గుట్ట..గోవిందా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయం వెనుక భాగంలో గోవిందరాజుల గుట్ట పరిసరాల్లో మొదట 20 ఎకరాల మేరకు ప్రభుత్వ స్థలం ఉండేదని చెబుతుంటారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు ఆలయ భూముల్లోనే ఉన్నట్లు చెబుతారు. ఐదు దశాబ్దాలుగా ఈ భూమి క్రమక్రమంగా ఆక్రమణకు గురవుతూ వచ్చింది. ప్రస్తుతానికి సర్వే నంబర్ 15/1లో 5.25 ఎకరాల భూమి ఉందని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడు అది కూడా కనిపించడం లేదు.
రెవెన్యూ శాఖ అధికారులు ప్రమేయంతోనే ఈ భూములు పరాధీనమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఎకరానికి రూ.కోటికిపైగా పలుకుతోంది. ఈ లెక్కన చూసినా రూ.పది కోట్ల విలువైన భూమి పరాధీనమైనట్టే. ఇక్కడి భూముల్లో కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ వ్యక్తికి అధికారికంగా కేటాయించింది. తర్వాత కాలంలో దీన్ని కొనుగోలు చేసిన కొందరు మొత్తం ప్రభుత్వ భూమికే ఎసరు పెట్టారు. ఈ సమీపంలోని వ్యాపారులు అధికార పార్టీ నేతల అండదండలతో గుట్ట భూములను ఆక్రమించేశారు. ఇలా కబ్జాలతో గుట్ట పరిసరాల్లోని భూమి మొత్తం భవనాలతో నిండిపోయింది.
ఇప్పుడు కబ్జాదారులు ఏ కంగా గుట్టనే పగులగొట్టి గ్రానైట్‌ను తరలిస్తున్నారు. గుట్ట కింద ప్రభుత్వ భూమి లో పురాతనమైన నరసింహస్వామి విగ్రహం ఉండేదని స్థానికులు చెబుతున్నా రు. రోడ్డు వెడల్పులో విగ్రహాలు సైతం బయట పడ్డాయి. ఇక్కడి ఆలయ భూములను రక్షించాలని స్థానికులు పలుసార్లు... జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్‌కు, మండల కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు.
దీంతో తహసీల్దార్ ఆధ్వర్యంలో సర్వే సైతం నిర్వహించారు. కొంత పట్టా భూమి ఉందని, మిగిలినందా సర్కారుదేనని తేల్చారు. ఎంత పట్టా భూమి, ఎంత ప్రభుత్వ భూమి అనేది మా త్రం అధికారులు స్పష్టం చేయలేదు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవె న్యూ శాఖ అధికారులే భూమి లెక్కలు లేల్చకపోవడంతో కబ్జాదారులు ఆక్రమణ పర్వం పూర్తి చేశారు. ఇప్పుడు ఆలయ భూమి అనేది లేకుండా పోరుుంది.