West Bengal assembly election
-
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తిపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.అన్నాడీఎంకేలో అలజడితమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్ను షణ్ముగం మంగళవారం కలిశారు.అస్సాంలోనూ అసంతృప్తిఅస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్‌కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇప్పుడు సీఎంగా ప్రమాణం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.‘‘మ్యాథ్యూ శామ్యుయేల్ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట్టింది ఆ స్టింగ్ ఆపరేషన్. అందులో టీఎంసీ నేతల్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.२०१४ मध्ये तहलका मॅगझिनच्या पत्रकार मॅथ्यू सॅम्युअल यांनी नारदा स्टिंग ऑपरेशन केले.TMC चे अनेक मोठे नेते लाच घेताना पकडले गेले, त्यात सुवेंदु अधिकारी देखील होते.२०१६ च्या निवडणुकीत BJP ने या व्हिडिओला प्रचंड प्रमोट केले,पुढे जेव्हा सुवेंदु भाजपात आले, तेव्हा BJP ने आपल्या… pic.twitter.com/YQGvYYkbTC— Sanjay Raut (@rautsanjay61) May 9, 2026మీడియా సమావేశంలోనూ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. In 2016, Modi attacked Suvendu Adhikari for taking bribe on camera.In 2021, Suvendu joined the BJP and Modi took 5 years to wash him in the BJP washing machine.Now, Modi blesses him as he takes oath as a CM. No one should doubt Modi’s fight against corruption. pic.twitter.com/ldkTi6qvp5— Shantanu (@shaandelhite) May 9, 2026यह मोदीजी अपने ही बनाए हुए मुख्यमंत्री सुवेनदू अधिकारी की बात कर रहे हैं! pic.twitter.com/RcfS0JXASQ— Prashant Bhushan (@pbhushan1) May 9, 2026 -
కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన కేబినెట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక మహిళా నేత 51 ఏళ్ల అగ్నిమిత్ర పాల్. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచం నుంచి బెంగాల్ గల్లీ రాజకీయాల వరకు ఆమె సాగించిన ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.అలనాటి హీరోయిన్లకు దుస్తుల తయారీ..ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దిలీప్ ఘోష్, నిశిత్ ప్రమాణిక్ వంటి ఉద్దండులతో పాటు అగ్నిమిత్ర పాల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి ఈమె కావటం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు అగ్నిమిత్ర పాల్ కోల్‌కతా ఫ్యాషన్ రంగంలో తిరుగులేని సెలబ్రిటీగా వెలుగొందారు. ‘ఇంగా’ అనే ఫ్యాషన్ లేబుల్‌తో శ్రీదేవి, హేమమాలిని వంటి దిగ్గజ నటీమణులకు ఆమె దుస్తులను డిజైన్ చేశారు.2019లో రాజకీయ అరంగేట్రం పశ్చిమ బెంగాల్ సంప్రదాయ ‘కాంతా’ ఎంబ్రాయిడరీని అంతర్జాతీయ వేదికలపైకి అగ్నిమిత్ర పాల్ తీసుకువచ్చారు. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిపై 40,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. బీజేపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, పార్టీ ఉపాధ్యక్షురాలిగా అగ్నిమిత్ర కీలక బాధ్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రి రేసులో..ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆమె పేరు వినిపించడం విశేషం. అయితే ఆమె రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, నిరసనలు, ఆందోళనలకు సంబంధించి ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ కేసులోనూ శిక్ష పడకపోయినప్పటికీ, బెంగాల్ మట్టి బిడ్డగా పోరాట పటిమను ప్రదర్శిస్తూ, ఆమె కేబినెట్లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. -
గతంలోనూ ముగ్గురు సహాయకులను కోల్పోయిన సువేందు
బీజేపీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ దుండగుల కాల్పుల్లో ప్రాణాల కోల్పోయిన విషయం తెలిసిందే. సువేందు అధికారి తన సహాయకులను కోల్పోవడం ఇది మొదటిసారి కాదు. 13 ఏళ్లలో సువేందు అధికారి ముగ్గురు సహాయకులను కోల్పోయారు.ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. చంద్రనాథ్ రథ్‌ది రాజకీయ హత్య అని ఆయన అంటున్నారు. గతంలో మృతి చెందిన సువేందు అధికారి సహాయకుల వివరాలు చూద్దాం..2013: వ్యక్తిగత సహాయకుడి మరణంఇలాంటి తొలి ఘటన 2013లో జరిగింది. సువేందు అధికారి తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ప్రదీప్ ఝా, పూర్బా మెదినిపూర్ జిల్లాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అయితే, ఆ సమయంలో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదంగా మారలేదు. దర్యాప్తు అధికారులు కూడా నేర కోణాన్ని నిర్ధారించలేదు.2018: విగత జీవిగా భద్రతా అధికారిసువేందుకు 2018లో వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన రాష్ట్ర సాయుధ పోలీసు కానిస్టేబుల్ శుభబ్రత చక్రవర్తి.. పూర్బా మెదినిపూర్‌లోని కాంతి పోలీసు బ్యారక్‌లో విగతజీవిగా కనిపించారు. తన సర్వీస్ రివాల్వర్‌తో తానే కాల్చుకున్నారని చెబుతూ పోలీసులు మొదట దీన్ని ఆత్మహత్యగా పరిగణించారు. 2021లో చక్రవర్తి భార్య ఈ ఘటనపై మళ్లీ దర్యాప్తు కోరడంతో కేసు మరోసారి చర్చకు వచ్చింది. ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. తరువాత పశ్చిమ బెంగాల్ సీఐడీ మళ్లీ దర్యాప్తు ప్రారంభించింది. ఘటన స్థలాన్ని పునర్నిర్మించి, మొదటి దర్యాప్తుతో సంబంధం ఉన్న పలువురు పోలీసులను ప్రశ్నించింది. ఈ పరిణామంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య రాజకీయ ఘర్షణ పెరిగింది. కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నాయి.2021: వ్యక్తిగత సహాయకుడి మరణంసువేందుకు మరో వ్యక్తిగత సహాయకుడైన పులక్ లాహిరి 2021లో అసాధారణ పరిస్థితుల్లో మరణించినట్టు సమాచారం. నేరపూరిత కుట్ర జరిగిందని నిర్ధారించే తుది వివరాలు ఇప్పటివరకు బయటకు రాలేదు.2026: చంద్రనాథ్ రథ్ మృతితాజా ఘటనలో సువేందుకు సన్నిహిత సహాయకుడైన చంద్రనాథ్ రథ్‌ను కాల్చిచంపారు. రాజకీయ లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ, నిష్పక్షపాత దర్యాప్తు కోరుతున్నారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్.. ఇకపై..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది.కాగా, ఈవీఎంల మానిప్యులేషన్, హింస ద్వారా పశ్చిమ బెంగాల్లో ప్రజా తీర్పును మార్చారంటూ బీజేపీ, భారత ఎన్నికల కమిషన్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ పార్టీ కోర్టును ఆశ్రయించనున్నట్టు ప్రకటించారు.బెనర్జీ తన నిర్ణయంపై వెనక్కి తగ్గకపోవడంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిసి ఎన్నికల ఫలితాల గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించారు. దీంతో ఘన విజయం సాధించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. అగర్వాల్‌తో పాటు ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ నరియాలాను కూడా గవర్నర్‌ను కలిశారు. అనంతరం అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. “భారత ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థుల గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ అన్ని నిర్ణయాలు తీసుకుంటారు” అన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 172ను ప్రస్తావిస్తూ, లోక్ భవన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో మే 6 అర్ధరాత్రి నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే వరకు ప్రస్తుత మంత్రివర్గం తాత్కాలిక ప్రభుత్వంగా కొనసాగవచ్చని చెప్పారు. -
అందుకే నా పీఏను చంపారు.. బైక్ దొరికింది: సువేందు
కోల్‌కతా: ముందుగానే పథకం వేసి తన పీఏ చంద్రనాథ్ రాథ్‌ను హత్య చేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్‌గ్రామ్‌లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. “ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్‌లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చు” అని అన్నారు.హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. “నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై 4 బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం వేసి చేశారు” అని చెప్పారు.