సమస్యను గాలికొదిలి ఇక్కడ కూర్చుంటారా?
ఢిల్లీ నీటి శాఖ మంత్రి కపిల్ మిశ్రాకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆయన కోర్టుకు రావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలు నీటి కొరతతో అక్కడ ఇబ్బంది పడుతుంటే.. దాన్ని గాలికి వదిలేసి ఇక్కడ కోర్టుకు వచ్చి కూర్చుంటారా అని మండిపడింది. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదమని, తక్షణం దీన్ని పరిష్కరించుకోవాలని తెలిపింది.
మునాక్ కాలువ గేట్లను మూసేసి, ఢిల్లీకి నీటి సరఫరాను అడ్డుకున్న విషయంపై కేంద్ర ప్రభుత్వానికి, హర్యానా, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.