మానుకోటలో మరో చోరీ
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో బుధవా రం మరో చోరీ జరిగింది. పట్టపగలే దొంగలు ఓ వ్యా పారి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన వ్యాపారి కొదుమూరి శివకుమార్ బుక్కబజార్లో నివాసముం టున్నాడు. ముకుందా టాకీస్ రోడ్డులో అతడు నిర్వహిస్తున్న ఐరన్ షాపునకు బుధవారం ఆయన తన భార్య తో కలిసి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి బీరువా పగులగొట్టి 15తులాల బంగారు ఆభరణాలు(హారం, బ్రాస్లైట్, నెక్లెస్) అపహరించారు. శివకుమార్ మధ్యాహ్న భోజనం నిమిత్తం ఇంటికి వెళ్లేసరికి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లుగా గమనించి టౌన్ పోలీస్‌స్టేçÙన్కు సమాచారమిచ్చాడు. డీఎస్పీ బి.రాజమహేంద్ర నాయక్‌తోపాటు టౌన్ సీఐ నంది రామ్ నాయక్ అక్కడికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించారు.
ఆందోళనలో పట్టణవాసులు
రెండు రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో పట్టణప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. పట్టపగలే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భద్రత కరువైందనే ఆందోళనలో ఉన్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.