రోజుకో తీరు..
మార్పులు చేర్పులమయంగా పునర్విభజన ప్రక్రియ
రెవెన్యూ డివిజన్లలో చేంజ్
14కు చేరిన కొత్త మండలాలు
ఐదు జిల్లాల ప్రకారం ప్రతిపాదనలు
ప్రభుత్వానికి కలెక్టర్ నివేదిక
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ మార్పులు, చేర్పులమయంగా మారింది. రోజుకో తీరుగా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వరంగల్ జిల్లాను... ఐదు జిల్లాలుగా పునర్విభజిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. ప్రతిపాదిత ఐదు జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, జనాభా, విస్తీర్ణం వివరాలతో నివేదిక సిద్ధం చేసింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఈ నివేదికను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.
ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లో నాలుగు జిల్లాలు ఉండగా, తాజా ప్రతిపాదనల్లో ఐదు జిల్లాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల అనంతరం... వరంగల్ అర్బన్(వరంగల్) జిల్లాలో 12, వరంగల్ రూరల్ (కాకతీయ) 14, భూపాలపల్లి జిల్లాలో 19, మహబూబాబాద్ జిల్లాలో 16, జనగామ జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటవుతున్నట్లు పేర్కొన్నారు. తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త మండలాల సంఖ్య 14కు చేరింది. మొదట పేర్కొన్న ఖిలా వరంగల్, కాజీపేట, ఐనవోలు, చిల్పూరు, వేలేరు, ఇల్లంతకుంటతోపాటు కొత్తగా టేకుమట్ల, కన్నాయిగూడెం, గంగారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర, తరిగొప్పుల, కొమురవెల్లి మండలాలు ఏర్పడుతున్నాయి.
రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు...
వరంగల్ : వరంగల్, ఖిలా వరంగల్, హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, ఇల్లంతకుంట.
వరంగల్ రూరల్(కొత్తది) : రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, గీసుగొండ, సంగెం.
నర్సంపేట : నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నల్లబెల్లి, ఖానాపురం, నెక్కొండ.
భూపాలపల్లి : భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్రావు, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం.
ములుగు : ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(ఖమ్మం).
మహబూబాబాద్ : మహబూబాబాద్, కురవి, కేసముద్రం, డోర్నకల్, గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల.
తొర్రూరు : తొర్రూరు, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్ద వంగర, నెల్లికుదురు, నర్సింహులపేట, మరిపెడ.
జనగామ : జనగామ, లింగాలగణపురం, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, గుండాల.
స్టేషన్‌ఘన్‌పూర్ : స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు, జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల.
తాజా ప్రతిపాదనల ప్రకారం జిల్లాలు ఇలా...
వరంగల్ అర్బన్(వరంగల్) జిల్లా : వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, ఇల్లంతకుంట.
వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా : వర్థన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, శాయంపేట, పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ,
జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్, వాజేడు, వెంకటాపురం.
మహబూబాబాద్ : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, గంగారం, తొర్రూరు, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, పెద్దవంగర.
జనగామ : జనగామ, బచ్చన్నపేట, నర్మెట, దేవరుప్పుల, లింగాలఘనపురం, కొడకండ్ల, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్గడ్, చిల్పూరు, తరిగొప్పుల, గుండాల.
సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి.
జిల్లాల వారీగా విస్తీర్ణం, జనాభా...
జిల్లా పేరు విస్తీర్ణం జనాభా
వరంగల్ అర్బన్(వరంగల్) 1304.51 11,35,707
వరంగల్ రూరల్(కాకతీయ) 2171.48 7,16,457
జయశంకర్(భూపాలపల్లి) 6175.21 7,05,054
మహబూబాబాద్ 2876.74 7,70,170
జనగామ 2187.51 5,82,457
విస్తీర్ణం : చదరపు కిలోమీటర్లు
–––––––––––––––––––––––––––––––