Watch dog
-
ఇటలీ ఇచ్చిన షాక్‌తో ఉలిక్కిపడ్డ అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటలీ ఇచ్చిన షాక్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మీద 1.13 బిలియన్ యూరోలు(1.28 బిలియన్ డాలర్లు) జరిమానా విధించినట్లు ఇటలీ యాంటీట్రస్ట్ గురువారం తెలిపింది. ఇటాలియన్ రెగ్యులేటర్ నిర్ణయంతో "తీవ్రంగా విభేదిస్తున్నట్లు" అమెజాన్ తెలిపింది. ఈ కామర్స్ లాజిస్టిక్స్ సర్వీస్‌లో పోటీ పడుతున్న ఇతర ఆపరేటర్లకు అమెజాన్ హానికలిగించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు ఇటలీ యాంటీట్రస్ట్ వాచ్ డాగ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ-కామర్స్ సేవల పరంగా ఇటాలియన్ మార్కెట్లో అమెజాన్ ఆధిపత్య స్థానాన్ని కలిగి ఉంది. ఈ అధిపత్యంతో అమెజాన్(ఎఫ్బిఎ) ఫుల్ ఫిల్ మెంట్ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్టు ఇటలీ యాంటీట్రస్ట్ తెలిపింది. ఇక్కడి నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్ మీద జరిమానా విధించినట్లు తెలిపింది. ఈ యాంటీట్రస్ట్ కేవలం జరిమానా అమెజాన్ మీద మాత్రమే విధించలేదు. అల్ఫాబెట్ గూగుల్, ఫేస్ బుక్ ఇంక్, యాపిల్ ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్ప్ సంస్థల మీద కూడా భారీ స్థాయిలో జరిమానా విధించింది. (చదవండి: అమెజాన్ సంచలన నిర్ణయం..! ఇక పై ఆ సేవలు బంద్..!) -
‘ఎలన్‌మస్క్, స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టండి’
న్యూఢిల్లీ: లైసెన్సు లేకుండానే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తామంటూ కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినందుకు గాను అమెరికన్ సంస్థ స్టార్‌లింక్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థ టెలికం వాచ్డాగ్ విజ్ఞప్తి చేసింది. నవంబర్ 27న టెలికం కార్యదర్శికి ఈ మేరకు లేఖ రాసింది. ఈ విషయంలో తగు స్థాయిలో సత్వర చర్యలు తీసుకోనందుకు గాను సంబంధిత అధికారులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. 2021 ఫిబ్రవరి నుంచే స్టార్‌లింక్ ప్రీ–బుకింగ్ ప్రారంభించినప్పటికీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడంలో టెలికం శాఖ (డాట్) తీవ్ర జాప్యం చేసిందని పేర్కొంది. ఈలోగా అమాయక కస్టమర్ల నుంచి స్టార్‌లింక్ భారీగా దండుకుందని టెలికం వాచ్డాగ్ తెలిపింది. కంపెనీ చెప్పే లెక్కలు బట్టి చూస్తే 11,000 కస్టమర్ల నుంచి దాదాపు 10,89,000 డాలర్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోందని వివరించింది. అనుమతులు తీసుకోకుండానే కష్టమర్ల నుంచి చందాలు వసూలు చేసిన వ్యవహారంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌తో విచారణ జరిపించాలని, కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును వడ్డీతో సహా, ఎలాంటి కోతలు లేకుండా, స్టార్‌లింక్ పూర్తిగా రిఫండ్ చేసేలా చర్యలు తీసుకోవాలని టెలికం వాచ్డాగ్ కోరింది. అమెరికా ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్.. భారత్‌లోనూ కార్యకలాపాలు మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. ప్రీ–బుకింగ్ కూడా చేపట్టింది. అయితే, స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వలేదని, కంపెనీ సర్వీసులకు సబ్స్క్రయిబ్ చేయరాదని డాట్ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టెలికం వాచ్డాగ్ ఫిర్యాదు ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Starlink: ఎంట్రీకి ముందే షాకుల మీద షాకులు.. -
హక్కులతోనే మెరుగైన జీవితం
న్యూఢిల్లీ: మానవ హక్కులు సవ్యంగా అమలుపరచడం ద్వారా ప్రజల జీవితాల్ని మెరుగుపరిచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని గుర్తుచేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) 25వ వ్యవస్థాపక దినోత్సవంలో శుక్రవారం మోదీ ప్రసంగించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో ఎన్హెచ్ఆర్సీ ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మానవ హక్కుల పరిరక్షణకు స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ, చురుకైన మీడియా, క్రియాశీల పౌర సంఘాలు, ఎన్హెచ్ఆర్సీ లాంటి సంస్థలు ఉనికిలోకి వచ్చాయని అన్నారు. 17 లక్షల కేసులు..వంద కోట్ల పరిహారం: మానవ హక్కుల వాచ్‌డాగ్‌గా పేరొందిన జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఏర్పాటై శుక్రవారానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 17 లక్షలకు పైగా కేసులను పరిష్కరించిన కమిషన్...మానవ హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితులకు సుమారు రూ.100 కోట్లకు పైగా పరిహారం ఇప్పించింది. ఈ కమిషన్ ముందుకు వచ్చిన కేసుల్లో పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ హింస, ఛత్తీస్‌గఢ్‌లోని సల్వాజుడుం సంబంధిత ఘటనలు కొన్ని ముఖ్యమైనవి. 28న జపాన్‌కు మోదీ మోదీ ఈ నెల 28–29న జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రధాని షింజో అబేతో మోదీ ఇండియా–జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొని పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని పరిస్థితులు కూడా ఇరువురు అధినేతల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
వాచ్‌డాగ్‌లా వ్యవహరించాలి: పొన్నాల
కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పొన్నాల దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ హామీలన్నీ అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దిశానిర్ధేశం చేశారు. హామీల అమలుకు సంబంధించి కార్యకర్తలు వాచ్‌డాగ్‌లా వ్యవహరించాలని సూచించారు. పార్టీకి అనుబంధంగా ఉన్న 13 సంఘాల నేతలతో గాంధీభవన్‌లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ పరిస్థితిని విడివిడిగా సమీక్షించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇన్చార్జి రామచంద్ర కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షలో పాల్గొన్నారు. ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలను పరిశీలించేందుకు అనుబంధ సంఘాల నేతలకు టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతులను అందజేశారు. గతంలో కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేలా చూడడంతో పాటు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నేరవేరే విధంగా ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. కొంత సమయం తీసుకుని ఆందోళన బాట పట్టాలని సూచించారు. విద్యార్థులు, మహిళలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలకు టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని, వాటిమీద ఇప్పటినుంచే దృష్టి పెట్టాలన్నారు. ఓటమితో కుంగిపోకుండా పార్టీకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అనుబంధ సంఘాలు కృషిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచాలన్నారు. నేతల మధ్య సమన్వయం లేక పార్టీ ఓటమి పాలయ్యిందని, కొందరు నేతలు ఇంకా తాము అధికారంలోనే ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారని కుంతియా అన్నట్టు తెలిసింది. ప్రజలు ప్రతిపక్ష పాత్రనిచ్చారని, వారి ఆకాంక్షల మేరకు కార్యకర్తలు నడుచుకోవాలని సూచించినట్టు సమాచారం.