wedlock
-
మాల్యా ఇంట పెళ్లి సందడి : లవర్‌తో సిద్ధూ వెడ్లాక్ (ఫొటోలు)
-
ఆ హీరో బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు
హైదరాబాద్ : అల్లరిని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్ తన బ్యాచిలర్ లైఫ్‌కు శుభం కార్డు వేయబోతున్నాడు. శుక్రవారం ( మే 29) రాత్రి 9 గంటల 3 నిమిషాలకు నరేష్.. విరూప మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వివాహాం జరుగబోతోంది. మరోవైపు అల్లరి నరేష్ నివాసం.. పెళ్లి సందడి తో కళకళలాడుతోంది. కుటుంబ సభ్యులు నిన్న అతడిని పెళ్లికొడుకును చేశారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు ఓ ఇంటివాడు కాబోతున్న నరేష్ ఇటీవల తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా స్నేహితులు... మరో వికెట్ డౌన్ అంటూ అతడిని ఆట పట్టించారు. నరేష్ స్నేహితులు నాని, నిఖిల్, తరుణ్, ఖయ్యుం, శశాంక్ తదితరులు టీజ్ చేస్తూ ఫోటో దిగారు. -
మే 29న నటుడు 'అల్లరి' నరేష్ పెళ్లి
-
మే 29న నటుడు నరేష్ పెళ్లి
చెన్నై: దివంగత ఈవీవీ సత్యనారాయణ కుమారుడు, సినీ హీరో 'అల్లరి' నరేష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ మేరకు శుక్రవారం చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నిశ్చయ తాంబూల వేడుక జరిగింది. ఈదర వీర వెంకట సత్యనారాయణ( స్వర్గీయ), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు అయిన నరేష్ కు రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూపతో వివాహం నిశ్చయించారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ జంట పెళ్లి ముడితో ఒక్కటి కానున్నారు. వీరి వివాహానికి బంధువులు సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని అన్నయ్య ఈదర రాజేశ్ విజ్ఞప్తి చేశారు. -
వైభవంగా క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి
-
వైభవంగా రైనాపెళ్లి
ధోని, శ్రీనివాసన్ హాజరు న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను శుక్రవారం రాత్రి రైనా వివాహం చేసుకున్నాడు. స్థానిక స్టార్ హోటళ్లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. కెప్టెన్ ఎంఎస్ ధోని తన భార్య సాక్షి సింగ్‌తో రాగా ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ, మోహిత్ శర్మ, సెహ్వాగ్, డ్వేన్ బ్రేవో, విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తో సహ పలువురు రాజకీయ నాయకులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే వివాహ విందు భోజనంలో రకరకాల ఆహార పదార్థాలను వడ్డించారు. షమీ కబాబ్స్, గలావత్ కబాబ్స్, మటన్ కోర్మా, మటన్ బిర్యానీలను ప్రత్యేకంగా చేయించారు. పరాటాలో చుట్టిన కబాబ్స్‌తో పాటు ఆనియన్ రింగ్స్, ధనియా చట్నీలను అతిథులకు రుచి చూపించారు. -
త్వరలో సురేష్ రైనా పెళ్లి?
ఘజియాబాద్:జీవితంలో అతి పెద్ద మ్యాచ్ పెళ్లే అన్న టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా? ఆ మ్యాచ్ కు రెఢీ అవుతున్నాడా? అంటే అవుననే సంకేతాలే కనబడుతున్నాయి. వరల్డ్ కప్ తర్వాత రైనాకు పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైనా తల్లి తన స్నేహితురాలి కూతురితో అతని వివాహం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి రైనా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రైనా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా.. అప్పట్లో ఆ ఏడు అడుగులకు ముహూర్తం ఖరారు కాలేదు. గత కొంతకాలంగా క్రికెట్ షెడ్యూల్ లో బిజీగా ఉన్న రైనాకు ఇక పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేయాలని భావిస్తుండటంతో అతనికి త్వరలో మూడు ముళ్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో సురేష్ రైనా ఆకట్టుకుంటున్నాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్ లో రైనా సెంచరీ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. -
ఇక పెళ్లికి రెడీ?
అదేం విచిత్రమో కానీ.. ఇక నయనతార కెరీర్ సాగడం కష్టమే అని పరిశ్రమలో కొంతమంది అనుకుంటున్న సమయంలో ఆమె కెరీర్ వేగం పుంజుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేనప్పటికీ ఈ మలయాళ సుందరి తమిళంలో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ‘వృత్తిపరంగా ఇంత వైభవాన్ని చూస్తున్న మీరు.. వ్యక్తిగతంగా ఎప్పుడు సెటిల్ అవుతారు? పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? లేదా’ అనే ప్రశ్నలు ఈ మధ్య ఆమెకు ఎక్కువయ్యాయట. ఈ ప్రశ్నల ప్రభావమో లేక పెళ్లి చేసుకుని, చక్కగా స్థిరపడితే బాగుంటుందని నయనతారకు అనిపించిందో తెలియదు కానీ.. పెళ్లి చేసుకోవాలని మాత్రం బలంగా నిర్ణయించుకున్నారట. తల్లితండ్రులు చూసే అబ్బాయినే పెళ్లాడాలని నయనతార అనుకుంటున్నారని భోగట్టా. ఈ విషయం గురించి ఇటీవల ఇంట్లో చర్చించారని సమాచారం. సినిమా పరిశ్రమతో సంబంధం లేని అబ్బాయిని చూడమని తల్లితండ్రులకు నయనతార విన్నవించుకున్నారట. మరి.. ఏ అబ్బాయితో నయనతారకు ముడి పెట్టి ఉందో కాలమే చెప్పాలి. -
రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు
చెన్నై : ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి ఎక్కడ దూరం చేస్తారనే భయంతో ఓ ప్రియుడు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అదే ప్రాంతంలోని ప్రయివేటు కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆమెను మందలించారు. అయినా దివ్య తల్లిదండ్రుల మాట వినకపోవటంతో ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వచ్చాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యను తీసుకుని బస్టాండు చేరుకున్నాడు. అయితే దివ్య ఇంట్లో లేకపోవటంతో ఆమె బంధువులు వెతుక్కుంటూ బస్టాండ్ చేరుకున్నారు. దీంతో ఆనంద్ దిక్కుతోచని స్థితిలో హఠాత్తుగా రోడ్డుపైనే తను ప్రేయసి మెడలో తాళి కట్టాడు. ఊహించని ఈ సంఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న తంజావూరు వైద్య కళాశాల పోలీసు ఇన్స్పెక్టర్ బాలమురుగన్ ఆ ప్రేమజంటను తన జీపులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రేమజంటను విచారించిన పోలీసులు....వారిద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.