Weekend holiday
-
సిటీ ఓటేస్తదా.. టూరేస్తదా..
అసలే అర్బన్ ఓటర్ల నిరాసక్తత... దానికి తోడు వారాంతపు సెలవులు.. వెరసి అర్బన్ ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతుందా? అనే ఆందోళన రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. చాలా నియోజకవర్గాల్లో అర్బన్ ఓటింగ్ బాగా పుంజుకున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్పొరేట్ ఐటీ ఉద్యోగులు వారాంతపు సెలవుల్ని రకరకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఏ మాత్రం అవకాశం దొరికినా సొంతూర్లకు , హాలిడే టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ఈ నేపధ్యంలో పోలింగ్ తేదీ నవంబరు 30 గురువారం కావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే...4రోజుల పాటు లాంగ్ వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అనే ఆలోచన వారిలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో పట్టణీకరణ జోరు కొనసాగుతోన్న నేపధ్యంలో కొన్ని ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఎన్నికల సంఘం గణాంకాలు తెలియజేస్తున్నాయి. పటాన్ చెరు...ఓటర్ల జోరు... గత 2018తో తాజా 2023 మధ్య చూస్తే.. పటాన్ చెరులో ఓటర్ల సంఖ్యలో అత్యధికంగా 35శాతం వృద్ధి నమోదైంది. అదే సమయంలో ఓటర్ల సంఖ్యాపరంగా చూస్తే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా శేరిలింగంపల్లి తన స్థానాన్ని నిలుపుకుంది. ఐటీ పరిశ్రమకు చిరునామాకు తోడుగా.. ఇటీవల వేగవంతమైన హౌసింగ్ బూమ్ కారణంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లిలో గతంలో 5,75,542 లక్షల మంది ఓటర్లు ఉండగా అది 21.2శాతం పెరిగి 6,98,079 లక్షలకి చేరింది. ఇది రాష్ట్ర వ్యాప్త సగటు అయిన 13.15శాతంపెరుగుదలతో చాలా ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగానూ... పట్టణ ఓటర్ల పెరుగుదల హైదరా బాద్ పశ్చిమ ప్రాంతాలకే పరిమితం కాలేదు. నకిరేకల్ (ఎస్సీ) 28శాతం, ఆసిఫాబాద్ (ఎస్టీ) 20, కామారెడ్డి 19, కరీంనగర్ 19, నిజామాబాద్ (అర్బన్) 18శాతంతో ఓటర్లు భారీగా పెరిగారు. తెలంగాణ లోని పాత పట్టణ కేంద్రాలైన ఖమ్మం 15, వరంగల్ పశి్చమ 15, వరంగల్ తూర్పు 16శాతం ఓటర్ల సంఖ్య పెరిగింది. గ్రేటర్ పరిధిలో స్వల్పమే... ఇందుకు భిన్నంగా హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా మాత్రమే పెరిగింది. నాంపల్లి, మలక్‌పేట్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, సనత్‌నగర్‌లో ఓటరు సంఖ్య పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. రిజర్వుడ్ నియోజకవర్గాలుగా ఉన్న అశ్వారావుపేట, భద్రాచలం, వైరా, మధిర, స్టేషన్ ఘనపూర్ కూడా సింగిల్ డిజిట్ వృద్ధిని మాత్రమే నమోదు చేశాయి. ఇక అత్యల్పంగా ఓటర్ల వృద్ధి నమోదైన ప్రాంతం మెదక్‌లోని దుబ్బాక. ఈ నియోజకవర్గంలో కేవలం 2% ఓటర్లు మాత్రమే పెరిగారు. పట్టణ ఓటర్లు ఏం చేస్తారో ఓటింగ్ ఉదాసీనత’కు పేరొందిన పట్టణ ఓటర్ల సంఖ్య పెరగడంతో నేతల్లో ఒకింత ఆందోళన పెరి గింది. శని, ఆదివారాలు సెలవు ఉన్న ప్రైవేట్ కంపెనీల్లోని సిబ్బంది ఓటింగ్ రోజైన గురువారం కూడా కలిపి లాంగ్ వీకెండ్లో భాగం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వీకెండ్ ఎంజాయ్..దేశంలో పెరిగిన పర్యటనలు
సాక్షి, అమరావతి: దేశంలో వారాంతపు పర్యాటకం విస్తరిస్తోంది. ఉద్యోగులు, వ్యాపారులు నెలల ముందుగానే వారాంతపు సెలవులను ఆస్వాదించేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సుమారు 86 శాతం మంది భారతీయులు రానున్న 12 నెలల్లో కచ్ఛితంగా ఏదో ఒక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని ఆసియన్ పసిఫిక్ ట్రావెల్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు 78 శాతం మంది ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది. పర్యాటక పండుగ సీజన్ మొదలు.. ఈ నెలలో వారాంతపు సెలవులు ఎక్కువగా రావడంతో పర్యాటక పండుగ సీజన్ ప్రారంభమైందని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ నెల నుంచే వీకెండ్ ప్రయాణాలు ఊపందుకున్నాయి. దీంతో ట్రావెల్ బుకింగ్ సంస్థలు గెట్ అవే డీల్స్‌ను అందిస్తున్నాయి. తదుపరి ట్రిప్‌లో దాదాపు 10 శాతం పైనే రాయితీలను ప్రకటిస్తున్నాయి. మరోవైపు వారాంతపు సెలవుల్లో హోటళ్లు, రిసార్టులు దాదాపు నిండిపోవడంతో పర్యాటకులు హాస్టళ్లు, హోం స్టేలను ప్రత్యామ్నాయంగా తమ జాబితాలో చేర్చుకుంటున్నారు. ప్రదేశాల ఎంపికకు ప్రాధాన్యం.. పర్యాటకులు గమ్యస్థానాల ఎంపికకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు మహారాష్ట్రలోని లోనావాలా, పూణే, కొచ్చి ప్రాంతాలను విశ్రాంత విడిది కేంద్రాలుగా ఇష్టపడుతున్నారు. తిరుపతి, షిర్డీ, రిషికేశ్, వారణాసికి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. భారతీయ సంస్కృతిని పరిచయం చేసుకునేలా జయపూర్, ఉదయపూర్, ఆగ్రా చుట్టి వస్తున్నారు. పుదుచ్చేరి, గోవా బీచ్‌లు, ఊటీ, మున్నార్, కొడైకెనాల్ వంటి హిల్స్టేషన్లు పాశ్చాత్య అనుభావాలను అందిస్తుండటంతో యువత ఎక్కువగా అటువైపు క్యూ కడుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ పర్యటనల్లో భారతీయ ప్రయాణికులు ఎక్కువగా యూకే, యూఎస్ఏ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, మలేషియాతో పాటు తక్కువ సమయంలో వెళ్లి వచ్చేలా థాయ్‌లాండ్, ఇండోనేషియా, టర్కీ, వియత్నాం, యూఏఈలను ఎంపిక చేసుకుంటున్నారు. -
వీకెండ్ హోమ్స్‌తో హాయ్!
సాక్షి, హైదరాబాద్: కరోనా నుంచి క్రమంగా తేరుకుంటున్న పర్యాటక ప్రేమికులు పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకం, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సమయాన్ని గడిపే వీలున్న వీకెండ్ హోమ్స్ వైపు దృష్టి మళ్లించారు. టూరిజం డిమాండ్ కొంతకాలం పాటు వీకెండ్ హోమ్స్ పరిశ్రమకు మళ్లుతుందని నిర్వాణా రియాల్టీ సీఈఓ పుణీత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఆతిథ్య రంగం వర్క్ ఫ్రం హోమ్ విధానం ఆధారంగా వీకెండ్ హోమ్స్‌ను డిజైన్ చేస్తోంది. చదవండి: 5 శాతం పెరిగిన రేట్లు.. హైదరాబాద్‌లో తగ్గని రియల్టీ జోరు -
Work From Home: అక్కడికి వెళ్లేందుకు ఉద్యోగుల ఆసక్తి.. కారణం ఏంటంటే ?
