి 15లోగా అందిస్తే మార్చిలోగా ఆన్లైన్లో కంప్యూటరీక రించేందుకు అవకాశముంటుందని ముందుగా భావిం చారు. ఈ నెల 25 వరకు గడువు విధించగా 6,081 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి మాత్రమే ఎంప్లా యి డేటా ఫారంలు ట్రెజరీకి అందాయి. ఇంకా 3,537 మంది ఉద్యోగుల నుంచి అందాల్సి ఉంది. డేటా ఫారంతోపాటు ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే ఫిబ్రవరి నెల జీతం అందే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులను ట్రెజరీ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మార్చి 15లోగా ఉద్యోగుల వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేసేందుకు గడువు విధించారు. ప్రతీ ఉద్యోగి ఎంప్లాయి డేటా ఫారంలోని ప్రతీ అంశాన్ని పూరించాల్సి ఉంది. నెలసరి వేతనం, పాన్ నెంబర్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, వైద్య ఖర్చు లు, ఆధార్, ఈ మెయిల్, చిరునామా, కుటుంబ సభ్యు లు, తల్లిదండ్రులు, వారి వయస్సు, విద్యార్హతలు, ఆరో గ్య పరిస్థితి తదితర విషయాలను ఫారంలో పొందుపరిచారు. ఇతరత్రా సౌకర్యాలు అందించేందుకూ ఈ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ఒక్కో ఉద్యోగికి 4,5 ఎంప్లాయి ఐడీలుండడంతో నెలస రి వేతనాల్లో అవకవతవకలు జరిగే అవకాశం ఏర్పడిం ది. కొంత మందికి బదిలీలు, పదోన్నతుల క్రమంలో ఐడీలు మారుతుండడంతో రెండు రకాల జీతాలు తీసుకున్న సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఎంప్లా యి డేటా ఫారంలో ప్రతిఒక్కరూ కుటుంబ వివరాలతోపాటు పాన్‌కార్డు నంబర్, ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉండడంతో ఇలాంటి అవకతవకలకు పాల్ప డే అవకాశముండదని అధికారులు చెబుతున్నారు. ఇక పై మూడు నెలలకోసారి ఆదాయ వ్యయం చెల్లింపులు (రిటర్న్స్) దాఖలు చేయాల్సిందేనంటున్నారు. ఏ పీఆ ర్సీలో జీతం పొందుతున్నారు? ఎంత డబ్బు డ్రా చేస్తున్నారు? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నా రు. సేకరించిన వివరాలను ఆర్థికశాఖ, సాధారణ పరి పాలనశాఖతోపాటు సంబంధిత శాఖల వద్ద నిక్షిప్తం చే యనున్నారు. ఉద్యోగుల సమగ్ర సమాచారంతో వారి సంక్షేమంతో పాటు భవిష్యత్తు కార్యాచరణకు వెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్చి 3 నుంచి మరోసారి డేటా ఫారాలు సమర్పించేందుకు అవకాశమిచ్చారు. డేటా ఫారంలు సమర్పించిన వారి జీతాల బిల్లులను ఆమోదించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
పీఆర్సీకి లైన్ క్లియర్
అడ్వాన్సుమెంట్ స్కేళ్ల జీవో జారీ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన స్థిరీకరణకు అవసరమైన ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కేళ్ల జీవోను రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసింది. తొమ్మిదో పీఆర్సీ అమ లు చేసిన సిఫారసులను యథాతథంగా పదో పీఆర్సీలోనూ వర్తింపజేసింది. గతంలో ఉన్న మార్గదర్శకాలనే ఇందులో పొందుపరిచింది.కాగా 2013 జులై ఒకటో తేదీ నుంచే ఈ ఆటోమేటిక్ అడ్వాన్సుమెంట్ స్కేళ్లు వర్తింపజేయడం విశేషం.నగదు ప్రయోజనాన్ని సైతం 2014 జూన్ రెండో తేదీ నుంచి చెల్లించనుండటం గమనార్హం. కాగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలిచ్చిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోకపోవటం ఉద్యోగులను నిరాశకు గురి చేసింది. ప్రతీ అయిదేళ్లకోసారి 25 ఏళ్ల వరకు యాంత్రిక పదోన్నతుల స్కేళ్లు ఇవ్వాలని సంఘాలు విజ్ఞప్తి చే శాయి. ఈసారీ ఆరేళ్లకోసారి ఇచ్చే విధానాన్నే ప్రభుత్వం కొనసాగిం చింది. కింది కేడర్‌లో 24 ఏళ్ల యాంత్రిక పదోన్నతుల స్కేలు పొందిన తర్వాత రెగ్యులర్ ప్రమోషన్ పొందితే ఆ ఉద్యోగికి మళ్లీ యాం త్రిక పదోన్నతుల స్కేళ్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీన్నీ పరిగణనలోకి తీసుకోలేదు. రెగ్యులర్ ప్రమోషన్ వస్తే.. ఎఫ్ఆర్ 22(బీ) 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరితే.. ఒకే ఇంక్రిమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. బకాయిల చెల్లింపుపై మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కారుకు రూ.6 లక్షల అడ్వాన్స్ ప్రభుత్వ ఉద్యోగులకిచ్చే రుణాలపై ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కారు కొనుగోలుకు రూ.6 లక్షలు లేదా మూల వేతనంపై 15 రెట్లు... ఏదీ తక్కువైతే అది రుణంగా అంది స్తుంది. మోటార్ సైకిల్‌కు రూ.80 వేలు, మోపెడ్‌కు రూ.35 వేలు, సైకిల్‌కు రూ.10 వేలు అడ్వాన్సుగా తీసుకోవచ్చు. ఉద్యోగులు తమ కుమార్తె లేదా కుమారుడి పెళ్లిళ్లకు రూ. 75 వేల నుంచి రూ.2లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. కంప్యూటర్‌కు రూ.50 వేలు, పండుగ అడ్వాన్సులకు రూ.5 వేల నుంచి రూ.7,500, ఎడ్యుకేషన్ అడ్వాన్సుగా ఏడాదిలో ఒకసారి 7,500 రుణం తీసుకోవచ్చు. కాగా పండుగ అడ్వాన్సుపై ప్రభుత్వ జీవోలో తప్పు దొర్లింది. ఇది ఉద్యోగులను అయోమయానికి గురిచేసింది.