వాతావరణ సమతుల్యతకు హరితహారం
రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
ఘట్కేసర్: వాతావరణ సమతుల్యతకు హరితహారం అవసరమని రాష్ర్ట రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.మండలంలోని ఏదులాబాద్ గ్రామంలో గురువారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలునాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో 44కోట్ల మొక్కలునాటుతామన్నారు. అడవులు 33 శాతం ఉండవలసి ఉండగా అంతశాతం అడవులు లేవన్నారు.ప్రతి గ్రామంలో హరితహారంలో భాగంగా 40వేల మొక్కలు నాటాలన్నారు. అడవులు చాలనన్ని అడువులు ఉన్న జిల్లాలో వానలు బాగ కురిసి చెరువులు నిండుతున్నాయన్నారు.అడవులశాతం తక్కువగా ఉన్న రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో వానలు సరిగా కురవడం లేదన్నారు.హరితహారం కార్యక్రమం మొక్కలు నాటి వాటిని భావితరాలకు అందచేయాలన్నారు.మొక్కలునాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు.మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.2లక్షల 75వేల మొక్కలునాటినట్లు చెప్పారు.హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛందసేవాసంస్థలు ముందుకురావడం అభినందనీయమన్నారు.దేశంలో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు.హరితహారం, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేసుధీర్రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్పార్టీవాళ్లు రాజకీయం చేస్తున్నారని చెప్పారు,మల్లన్న సాగర్‌ప్రాజెక్టు ద్వారా శామీర్‌పేట్ చెరువును నీటిని నింపి ఆనీటిని గ్రావిటితో ఏదులాబాద్ చెరువును నింపి మండలవాసులకు నీరు అందిస్తామన్నారు.నీటిని రాకుండా చేస్తున్నవారి ప్రయత్నాలను కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలన్నారు.తెలంగాణలో పచ్చదనం చేయడానికి హరితహారం కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.యువజన సర్వీసుల విభాగం కమిషనర్ మహ్మద్ అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ భూమిలో తగినన్ని అడవులు లేకపోవడం వల్ల వాతావరణంలోని ఓజోన్ పొర పలుచబడుతుందన్నారు.దీంతో సరిగా వానలు కురవక అనేక అనర్ధాలు కలుగుతాయన్నారు.మహసముద్రాలు, పర్వతాలు, అడవులు భూమి వాతవరణాన్ని సమతుల్యత ఉంచడానికి తోడ్పాటునుఅందిస్తాయన్నారు.సమావేశంలో స్టెప్ సీఈఓ సీతారామరావు,జడ్పీటీసీ మందసంజీవరెడ్డి,సింగిల్‌విండో డైరెక్టర్ గొంగళ్లస్వామి,ఎంపీడీఓ శోభ,తహసీల్ధారు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ మూసీశంకరన్న,ఎంపీటీసీ మంకంరవి, గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు మేకల లక్ష్మి, లక్ష్మణ్, కొండమ్మ, నాయకులు రాజేందర్, ధరంకార్ సత్యరామ్, బాలేష్,యుగేందర్, హరిశంకర్, బొక్క ప్రభాకర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మేకల కుమార్,అబ్బోళ్ల ఇందిరా నాగేష్,మెట్టురమేష్,మురళీ, జీబీఎన్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పొటో28ఎండీసీ42 ప్రసంగిస్తున్న మంత్రిమహేందర్రెడ్డి,
పొటో28ఎండీసీ42ఎ మొక్కలునాటుతున్న మంత్రిమహేందర్రెడ్డి