కొలంబస్.. కొలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి.. సెలవు.. సెలవు.. కనుగొను కొత్త దీవి నీవు.. అన్న పాటను నిజం చేసే ట్రెండ్ ఇప్పుడు ఇండియాలోనూ వచ్చేస్తోంది. కరోణా కారణంగా నెలల తరబడి ఇళ్లకే పరిమితమై ఉద్యగులు వారాంతాల్లో రిలాక్స్ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందు కోసం వీకెండ్ హోమ్స్‌ని ఎంచుకుంటున్నారు. ఈ కల్చర్ క్రమంగా పెరగడంతో ఇప్పుడు అందుకు తగ్గట్టుగా రియల్టర్లు వీకెండ్ హోం ట్రెండ్‌పై దృష్టి పెట్టారు. సాక్షి, హైదరాబాద్: నిన్నమొన్నటి దాకా కరోనా, ఇప్పుడిక ఒమిక్రాన్ ఇక ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో పర్యాటక ప్రేమికులు ఇళ్లకే పరిమితమైపోయారు. పరిశుభ్రత, భద్రత, విలాసవంతమైన వసతులు, మెరుగైన నిర్వహణ సేవలు ఉండే వీకెండ్ హోమ్స్ వైపు దృష్టిసారించారు. దీర్ఘకాలం పాటు గడిపేందుకు ఇష్టపడుతున్నారు. నివాసితుల అభిరుచికి తగ్గట్లుగా వీకెండ్ హోమ్స్‌ను మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. దెబ్బతిన్న టూరిజం కరోనా మహమ్మారి నేపథ్యంలో పర్యాటకం, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సమయాన్ని గడిపే వీలున్న వీకెండ్ హోమ్స్ వైపు దృష్టి మళ్లించారు. టూరిజం డిమాండ్ కొంతకాలం పాటు వీకెండ్ హోమ్స్ పరిశ్రమకు మళ్లుతుందని నిర్వాణా రియాల్టీ సీఈఓ పుణీత్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఆతిథ్య రంగం వర్క్ ఫ్రం హోమ్ విధానం ఆధారంగా వీకెండ్ హోమ్స్‌ను డిజైన్ చేస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగ పరిశ్రమలు సుదీర్ఘకాలం పాటు కస్టమర్లకు అవాంతరాలు లేని విలాసవంతమైన వసతులను కల్పించడంలో తలమునకలయ్యాయని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్ ప్రయాణ పరిమితులపై సడలింపులు ఎత్తివేయడంతో చాలా మంది ప్రయాణాల వైపు దృష్టిమళ్లించారు. మరోవైపు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంలో పని చేస్తున్న వారెందరో ఉన్నారు. వీరికి కావాల్సిందల్లా మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం, చేతిలో ల్యాప్‌టాప్ అంతే! రిమోట్ వర్క్ సంస్కృతి అనేది తదుపరి దశకు చేరుకుంది. ఇది దీర్ఘకాలం పాటు ఉండే విధానం. ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పాటు అనేక భారతీయ కంపెనీలు రిమోట్ వర్క్ కల్చర్‌ను రెండో దశలోకి తీసుకెళ్లాయి. కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోయినా సరే ఆయా కంపెనీ శాశ్వత వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రకటించేలా ఉన్నాయి. దీంతో స్టేకేషన్స్కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. ట్రెండ్‌కు తగ్గట్టుగానే డెవలపర్లు వీకెండ్ హోమ్స్ విలాసవంతమైనవి కావటం, వీటిని నిర్వహణలో సమస్యల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు వీటి కొనుగోళ్లలో దూరంగా ఉంటారు. దీంతో చాలా మంది డెవలపర్లు వీకెండ్స్ హోమ్స్ సేవలను సమీకృతం చేస్తున్నారు. అంటే హౌస్ కీపింగ్, వసతుల నిర్వహణ సేవలను అందిస్తారన్నమాట. దీంతో వీకెండ్ హోమ్స్ కొనుగోళ్లు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. మరోవైపు కొందరు కస్టమర్లు వీకెండ్ హోమ్స్‌ను బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) కంపెనీలకు అద్దెకు ఇచ్చి ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీటిని అద్దెకు తీసుకుంటున్నారు. ఇప్పట్లో దేశీయ ప్రయాణాలు అంత సురక్షితం కాదని, విదేశీ యాత్రల ఊసేలేని నేపథ్యంలో వీకెండ్ హోమ్స్‌కు డిమాండ్ అనివార్యమైంది. చదవండి: ఈ విషయంలో శాన్‌ఫ్రాన్సిస్కోని వెనక్కి నెట్టిన న్యూఢిల్లీ -
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
వారానికి 3 రోజులు సెలవులిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. కేంద్రం కార్మిక చట్టాలను మార్చి.. ఆరు రోజుల పని దినాలను నాలుగు రోజులకు కుదించనుంది అనేది ఈ చర్చల సారాంశం. ఇది ఇంకా ప్రతిపాదనలోనే ఉంది. అమలు కూడా అంత తేలక కాదు. పైగా ఈ నిర్ణయం తప్పకుండా అమలు చేయాలని ఒత్తిడి తేవడానికి వీలు లేదు. సంస్థల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది జరగడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ లోపు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో ఇలాంటి నిర్ణయం అమల్లో ఉంది.. అక్కడ వచ్చిన మార్పులు ఏంటి.. దీని వల్ల వచ్చే నష్టాలు ఏంటనే తదితర అంశాల మీద ఓ లుక్కేయండి.. ఐదు రోజుల పని.. 2 రోజుల రెస్ట్ ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా ఐటీ రంగంలో ఈ విధానం అమల్లో ఉంది. వారానికి ఐదు రోజులు పని చేస్తే.. రెండు రోజులు వీకెండ్. బ్యాంక్ ఉద్యోగులకు నెలలో రెండు సార్లు ఇలాంటి అవకాశం లభిస్తుంది. అయితే తొలత ఈ విధానాన్ని ఓ అమెరికన్ ఫ్యాక్టరీ అమల్లోకి తెచ్చింది. మతపరమైన కారణాల వల్ల 1908లో అమెరికన్ ఫ్యాక్టరీ అయిన న్యూ ఇంగ్లాండ్ మిల్లు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. వారంలో ఐదు రోజులు పని చేస్తే.. శని, ఆదివారాలు రెస్ట్. కార్మికులు చర్చికి వెళ్లడానికి వీలుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. పని గంటలు తగ్గించిన దేశాలు ఫ్రాన్స్: 20 ఏళ్ల క్రితం ఫ్రాన్స్ పని గంటలు తగ్గిస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ పౌరులు పని-వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విమర్శకులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. పని గంటలు తగ్గించడం వల్ల ఫ్రెంచ్ కంపెనీల్లో పోటీతత్వం తగ్గిందని విమర్శించారు. నెదర్లాండ్స్: నెదర్లాండ్స్ పని గంటలను భారీగా తగ్గించింది. ఈ మేరకు 2000 సంవత్సరంలో ఓ చట్టం చేసింది. దీని ప్రకారం నెదర్లాండ్స్‌లో వారానికి 29 గంటలు మాత్రమే పని చేస్తే చాలు. న్యూజిలాండ్, ఫిన్లాండ్: ఇరువురు దేశాధ్యక్షులు తక్కువ పని గంటల చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. మన దగ్గర పరిస్థితి మన దేశంలో వారానికి 48 గంటలు పని చేయాలి. దీని ప్రకారం వారానికి ఆరు రోజుల పని చేస్తే.. రోజుకు 8 గంటలు వర్క్ చేయాలి. ఒకవేళ కేంద్రం వారానికి నాలుగు పని దినాల చట్టం అమలు చేస్తే.. అప్పుడు రోజుకు 9.6 గంటలు పని చేయాల్సి ఉంటుంది. వారానికి నాలుగు పని దినాలు-ప్రయోజనాలు పని దినాలను తగ్గించి.. వర్క్ అవర్స్‌ను పెంచే అంశం మీద అనేక పరిశోధనలు జరిగాయి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని సదరు సర్వేలు వెల్లడించాయి. తక్కువ పని దినాల వల్ల ఉత్పత్తి పెరగుతుంది.. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటుంది.. కంపెనీకి- ఎంప్లాయికి మధ్య బంధం బలపడుతుంది.. ఫలితంగా ఎక్కువ రోజులు ఒకే కంపెనీలో కొనసాగే అవకాశం ఉంటుందని సర్వేలు వెల్లడించాయి. ఇక విద్యుత్ వినియోగం 23 శాతం, పేపర్ ప్రింటింగ్ 59శాతం తగ్గుతుందని సర్వే తెలిపింది. నష్టాలు పని రోజులు తగ్గుతాయి.. కానీ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి. దీని వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. ఇది అన్ని వ్యాపారాలకు వర్తించదు. రెస్టారెంట్, మీడియా వంటివి రోజు నడవాల్సిందే. అలాంటప్పుడు వీటిల్లో పని చేసే వారికి వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వాలంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలి.. షిఫ్ట్‌లు కేటాయించడం కూడా కష్టం అవుతుంది. నగరాల వారిగా సంవత్సరానికి సగటు పని గంటలు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతీయులు సంవత్సరంలో అత్యధిక గంటలు పని చేస్తున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. మన దగ్గర ఓ ఉద్యోగి ఏడాదికి సగటున 2,117 గంటలు పని చేస్తున్నాడు. దుబాయ్‌లో ఇది 2,323 గంటలు, లండన్‌లో 2,003 గంటలు, టోక్యోలో 1,997 గంటలు, పారిస్‌లో 1,663 గంటలుగా ఉంది. చైనాలో కూడా ఏడాదికి సగటు పని గంటలు మన కన్నా తక్కువే. బీజింగ్‌లో ఒక ఉద్యోగి ఏడాదికి సగటున 2,096 గంటలు పని చేస్తున్నాడు. ఇక మనదగ్గర ముంబైలో ఓ ఉద్యోగి సగటున ఏడాదికి 2,691 గంటలు పని చేస్తుండగా.. ఢిల్లీలో 2,511 గంటలు వర్క్ చేస్తున్నాడు. చదవండి: ఇక ‘ఓవర్‌టైమ్’కి వేతనం.. ఈ సడలింపులు ఎవరికి ప్రయోజనకరం? -
వీకెండ్ ఎంజాయ్మెంట్
వాషింగ్టన్/లండన్/మాస్కో/రోమ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతూ ఉండడంతో అమెరికా నుంచి ఆసియా వరకు చాలా దేశాలు లాక్డౌన్లను దశల వారీగా ఎత్తేస్తున్నాయి. ఇన్నాళ్లూ నాలుగ్గోడల మధ్య ఉండిపోయిన ప్రజలు బయట గాలిని పీల్చుకుంటున్నారు. చైనాలో వీకెండ్ హాలిడేస్‌లో పార్కులు, టూరిస్టు ప్రాంతాలకు జనం వెల్లువెత్తారు. శని, ఆదివారాల్లో చైనాలో పర్యాటక కేంద్రాలను పది లక్షల మంది వరకు సందర్శించినట్టు ఒక అంచనా. స్పెయిన్‌లో కూడా ఈ వీకెండ్ సందడి వాతావరణం కనిపించింది. బంధుమిత్రులతో కలిసి తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఇన్నాళ్లూ పడిన ఒత్తిడి నుంచి తేరుకున్నట్టు కనిపించారు. ఇటలీలో కూడా ఆంక్షలు చాలా వరకు సడలించడంతో రోడ్లపైకి ప్రజలు వచ్చి ఆనందంగా అందరితోనూ మాట్లాడుతూ కనిపించారు. సోమవారం నుంచి పార్కులు, పబ్లిక్ గార్డెన్లు, బైక్ రైడింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో ప్రజలంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతీ ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ మాస్కులతోనే కనిపించారు. అమెరికాలోనూ తెరుచుకున్న పార్కులు అమెరికాలో కోవిడ్‌తో అతలాకుతలమైన న్యూయార్క్, న్యూజెర్సీలలో పార్కులు తెరుచుకున్నప్పటికీ ప్రతీ చోటా సాధారణంగా వచ్చే ప్రజల్లో 50శాతం మంది మాత్రమే రావాల్సిందిగా అనుమతులిచ్చారు. ఇక వాషింగ్టన్లో సోమవారం నుంచి సెనేట్ ప్రారంభం కానుంది. రిపబ్లికన్ పార్టీకి మెజార్టీ ఉన్న సెనేట్ తెరుచుకుంటూ ఉంటే, డెమొక్రాట్ల ఆధిక్యం కలిగిన ప్రతినిధుల సభకి మాత్రం ఇంకా తాళం తీయడం లేదు. అమెరికాలో వైద్యులకి వందనం అమెరికాలో ఫ్రంట్‌లైన్ సిబ్బంది అహోరాత్రాలు నిర్విరామంగా పనిచేసినందుకు గాను ఎయిర్ ఫోర్స్,నేవీ సంయుక్తంగా విన్యాసాలు చేసి వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్లూ ఏంజెల్స్, థండర్ బర్డ్స్‌కు చెందిన సుశిక్షితులైన పైలట్లు వాషింగ్టన్, అట్లాంటా, బాల్టిమోర్ మీదుగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేసి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలో ఒకే రోజు 10వేలకు పైగా కేసులు రష్యాలో ఆదివారం 10,633 తాజా కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికిపైగా కేసులు మాస్కోలో నమోదయ్యాయి. బ్రిటన్‌లో కూడా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. -
నోటు లేదు.. సెలవు లేదు..
-
నోటు లేదు.. సెలవు లేదు..
• కరెన్సీ వేటలో సెలవులు వృథా.. • 90 శాతంపైగా ఏటీఎంలకు షట్టర్లు • వరుస సెలవులతో మూతపడ్డ బ్యాంకులు • అత్యవసర ఖర్చులకూ నగదు దొరక్క ప్రజలు విలవిల • తిండికీ, చార్జీలకూ డబ్బు కటకటే • నోట్ల కోసం జనం తిప్పలు.. నేడూ అదే పరిస్థితి! సాక్షి, నెట్వర్క్ ఆదివారం వారాంతపు సెలవు నోట్ల వేటలో కరిగిపోయింది. నోటు దొరకలేదు. శ్రమ మాత్రం వృథా అయింది. మూడు రోజులు వరుస సెలవులతో బ్యాంకులు మూత పడ్డాయి. అత్యవసర ఖర్చుల కోసం కనీసం రూ.2 వేలైనా తీసుకుందామని ఏటీఎంలను వెతుక్కుంటూ వెళితే ఎక్కడకు వెళ్లినా ‘నో క్యాష్... అవుటాఫ్ ఆర్డర్’ బోర్డులే దర్శనమిచ్చాయి. ఆదివారం రాష్ట్రంలో 90 శాతంపైగా ఏటీఎంలు పనిచేయలేదు.గుంటూరు నగరంలో వంద ఏటీఎంలు ఉండగా నగరపాలెంలో ఒక్క ఏటీఎం మాత్రమే పని చేసింది. జిల్లాలో మొత్తం 800 ఏటీఎంలు ఉండగా పట్టుమని పది కూడా పనిచేయలేదు. కర్నూలు జిల్లాలో 95 శాతంపైగా ఏటీఎంలు మూతపడ్డాయి. ఉద్యోగులు శని, ఆదివారాల్లో సెలవులు కావడంతో నగదు తీసుకునేందుకు ఏటీఎంల చుట్టూ తిరుగుతూ వారాంతపు సెలవులను వృథా చేసుకున్నామని వాపోయారు. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు... ఔషధాల కొనుగోలు, వైద్యానికి, నిత్యావసర సరుకుల కొనుగోలుకు కనీసం అవసరమైన సొమ్ములేక పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. గ్రామాలకు సమీపంలోని పట్టణాల్లో ఏటీఎంలు మూత పడి ఉండటంతో జిల్లా కేంద్రాల్లో అయితే నగదు ఉంటుందనే ఉద్దేశంతో ఆదివారం చాలా మంది గ్రామీణులు అష్టకష్టాలు పడి జిల్లా కేంద్రాలకు వెళ్లారు. అక్కడా మూత పడిన ఏటీఎంలు వారిని తీవ్ర నిరాశ పరిచాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేటకు చెందిన రవి కుమార్తె హైదరాబాద్‌లోని నారాయణ స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతోంది. తన స్నేహితురాలి తండ్రి ఈనెల 12వ తేదీన హాస్టల్‌కు వస్తున్నారని, పుట్టిన రోజు సందర్భంగా డ్రస్ తీసుకోవడానికి, ఇతర ఖర్చులకు రూ. 1500 పంపించాలని తండ్రి రవికి స్కూలు హాస్టల్ నుంచి ఫోన్ చేసి చెప్పింది. రవి ఆ డబ్బు ఇచ్చి పంపుదామని మూడు రోజులుగా ప్రయత్నించినా వీలుకాలేదు. అనంతపురం జిల్లా కదిరికి చెందిన షేక్ మస్తాన్ వలి కుమార్తెకు ఆస్తమా ఉంది. చలికాలం కావడంతో ఆస్తమా తీవ్రత పెరిగి రాత్రిపూట ఊపిరి ఆడక రాత్రిళ్లు లేచి కూర్చుంటోంది. ఆటో తో జీవనం సాగించే ఆయనకు ఏటీఎం కార్డు కూడా లేదు. బ్యాంకులో డబ్బు ఉన్నా తీసుకుని బిడ్డకు వైద్యం అందించలేని దుస్థితిలో ఉన్నానని మస్తాన్‌వలి వాపోతున్నారు. మాటలు చెప్పడం సులభమే... కార్డుల ద్వారా చెల్లింపులు జరపాలని ప్రధానమంత్రి, సీఎం ఇతరులు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. మాటలు చెప్పడానికి ఆచరించడానికి చాలా తేడా ఉంటుందని గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా బిడ్డకు జ్వరం వచ్చింది. కడపలో చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లాను. నాదగ్గర నగదు లేదని ఏటీఎం కార్డు ఉందని, దాని ద్వారా చెల్లింపులు జరుపుతానని చెప్పాను. మా ఆస్పత్రిలో స్వైపింగ్ మిషన్ లేదని అక్కడి సిబ్బంది చెప్పారు. సరే ఉన్న డబ్బు ఫీజుగా చెల్లించి పాపను డాక్టరుకు చూపించాను. జిల్లా కేంద్రమైన కడపలోనే నాలుగు మందుల షాపులకు వెళితే ఎక్కడా స్వైపింగ్ యంత్రం లేదు. మరి నేను మందులు ఎలా కొనాలి?’ అని వైఎస్సార్ జిల్లా నాగిరెడ్డిపల్లెకు చెందిన నారాయణరెడ్డి అనే ప్రభుత్వ టీచరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కూడా బ్యాంకులకు సెలవే. ఏటీఎంలు పనిచేసే అవకాశం తక్కువేనని బ్యాంకుల అధికారులు తెలిపారు. అంతటా అదే దుస్థితి తూర్పు గోదావరి జిల్లాలో 931 ఏటీఎంలుండగా, ఐదు శాతం ఏటీఎంలలో మాత్రమే నగదు లభిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 10–15కు మించి ఏటీఎంలు పనిచేయలేదు. కర్నూలు జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా..ఆదివారం పది మాత్రమే పనిచేశాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 48 బ్యాంకులకు చెందిన 928 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ నగరంలో బందరురోడ్డు, మధురానగర్ ప్రాంతాల్లో రెండు ఏటీఎం కేంద్రాలు పనిచేయగా.. అక్కడ జనం కిలోమీటర్ల కొద్దీ బారులు తీరారు. విజయనగరం జిల్లాలోని 266 ఏటీఎంలలో కొన్నింటిలో మాత్రమే కాసేపు ఆదివారం నోట్లు వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం రోజున తిరుపతి నగరంలో మాత్రం మూడు ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. తిరుమలలో 15 ఏటీఎం కేంద్రాలు వుంటే అందులో ఒక్కటి కూడా తెరుచుకోకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. వైఎస్సార్ జిల్లాలోని కడప, జమ్మలమడుగులో మాత్రమే ఒకటి, రెండు ఏటీఎంలు పనిచేశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ అదే దుస్థితి. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 98 శాతం ఏటీఎంలు మూతపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క ఏటీఎం పని చేయలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 594 ఏటీఎంలు ఉండగా, 232 ఏటీఎంలలో గంట మాత్రమే నగదు వచ్చింది. -
మాకూ వీక్లీ ఆఫ్ కావాలి...
- తెలంగాణ తరహాలో వారాంతపు సెలవు కోరుతున్న పోలీసులు - ప్రతిపాదనలున్నాయి... ప్రభుత్వ నిర్ణయమే తరువాయంటున్న ఎస్పీ శ్రీకాకుళం క్రైం: నిత్యం నేరాలు ఘోరాలతో సావాసం... రాత్రనక పగలనక తిండి తిప్పలు లేక విధి నిర్వహణ... ప్రజాప్రతినిధుల రక్షణలో కీలక పాత్ర... ప్రజల మాన, ప్రాణ, ఆస్తుల రక్షణలో నిమగ్నం... ఇవన్నీ చెబుతున్నది ఎవరి గురించో అర్ధమయ్యేవుంటుంది.. వారే మన పోలీసులు. రోజంతా ప్రజల కోసం శ్రమిస్తారు. కాని ఆ పోలీసుల ఆరోగ్య రక్షణ, వారి కుటుంబ సరదాలను ఎవ్వరూ పట్టించుకోరు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారంలో ఒక రోజును వారాంతపు సెలవుగా ప్రకటించింది. దీంతో ఆ రాష్ట్ర పోలీసుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అదే తరహాలో మన రాష్ట్ర పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్ మంజూరు ేయాలన్న ఆలోచన మొదలైంది. జిల్లాలో ఎస్పీ, ఇద్దరు ఓఎస్డీలు, నలుగురు డీఎస్పీలు, 56 మంది సీఐలు, నలుగురు ఆర్ఐలు, 11 మంది ఆర్ ఎస్సైలు, 111 మంది ఎస్సైలు, 81 మంది ఏఎస్సైలు, 251 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 982 మంది కానిస్టేబుళ్లు, 400 మంది ఎ.ఆర్.ఎస్సైలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏ శాఖలో పనిచేసిన వారికైనా వారాంతపు సెలవు ఉంటుంది గానీ, ఒక్క పోలీసులకు మాత్రం ఇంత వరకు ఆ భాగ్యం దక్కలేదు. దీని కారణంగా చాలా మంది పోలీసులు ఒత్తిడికి గురై అనారోగ్యానికి లోనవుతున్నారు. అంతేకాకుండా కుటుంబసభ్యులతో సరదాగా గడిపే ఆనందాన్ని కూడ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ భావనను దూరం చేయాలంటే కచ్చితంగా వారాంతపు సెలవు కావల్సిందేనన్నది పోలీసు ఉన్నతాధికారుల భావన.ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. అయితే వారాంతపు సెలవు వల్ల విధులకు భంగం రాకుండా కొత్త నియామకాలు చేపట్టి సిబ్బందిని పెంచాల్సివుంటుంది.