ఇది చంద్రనాథ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. “ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు” అని అన్నారు.చంద్రనాథ్‌కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. “ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య” అని అన్నారు.రాథ్‌ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. “ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమే” అని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు.“ప్రస్తుతం తూర్పు మేదినీపూర్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి వద్ద ఉన్నారు. ఆయన కుమార్తె, భార్యను చూసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి, చార్జ్‌షీట్ దాఖలు చేసి, వారికి ఉరిశిక్ష పడేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిని పర్యవేక్షించడం నా బాధ్యత. నా సహచరులంతా నాకు సాయం చేస్తారు” అని చెప్పారు.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.“నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారు” అని సువేందు చెప్పారు.ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్‌గ్రామ్‌లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు.ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్.. కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్‌గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. -
‘‘రాజీనామా చేయకపోతే మమతా బెనర్జీని ఇలా తొలగించొచ్చు’’
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేయాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. బెంగాల్ ప్రజలు ఆమె తప్పిదాలు, చర్యలను చాలా కాలంపాటు సహించారని చెప్పారు."ఆమె రాజీనామా చేయకపోతే ఆమెను డిస్మిస్ చేస్తారు. దేశం ఆమె ఇష్ట ప్రకారం నడవదు. గవర్నర్ కొంతకాలం వేచి ఉంటారు. ఆ తర్వాత ఆమెను తొలగిస్తారు.. అంతే, ఈ ప్రక్రియ సులభం. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 100 సీట్లు మీ నుంచి దోచుకున్నారని అంటున్నారు? అయితే, నేను కూడా అస్సాంలో కాంగ్రెస్ గెలిచిన 19 సీట్లను నా నుంచి దోచుకున్నారని అనొచ్చు. నాకు 126 రావాలి అనొచ్చు. దేశం అలా పనిచేయదు" అని అన్నారు."మీరు సరిహద్దులో కంచె ఏర్పాటుకు అనుమతించరు. ఇప్పుడేమో సీట్లు దోచుకున్నారని అంటారు. ఈ ఫలితం చాలా కాలం క్రితమే రావాలి. బెంగాల్ ప్రజలు మీకు చాలా ఇచ్చారు. ఇప్పుడు వారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. మీరు 'నేను రాజీనామా చేయను' అంటారు. సమాజం మీ నిర్ణయంతోనే నడుస్తుందా? ఎస్ఐఆర్ను ఉపయోగించి ఓటు దోపిడీ జరిగిందని, ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి పనిచేశాయని చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యం ఎక్కడ?" అని ప్రశ్నించారు.కాగా, గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. ఇవాళ రాజీనామా ఇవ్వడానికి నిరాకరించారు. ఆమె తీరు వల్ల ఊహించని పరిస్థితి ఏర్పడింది. "నేను ఓడిపోలేదు, కాబట్టి రాజ్ భవన్‌కు వెళ్లను. రాజీనామా ఇవ్వను" అని మమతా బెనర్జీ మీడియాతో చెప్పారు.గవర్నర్ సాంకేతికంగా ముఖ్యమంత్రిని తొలగించొచ్చు. అయితే కొన్ని నియంత్రణలు ఉన్నాయి. గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా నిర్దేశించాయి. అసెంబ్లీకి ఉన్న గడువు మే 7. అది పూర్తయ్యేలోపే గెలిచిన పార్టీ ముందుకు వచ్చి “మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం” అని చెబితే.. గవర్నర్ వారిని ఆహ్వానించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. అలా జరిగితే మమతా బెనర్జీని ప్రత్యేకంగా తొలగించే అవసరం ఉండదు. -
ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులకు దారితీశాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించి, 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది. బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతని పేరు అశోక్ దిండా.దిండా పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యాడు. దిండా తన సమీప ప్రత్యర్ది, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో గెలిచి తన ప్రజాదరణను మరింత పెంచుకున్నాడు.2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన దిండా, అదే సంవత్సరంలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి గెలవడంతో, త్వరలో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా నియమితుడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. గత టీఎంసీ ప్రభుత్వంలో ఓ టీమిండియా మాజీ క్రికెటర్ (మనోజ్ తివారి) మంత్రిగా ఉండటంతో దిండాకు కూడా ఈసారి మంత్రివర్గం ఛాన్స్ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు.42 ఏళ్ల దిండా 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. -
పశ్చిమ బెంగాల్ సీఎంగా మహిళ..?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఆ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు స్వీకరించేది ఎవరు? ముఖ్యమంత్రిగా బీజేపీ ఒక మహిళను ఎంపిక చేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన ప్రచారంలో పదేపదే, బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమిస్తామని చమత్కారంగా చెప్పారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మరింత ముందుకు వెళ్లి, తదుపరి ముఖ్యమంత్రి “నాన్-వెజిటేరియన్” అవుతారని చెప్పారు. దీన్ని, బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం నిషేధిస్తుందని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ గెలవడంతో మమత స్థానంలో ఎవరు వస్తారన్నది ప్రధాన చర్చగా మారింది.అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీకి చాన్స్? ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా బీజేపీ సాధారణంగా రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించదు. బెంగాల్లో మోదీనే పార్టీ ప్రధాన ఆకర్షణ. ప్రధాన మంత్రి 20కి పైగా సభల్లో పాల్గొని, మమతా కోటను గెలుచుకోవడానికి విస్తృతంగా ప్రచారం చేశారు.గత నెలలో మోదీ బెంగాల్ సంస్కృతితో మమేకమయ్యారు.. జాల్మురి తిన్నారు, కాళీ ఆలయం సందర్శించారు (ఇక్కడ మాంసాహారం ప్రసాదంగా ఇస్తారు). ఫుట్‌బాల్ ఆడారు, బెంగాలీలో ఆడియో సందేశం విడుదల చేశారు. బెంగాల్ ప్రజలు “బ్రాండ్ మోదీ”పై నమ్మకం ఉంచినట్లు కనిపిస్తోంది.కానీ, ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు? మహిళల భద్రతను ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్న బీజేపీ ఒక మహిళను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఏకైక రాష్ట్రం ఢిల్లీ (రేఖా గుప్తా). మహిళా రిజర్వేషన్ చట్టం చుట్టూ జరిగిన వివాదాల తరువాత, మహిళా అనుకూలతను బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.ప్రధాన మహిళా నాయకుల్లో అగ్నిమిత్ర పాల్, రూపా గాంగూలీ ఉన్నారు. రూపా గాంగూలీ బి.ఆర్. చోప్రా “మహాభారత్” సీరీస్‌లో ద్రౌపది పాత్రతో ప్రసిద్ధి చెందారు. ఇతర ప్రధాన అభ్యర్థుల్లో ప్రతిపక్ష నాయకుడు, మమతా ప్రత్యర్థి సువేందు అధికారి, రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య, నిసిత్ ప్రమాణిక్, దిలీప్ ఘోష్ ఉన్నారు. సువేందు అధికారి సీఎం అవుతారన్న ప్రచారం కూడా ఉంది. -
భవానీపూర్‌లో సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓటమి
కోల్‌కతా: భవానీ పూర్లో సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత సువేందు అధికారి విజయం సాధించారు. మమతాపై సువేందు అధికారి 10,994 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఈ సందర్భంగా తన ఓటమిపై మమతా బెనర్జీ స్పందించారు. సర్పేరుతో బీజేపీ ఓట్లు దొంగిలిచ్చింది. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను నిలిపివేశారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ ఏంజెట్లను కొడుతున్నారు. టీఎంసీ ఏంజెట్లలో ఎవరినీ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. పార్టీ ఏజెంట్లను అనుమతి ఇస్తామని డీవో హామీ ఇచ్చారు. పార్టీ ఏజెంట్లు వచ్చిన తర్వాత డీవో ఇక్కడ లేరు అని వాపోయారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండవ సీఎంగా మమతా బెనర్జీ అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఇటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఉన్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించారు. తాజా ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో మమతను ఓడించారు సువేందు అధికారు. దీదీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. -
‘ప్రజాశక్తి విజయం సాధించింది’.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తారా? బీజేపీ టీఎంసీకి చెక్ పెడుతుందా? అనేది తేలిపోనుంది. మొత్తం 294 స్థానాల్లో అధికారం కోసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 148. అయితే ఫాల్తా రీపోలింగ్ నేపథ్యంలో.. ఆ సంఖ్య 293-147గా మారింది.ప్రజాశక్తి విజయం సాధించింది.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ బెంగాల్ ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాంపశ్చిమ బెంగాల్లో కమలం వికసించింది 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ప్రజాశక్తి విజయం సాధించింది బీజేపీ సుపరిపాలన రాజకీయాలు గెలిచాయి పశ్చిమ బెంగాల్ ప్రజల ప్రతి ఒక్కరికీ నేను నమస్కరిస్తున్నాను ప్రజలు బీజేపీకి అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా పార్టీ సాధ్యమైన ప్రతిదీ చేస్తుందని నేను హామీ ఇస్తున్నానుబెంగాల్ ఫలితాలపై స్పందించిన మమత ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ ఓట్లను దొంగిలించింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ హవామెజార్టీ మార్క్ దాటిన కమలంబీజేపీ ఓట్లు దొంగలించింది: మమతా బెనర్జీఎన్నికల ఫలితాలు.. ఆధిక్యంపై స్పందించిన మమతా బెనర్జీటీఎంసీ శ్రేణులకు కీలక సూచనలు ఈ ఫలితాలు చెంది నిరాశ చెందొద్దుమూడు రౌండ్ల కౌంటింగే జరిగిందికౌంటింగ్ నిలిపివేశారు70 స్థానాల్లో కౌంటింగ్‌పై ఈసీ అప్డేట్ ఇవ్వడం లేదుతుది ఫలితాల్లో మనదే విజయంతొందరపడి కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్లొద్దుబీజేపీ ఓట్లు దొంగిలిస్తోందిబెంగాల్లో కమల వికాసంభారీ ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్193 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ97 స్థానాల్లో టీఎంసీకాంగ్రెస్ 1, సీపీఎం 2 స్థానాల్లో ఆధిక్యంబెంగాల్ విజయోత్సవాల్లో మోదీసాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీపశ్చిమ బెంగాల్ సహా అస్సాంలో బీజేపీ క్లీన్‌స్వీప్ పుదుచ్చేరి(కేంద్రపాలిత ప్రాంతం)లో ఎన్డీయే కూటమి ఘన విజయంవిజయోత్సవాల్లో పాల్గొననున్న మోదీ బెంగాల్లో కమల వికాసంతృణమూల్ చేజారిన పశ్చిమ బెంగాల్విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీఇప్పటికే 150+ స్థానాల్లో స్పష్టంగా కొనసాగుతున్న లీడ్125 స్థానాల ఆధిక్యంలో టీఎంసీలెఫ్ట్ పార్టీ ఒక స్థానంలో ఆధిక్యంఇతరులు ఒక స్థానంకాంగ్రెస్ ఆధిక్యం జీరో అనూహ్య విజయ దిశగా బీజేపీబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంముస్లిం ప్రాబల్యం ప్రాంతాల్లో బీజేపీ అధిక్యంముస్లింలో చీలిక ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రాయం.ఈ చీలిక ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్పూర్లో స్పష్టంగా.. దక్షిణ బెంగాల్, కూచ్ బెహర్‌లో మాత్రం టీఎంసీ వైపు మొగ్గునిరాశలో టీఎంసీ శ్రేణులుబెంగాల్ ఎన్నికల్లో ఓటమి దిశగా తృణమూల్ కాంగ్రెస్టీఎంసీ శ్రేణుల్లో తీవ్ర నిరాశబోసిపోతున్న టీఎంసీ కార్యాలయం కాళిఘాట్‌లోని మమత నివాసం వద్ద నిశబ్ద వాతావరణంమెజారిటీ లీడ్‌లో బీజేపీబెంగాల్లో 150 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం133 స్థానాల ఆధిక్యంలో టీఎంసీకాంగ్రెస్, సీపీఎం తలో మూడు చోట్ల లీడ్నాలుగోసారి సీఎం కావాలన్న మమతా బెనర్జీ ఆశలపై బీజేపీ నీళ్లుబెంగాల్లో కాషాయం జెండా రెపరెపలుసంబురాల్లో బీజేపీ శ్రేణులులీడ్లో ఆర్జీకర్ బాధితురాలి తల్లిఆధిక్యంలో రత్నా దేవనాథ్(54)దేశాన్ని కుదిపేసిన ఆర్జీకర్ హత్యాచార ఘటనఈ ఘటన బాధితురాలి తల్లే రత్నా దేవనాథ్ పనిహాతి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీఆధిక్యంలో కొనసాగుతున్న రత్నా దేవనాథ్బెంగాల్లో బీజేపీ ఆధిక్యం142 సీట్లలో లీడ్‌లో బీజేపీ111 సీట్లలో టీఎంసీమూడు చోట్ల కాంగ్రెస్‌కు ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని సీపీఎంబెంగాల్లో టఫ్ ఫైట్హోరాహోరీగా టీఎంసీ, బీజేపీ మధ్య పోరురెండో స్థానంలో కొనసాగుతున్న టీఎంసీమమతా బెనర్జీని దోబూచులాడుతున్న లీడ్కాసేపు దీదీ.. కాసేపు అధికారి సువేందు ఆధిక్యంలో.. భవానీపూర్‌లో రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్బెంగాల్ కౌంటింగ్‌లో మారుతున్న సీన్కొనసాగుతున్న ఈవీఎంల ఓటింగ్టీఎంసీ కంటే ఆధిక్యంలో బీజేపీ107 సీట్లలో టీఎంసీ, 127 స్థానాల్లో బీజేపీ లీడ్నాలుగు చోట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ భవానీపూర్‌లో వెనకంజలో మమతప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్బెంగాల్లో ప్రారంభమైన ఈవీఎంల కౌంటింగ్మరో గంటలో ట్రెండ్స్ మొదలయ్యే చాన్స్ఫలితాలపై అప్పుడే రానున్న స్పష్టతటీఎంసీ శ్రేణుల మౌనంవెలువడుతున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుపోస్టల్లో బీజేపీకి ఆధిక్యంవెలవెలబోతున్న టీఎంసీ ఆఫీస్కాళీఘాట్ మమతా బెనర్జీ నివాసం వద్దా గంభీర వాతావరణం బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్బెంగాల్లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుఆధిక్యంలో బీజేపీ.. 118 స్థానాల్లో లీడ్టీఎంసీ 107రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్ఖాతా తెరవని సీపీఎందీదీ వెనకంజ.. బీజేపీ కామెంట్బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలీడ్లో ఆ పార్టీ అగ్రనేతలువెనకంజలో మమతా బెనర్జీఇవి జనతా వర్సెస్ మమతా ఎన్నికలు :బీజేపీమమతా బెనర్జీపై జనాలకు ఉన్న కోపం విస్పష్టం :బీజేపీఆధిక్యంలో.. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంటీఎంసీ 108బీజేపీ 117కాంగ్రెస్ 5సీపీఎం 0ఇతరులు 0అధిర్ రంజన్ వెనుకంజమూడు దశాబ్దాల తర్వాత స్టేట్ పాలిటిక్స్‌లోకి అధిర్ రంజన్ రీఎంట్రీముర్షీదాబాద్ జిల్లా బరహంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ పోటీపోస్టల్ బ్యాలెట్లో వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్ నేత వెనకంజలో మమతా బెనర్జీదీదీకి పోస్టల్ బ్యాలెట్లో షాక్వెనకంజలో కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రిఅధికారి సువేందు ముందంజఆసక్తికరంగా భవానీపూర్ పోరుఇటు.. నందిగ్రాంలోనూ ఆధిక్యంలో సువేందుఆధిక్యంలోకి సువేందుభవానీపూర్లో ఆసక్తికరంగా పోరుతొలుత మమతా బెనర్జీకి ఆధిక్యంకాసేపటికే లీడ్‌లోకి వచ్చిన బీజేపీ అధికారి సువేందుఆధిక్యంలో కొనసాగుతున్న బీజేపీ అగ్రనేతలు బెంగాల్లో హోరాహోరీపోస్టల్ బ్యాలెట్లో టీఎంసీ ముందంజస్వల్పంగా వెనకబడిన బీజేపీ106 స్థానాల్లో టీఎంసీ, 100 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలీడ్ ఖాతా తెరవని కాంగ్రెస్, లెప్ట్ పార్టీమరికాసేపట్లో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ఆధిక్యంలో మమతా బెనర్జీభవానీపూర్లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంవెనుకబడిపోయిన బీజేపీ రాష్ట్ర చీఫ్ అధికారి సువేందుగత ఎన్నికల్లో ఇక్కడే దీదీని ఓడించిన సువేందుబీజేపీ అగ్రనేతల ముందంజబెంగాల్ ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలుపోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో బీజేపీ అగ్రనేతల ముందంజబీజేపీ శ్రేణుల్లో సంబురాలు! పోస్టల్ బ్యాలెట్లో.. ఆసక్తికరంగా పోస్టల్ బ్యాలెట్టీఎంసీ-బీజేపీ హోరాహోరీమరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈవీఎం ఓట్ల లెక్కింపుమూడంచెల భద్రత నడుమ.. బెంగాల్ వ్యాప్తంగా మొదలైన ఓట్ల కౌంటింగ్ భద్రం కోసం మూడంచెల వ్యవస్థప్రశాంతంగా కౌటింగ్ ప్రారంభమైందన్న సిలిగురి కమిషనర్ సయ్యద్ వాకార్ రజా తనిఖీలు ముమ్మరంగా జరుగున్నాయని.. శాంతియుతంగా కౌంటింగ్ కొనసాగేలా చేస్తామని వ్యాఖ్య #WATCH | Siliguri, West Bengal | On the counting of votes, Siliguri Commissioner of Police (CP) Syed Waqar Raza says, "Everything will be done peacefully. All things are in proper order. Frisking is being done here, and there is a 3-tier security system, and we hope that… pic.twitter.com/4fiRZU0kE8— ANI (@ANI) May 4, 2026 ఆ స్థానంలో ