ఆ తీర్పే ఫైనల్.. మీకు ఉరే సరి
ఢాకా: గతంలో తాము ఇచ్చిన తీర్పే చివరిదని, మరోసారి పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ కోర్టు యుద్ధ నేరాలకు పాల్పడిన దోషులకు చెప్పింది. తమకు విధించిన ఉరి శిక్షపై వారు పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసింది. దీంతో చివరి ప్రయత్నంగా ఇప్పుడా నేరగాళ్లు తమకు క్షమాపణ భిక్ష ప్రసాధించాల్సిందిగా రాష్ట్రపతికి అర్జీ పెట్టుకునే పనిలో పడ్డారు.
జమాతే ఈ ఇస్లామికి చెందిన యుద్ధ నేరగాడు మహమ్మద్ కమరుజ్జామన్, మరొకరిని 1971నాటి బంగ్లా విముక్తి పోరాటంలో దేశ ద్రోహ చర్యకు పాల్పడ్డారని ది వార్ క్రైమ్స్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. దీంతో మరోసారి తమ నేరంపట్ల వెల్లడించిన తీర్పును సమీక్షించాలంటూ వారు కోర్టుకు వెళ్లగా ఆ తీర్చే చివరిదని స్పష్టం చేసింది.