నితిన్ గడ్కరీ కొత్త ఆలోచన
భారతీయ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ది చెందుతోంది. కానీ ట్రాఫిక్ ఓ సమస్యగా మారిపోయింది. నగరాల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టమైపోతోంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దేశ ఆర్ధిక రాజధానిలో వాహనాల రద్దీ తగ్గించడానికి.. రాయ్‌గఢ్ జిల్లాలో రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఓ కొత్త ఆలోచన చేసారు. ఇందులో భాగంగానే.. 10,000 వాటర్ ట్యాక్సీలు ప్రవేశపెట్టనున్నట్లు.. వీటి కోసం 'ఫైబర్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్' (FRP) వినియోగించనున్నట్లు వెల్లడించారు.ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ రీయిన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్స్ (ICERP) 2025 సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో.. ఇప్పటికే వాటర్ ట్యాక్సీల కోసం జెట్టీలను నిర్మించాము. మార్చి 2025 నాటికి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గడ్కరీ వెల్లడించారు.ముంబై.. థానే చుట్టూ ఉన్న విస్తారమైన సముద్ర మార్గాలను ఉపయోగించడం ద్వారా రోడ్డుపై ట్రాఫిక్.. కాలుష్యం రెండూ కూడా తగ్గుతాయి. టాక్సీల కోసం కంపోజిట్ మెటీరియల్ (మిశ్రమ ముడి పదార్థాలు) ఉపయోగించడం వల్ల, అవి ఎక్కువ మన్నికైనవిగా ఉంటాయి. అంతే కాకుండా.. స్థానిక ముడిపదార్థాలని ఉపయోగించడం వల్ల.. 25 నుంచి 30 శాతం విదేశీ దిగుమతులు తగ్గుతాయి. దీంతో దేశ ఆర్ధిక వృద్ధి కూడా పెరుగుతుందని గడ్కరీ అన్నారు.కాంపోజిట్ మెటీరియల్స్.. రక్షణ, ఆటోమోటివ్, షిప్పింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్ వంటి వాటిలో ఉపయోగపడతాయి. 2024 చివరి నాటికి ఈ మిశ్రమ ముడి పదార్థాల మార్కెట్ 1.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశీయ మిశ్రమ పదార్థాల పరిశ్రమ 7.8 శాతం వృద్ధి చెందుతూ 2030 నాటికి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఎఫ్ఆర్పీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.ఇదీ చదవండి: 2030 నాటికి ఈ రంగంలో 2.5 కోట్ల ఉద్యోగులు: నితిన్ గడ్కరీఐసీఈఆర్పీ (ICERP) 2025 సమావేశానికి అధ్యక్షత వహించిన 'పియా ఠక్కర్' మాట్లాడుతూ.. భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో కాంపోజిట్లు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని హైలైట్ చేశారు. ఇండియన్ కాంపోజిట్స్ ఇండస్ట్రీ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది భారతదేశం ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు.