వివరాల సమర్పణలో ఉద్యోగుల నిర్లక్ష్యం
6,081 మంది మాత్రమే సమర్పించిన వైనం
ఆగిన 3,537 మంది ఉద్యోగుల వేతనం
31 అంశాలతో ఎంప్లాయి డేటా ఫాం
ఆయా శాఖల వారీగా వివరాల సేకరణ
మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ
వివరాల సమర్పణకు మార్చి 3 నుంచి అవకాశం
కరీంనగర్ సిటీ : ఉద్యోగుల సమగ్ర సమాచార సేకరణలో నిర్లక్ష్యానికి తగిన మూల్యం.. ప్రభుత్వ కఠిన నిర్ణయంతో జిల్లాలోని 3,537 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఫిబ్రవరి నెల జీతం నిలిచిపోయింది. దాదాపు రూ.60 కోట్ల జీతాలు ఆపినట్లు జిల్లా కోశాగార అధికారుల ద్వారా తెలిసింది. ఆన్‌లైన్‌లో కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 31 అంశాలతో కూడిన ఎంప్లా యి డేటా ఫాంను రూపొందించి వివరాలు సేకరించాలని ఆదేశించినా.. నిర్ణీత గడువులోగా ఉద్యోగులు స్పందించలేదు. రెండు దఫాలుగా ఈ నెల 10, 25 తేదీల్లోగా అవకాశమిచ్చినప్పటికీ నిర్లక్ష్యం వహించడంతో çసర్కారు ఆదేశాల మేరకు జీతాలు ఆగిపోయాయి.
కరీంనగర్ సిటీ : రాష్ట్ర విభజన, జిల్లాల విభజన, ఉద్యోగుల విభజన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి సచివాల యం వరకు ఉద్యోగుల వివరాలు ప్రభుత్వం వద్ద లేకుండాపోయాయి. దీంతో ఆ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో కం ప్యూటరీకరించాలని నిర్ణయించింది. అవకతవకలకు చెక్‌పెడుతూ భవిష్యత్తులో ఖాళీల భర్తీకి అవకాశముంటుందని భావించారు. అందుకు శాఖలవారీగా ఎంత మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు? నేపథ్యం, జీతం, కుటుంబ వివరాలు, సెలవులు, పీఆర్‌సీ, తీసుకున్న రుణాలు తదితర సమగ్ర వివరాలను సేకరించేందుకు 31 అం శాలతో కూడిన ఎంప్లాయి డేటా ఫాం రూ పొందించారు. అందులో సమగ్ర వివరాలు పొందుపరిచి ఈ నెల 25లోగా సమర్పించాలని డెడ్‌లెన్ విధించారు. లేనిపక్షంలో ఫిబ్రవరి నెల జీతం నిలిపివేస్తామని హెచ్చరించి నా 40 శాతం మంది ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. ట్రెజరీలో ఆయా శాఖల్లోని ఉద్యోగుల జీతాల బిల్లుల రిజిస్టర్ ఆధారంగా జిల్లాలో 12,952 మం జూరు పోస్టులున్నాయని అధికారులు చెబుతున్నారు. అందులో 9,618 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 3,334 పోస్టు లు ఖాళీలున్నట్లు అంచనా వేశారు. ఫిబ్రవరి 15లోగా అందిస్తే మార్చిలోగా ఆన్‌లైన్‌లో కంప్యూటరీక రించేందుకు అవకాశముంటుందని ముందుగా భావిం చారు. ఈ నెల 25 వరకు గడువు విధించగా 6,081 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి మాత్రమే ఎంప్లా యి డేటా ఫారంలు ట్రెజరీకి అందాయి. ఇంకా 3,537 మంది ఉద్యోగుల నుంచి అందాల్సి ఉంది.
డేటా ఫారంతోపాటు ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తేనే ఫిబ్రవరి నెల జీతం అందే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటివరకు అందిన దరఖాస్తులను ట్రెజరీ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మార్చి 15లోగా ఉద్యోగుల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు గడువు విధించారు. ప్రతీ ఉద్యోగి ఎంప్లాయి డేటా ఫారంలోని ప్రతీ అంశాన్ని పూరించాల్సి ఉంది. నెలసరి వేతనం, పాన్ నెంబర్, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, వైద్య ఖర్చు లు, ఆధార్, ఈ మెయిల్, చిరునామా, కుటుంబ సభ్యు లు, తల్లిదండ్రులు, వారి వయస్సు, విద్యార్హతలు, ఆరో గ్య పరిస్థితి తదితర విషయాలను ఫారంలో పొందుపరిచారు. ఇతరత్రా సౌకర్యాలు అందించేందుకూ ఈ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. గతంలో ఒక్కో ఉద్యోగికి 4,5 ఎంప్లాయి ఐడీలుండడంతో నెలస రి వేతనాల్లో అవకవతవకలు జరిగే అవకాశం ఏర్పడిం ది. కొంత మందికి బదిలీలు, పదోన్నతుల క్రమంలో ఐడీలు మారుతుండడంతో రెండు రకాల జీతాలు తీసుకున్న సంఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఎంప్లా యి డేటా ఫారంలో ప్రతిఒక్కరూ కుటుంబ వివరాలతోపాటు పాన్‌కార్డు నంబర్, ఐడీ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉండడంతో ఇలాంటి అవకతవకలకు పాల్ప డే అవకాశముండదని అధికారులు చెబుతున్నారు. ఇక పై మూడు నెలలకోసారి ఆదాయ వ్యయం చెల్లింపులు (రిటర్న్స్) దాఖలు చేయాల్సిందేనంటున్నారు. ఏ పీఆ ర్‌సీలో జీతం పొందుతున్నారు? ఎంత డబ్బు డ్రా చేస్తున్నారు? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నా రు. సేకరించిన వివరాలను ఆర్థికశాఖ, సాధారణ పరి పాలనశాఖతోపాటు సంబంధిత శాఖల వద్ద నిక్షిప్తం చే యనున్నారు. ఉద్యోగుల సమగ్ర సమాచారంతో వారి సంక్షేమంతో పాటు భవిష్యత్తు కార్యాచరణకు వెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మార్చి 3 నుంచి మరోసారి డేటా ఫారాలు సమర్పించేందుకు అవకాశమిచ్చారు. డేటా ఫారంలు సమర్పించిన వారి జీతాల బిల్లులను ఆమోదించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
జీతం నిలిపివేత..!
Published Wed, Mar 1 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement