రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలవకుండా చూడండి: జీఎం
హైదరాబాద్: వానలు కురిసే సమయాల్లో ట్రాక్‌పై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ ఆదేశించారు. వానాకాలం ముందస్తు జాగ్రత్తలపై బుధవారం ఆయన రైల్‌నిలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్వే ట్రాక్‌లపైకి, రైళ్లకు కరెంటును సరఫరా చేస్తున్న స్తంభాలపైకి చెట్ల కొమ్మలు చేరకుండా చూడాలన్నారు. వానాకాలంలో రైళ్ల భద్రత, సమయపాలనకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గడచిన రెండు నెలల్లో రైళ్ల రాకపోకల్లో జాప్యం, నమోదైన ప్రాంతాలపై దృష్టి సారించి కారణాలను విశ్లేషించాలని పేర్కొన్నారు.