జూలై 1న ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు
ఎస్కేయూ : ఎస్కేయూ సెట్ –2017 కౌన్సెలింగ్లో భాగంగా మంగళవారం కామర్స్ సబ్జెక్టు విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. 29న సర్టిఫికెట్ల పరిశీలన ముగుస్తుంది. 30న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన , జూలై 1న 30 సబ్జెక్టులకు సంబంధించిన తొలిదఫా కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తుంది. జులై 4, 5, 6 తేదీలలో ఆన్లైన్లో పీజీ సీట్లను కేటాయిస్తారు. ఇదిలా ఉండగా ఎంకాం సీట్లను 120కి పెంచారు. తాజా కౌన్సెలింగ్లో కొత్తగా మూడు పీజీ కళాశాలల్లో ఎంకాం కోర్సును ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.