బీజేపీ పోరు దీక్ష షురూ
వరంగల్ నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నగరశాఖ చేపట్టిన 32 గంటల పోరు దీక్ష కార్పొరేషన్ కార్యాలయ సమీపంలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాత్రి దీక్ష శిబిరంలోనే నేతలు నిద్రించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి ఉదయం దీక్షను ప్రారంభించి మాట్లాడారు.
వరంగల్ అర్బన్ : నగర సమస్యల పరిష్కారమే ఎజెండా గా బీజేపీ చేపట్టిన 32 గంటల పోరు దీక్ష సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ దీక్షలకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. అభివృద్ధి పనులపై విచారణ జరిపించాలని, నగర పరిపాలన గాడి తప్పినందున అసమర్థ కమిషనర్‌ను సరెండర్ చేయాలని ఓ వైపు డిమాండ్ చేస్తూనే మరోవైపు ఆరు నెలల రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని శంకర మఠం ఎదుట బీజేపీ నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్ అధ్యక్షతన చేపట్టిన ఈ పోరుదీక్షను ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపించాలి : బీజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు వెంటనే ఎన్నికలు జరిపించాలని జరిపించాలని జాతీ య కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో కమిషనర్, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నా బల్దియా పరిపాలనను గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు. పార్టీ మరో జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ బీజేపీ పేదల పక్షాన నిలబడి పోరాడుతుందన్నారు.
కమిషనర్ జైలుకే : మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు
ఏడాది కాలంగా బల్దియాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తే కమిషనర్ సువర్ణ పండాదాస్ జైలుకు పోవడం ఖా యమని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ని ర్లక్ష్యం చేస్తున్న అసమర్థ కమిషనర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగర సమస్యలపై బీజేపీ చేపట్టిన పోరు యాత్ర అంతం కాదని, ఆరంభమేనన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ మాట్లాడుతూ నగర పాలన చెత్తగా మారిందని విమర్శించారు.
బీజేపీ నాయకుడు నరహరి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కోసం డివిజన్ క మిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, మం దాడి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాము లు, పోరుదీక్ష సమన్వయకర్త చాడ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. భూపాలపల్లి నగర పంచాయతీ వైస్ చైర్మన్ గణపతి, పరకాల నగర పంచాయతీ ైవె స్ చైర్మన్ మేఘనాథ్, బీజేపీ నాయకులు రాకేష్‌రెడ్డి, ఎరుకల రఘునారెడ్డి, బాకం హరిశంకర్, రావు అమరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ సుధారాణి సంఘీభావం
బీజేపీ చేపట్టిన పోరుదీక్షకు టీడీపీ నాయకురా లు, ఎంపీ గుండు సుధారాణి సంఘీభావం ప్రకటించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు ఆకెన వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ ఉన్నారు.
వివిధ సంఘాలు, కాలనీ కమిటీల మద్దతు
బీజేపీ పోరు దీక్షకు వివిధ సంఘాల నాయకులు, కాలనీ కమిటీల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. రిటైర్డ ప్రొఫెసర్ వెంకటనారయణ, ఎమ్మార్పీఎస్ నాయకులు రామకృష్ణ, దామోదర్, ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధి వడికిచర్ల లక్ష్మణ్, రజక హక్కుల సాధన సమితి నాయకుడు కుమారస్వామి, ఏనుమాముల చిల్లర వర్తకుల సంఘం, జిల్లా లారీ ఓనర్స, డ్రైవర్స అసోసియేషన్ ప్రతినిధు లు, నందిహిల్స్, శాంతినగర్ కాలనీ కమిటీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.