ఏడ్వడం కంటే కామెడీ చేయడమే కష్టం: సోహా అలీఖాన్
విషాదకర పాత్రల్లో నటించడం కంటే కామెడీ చేయడమే కష్టమని బాలీవుడ్ ముద్దుగుమ్మ సోహా అలీఖాన్ అంటున్నారు. గతంలో ఎక్కువగా విషాదరక పాత్రల్లో నటించిన సోహా తాజాగా ఓ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పేరు 'వార్ చోడ్ న యార్'.
'నేను నటించిన చాలా సినిమాల్లో నా భర్తో లేక బాయ్ఫ్రెండో మరణించే పాత్రలున్నాయి. ఏడ్చే సీన్లలో నటించడమే కష్టమని భావించేదాన్ని. ఐతే అదేమంత పెద్ద కష్టంకాదని ఇప్పుడు అనిపిస్తోంది. హాస్య సన్నివేశాల్లో నటించిడం అంత సులువు కాదు. ఇది సమయసందర్భాలను బట్టి ఉంటుంది కానీ ఇతరుల నుంచి నేర్చుకోవడం వీలుకాదు. సహజసిద్ధంగా రావాలి' అని సోహా పెద్ద ఉపన్యాసమే ఇచ్చేశారు. ఆమె నటించిన తాజా చిత్రం వచ్చే నెల 11న విడుదల కానుంది.