కేంద్ర సానుకూలంగా స్పందించింది: కోల్లు రవీంద్ర
హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్క్షప్తికి కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి రవీంద్ర అన్నారు. ఏపీలో మూడు టెక్స్ టైల్ పార్కులు, మెగా క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో వందకు పైగా బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదనలు కోరిందని మీడియాకు తెలిపారు. కృష్ణా జిల్లాలో మంచినీటి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంచినీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించిందని మంత్రి రవీంద్ర అన్నారు.