ఎమ్మెల్సీని గెలిపిస్తే వరంగల్‌పై కేంద్రం దృష్టి
హన్మకొండ : నల్లగొండ, వరంగల్,ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపేస్తే కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశముందని ఆ పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాల యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోమురళీధర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడం ద్వారా ఈ పార్టీ నాయకులు కేంద్ర సా యాన్ని అడుగగలుగుతారన్నారు. రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో నిధులు విడుదల కావడం లేదన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం ద్వారా ఇలాంటి అవకాశాలు కోల్పోనున్నామన్నా రు.
బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావు జాతీయ భావాలకు అంకితమై పని చేస్తారని, సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అన్నా రు. తెలంగాణను ఒక కుటుంబం హైజాక్ చేసిందన్నారు. ఇలాంటి వాటికి బీజేపీ దూరంగా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను బీజేపీ సహించదన్నారు. ధన, భుజ బలంతో ప్రదర్శించాలని టీఆర్ఎస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. పట్ట భద్రులు దీన్ని ఎదుర్కోవాలని, బీజేపీ దీని కి నాయకత్వం వహిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వన్నా ల శ్రీరాములు, మందాడి సత్యనారాయణరెడ్డి, ఒంటేరు జయపాల్, డాక్టర్ పి.విజ యచందర్‌రెడ్డి, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, చింతాకుల సునీల్, రాంరెడ్డి, గాదె రాంబా బు, దశరథం, దుప్పటి భద్ర య్య, దిలీప్, కుమార్, లక్ష్మణ్‌నాయక్ పాల్గొన్నారు.