ఉద్యోగులకు కాస్తంత ఉపశమనం
‘యాజమాని-ఉద్యోగి’ బంధం ప్రారంభమయ్యిందంటే ఉద్యోగిని ‘వేతనం-జీతం’ ఖాతాలోవేసి పన్ను భారానికి గురిచేస్తారు. 12 నెలల కాలంలో ఇచ్చిన జీతభత్యాలను ఆదాయపు లెక్కింపులోకి తీసుకుంటారు. జీతం పరిధిలో చాలా అంశాలున్నాయి. బోనస్, బకాయిపడ్డ జీతం, అడ్వాన్స్, నోటీసు పీరియడ్‌లో జీతం, లీజ్ జీతం... ఇలా ఎన్నో! పెన్షన్నూ ఆదాయంగా పరిగణిస్తారు. కుటుంబ పెన్షన్ కూడా ఆదాయమే. అయితే దాన్ని ఇతర ఆదాయంగా పరిగణలోకి తీసుకుంటారు.
అలవెన్సులు రకరకాలు..
డీఏ, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్‌పై పన్ను ఉం టుంది. అంతేకాకుండా టిఫిన్ అలవెన్స్‌లు, మీల్స్ అలవెన్స్‌లు, డిన్నర్ అలవెన్స్‌లు, మెడికల్ అలవెన్స్‌లు, టెలిఫోన్ అలవెన్స్‌లు, హాలిడే అలవెన్స్‌లు, ఎడ్యుకేషన్ అలవెన్స్‌లు, సర్వెంట్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్‌లను ఆదాయం కింద లెక్కిస్తారు. అకడమిక్ అలవెన్స్‌లు... పుస్తకాలు కొన్నంత వరకు మినహాయింపు ఇస్తారు. న్యూస్‌పేపర్ అలవెన్స్ ఆదాయం కాదు.
కన్వేయన్స్ అలవెన్స్‌పై ఖర్చు పెట్టినంత వరకు మినహాయింపు ఉంటుంది. ఎల్ఐసీ, గ్రాట్యుటీ, వాలంటరీ రిటైర్మెంట్ చెల్లింపులు, ట్రావెలింగ్ అలవెన్స్‌లు... తదితర వాటికి మినహాయింపులు ఇస్తారు. పరిలబ్ధులు లెక్కించి ఆదాయంగా పరిగణిస్తారు. యజమాని ఒలకబోసే ప్రేమంతటినీ ఆదాయంగా పరిగణిస్తార ంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక్కటే ఒక్క మినహాయింపు వైద్య ఖర్చులు. చికిత్స నిమిత్తం గుర్తింపు పొందిన హాస్పిటళ్లలో చికిత్స జరగాలి.
సర్టిఫికెట్స్ జతపరచాలి. యాజమాని ఉద్యోగి ఆదాయాన్ని లెక్కించిన తర్వాత పన్ను భారాన్ని లెక్కించే ముందు కొన్ని తగ్గింపులు, మినహాయింపులు ఇస్తారు. ఉదాహరణకు వృత్తి పన్ను, 80 సీ సేవింగ్స్, చెల్లింపులు, 80 సీసీసీ పెన్షన్ చెల్లిం పులు, 80 డీ మెడిక్లెయిమ్, 80 డీడీ అంగవైకల్యం వారికి వర్తించేవి, 80 డీడీబీ వైద్య ఖర్చులు, 80 ఈ కింద విద్యా రుణాల మీద వడ్డీ, విరాళాలు తదితర వాటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటి విషయంలో యాజమాని తగిన జాగ్రత్త వహిస్తాడు. పన్ను భారాన్ని లెక్కించడం, పన్నుని రికవరీ చేయడం, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించడం వంటివి యాజమాని భాద్యతలు.
పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు
* ఇంటి వసతి/ఇళ్లు విషయాల్లో యాజమాని కట్టించిన ఇళ్లు ఇస్తే.. ఇద్దరికీ ఉపయోగం. యాజమాని ఇళ్లు ఫీజు తీసుకొని ఉద్యోగికి ఇళ్లు ఇచ్చినా ఉపయోగం.
* అలాగే ఉద్యోగికి ఫర్నీచర్ ఇవ్వొచ్చు.
* పిల్లలకి ఎడ్యూకేషన్ ఎలవెన్స్ మినహాయింపు ఉంది. అయితే ఇది చాలా తక్కువ మొత్తం. దీనికి బదులుగా యాజమాని నిర్వహించే పాఠశాలలోనే చదివితే మంచిది. అంతేకాకుండా పిల్లలకి స్కాలర్షిప్లను ఇవ్వొచ్చు.
* యాజమాని ఉద్యోగులకు యూనిఫామ్ ఇవ్వొచ్చు. పన్నుభారం ఎవరికి ఉండదు.
* ఇవికాకుండా యూనిఫామ్‌తోపాటు షూస్, రిస్ట్‌వాచ్‌లు, బ్రీఫ్‌కేసులు తదితర వస్తువులను ఉద్యోగికి ఇవ్వొచ్చు. అటు యాజమానికి ఈ ఖర్చులకు మినహాయింపు ఉంటుంది. ఇటు ఉద్యోగికి పన్ను భారం ఉండదు.