ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటలీ ఇచ్చిన షాక్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మీద 1.13 బిలియన్ యూరోలు(1.28 బిలియన్ డాలర్లు) జరిమానా విధించినట్లు ఇటలీ యాంటీట్రస్ట్ గురువారం తెలిపింది. ఇటాలియన్ రెగ్యులేటర్ నిర్ణయంతో "తీవ్రంగా విభేదిస్తున్నట్లు" అమెజాన్ తెలిపింది. ఈ కామర్స్ లాజిస్టిక్స్ సర్వీస్‌లో పోటీ పడుతున్న ఇతర ఆపరేటర్లకు అమెజాన్ హానికలిగించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు ఇటలీ యాంటీట్రస్ట్ వాచ్ డాగ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ-కామర్స్ సేవల పరంగా ఇటాలియన్ మార్కెట్లో అమెజాన్ ఆధిపత్య స్థానాన్ని కలిగి ఉంది. ఈ అధిపత్యంతో అమెజాన్(ఎఫ్‌బిఎ) ఫుల్ ఫిల్ మెంట్ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నట్టు ఇటలీ యాంటీట్రస్ట్ తెలిపింది. ఇక్కడి నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్ మీద జరిమానా విధించినట్లు తెలిపింది. ఈ యాంటీట్రస్ట్ కేవలం జరిమానా అమెజాన్ మీద మాత్రమే విధించలేదు. అల్ఫాబెట్ గూగుల్, ఫేస్ బుక్ ఇంక్, యాపిల్ ఇంక్, మైక్రోసాఫ్ట్ కార్ప్ సంస్థల మీద కూడా భారీ స్థాయిలో జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment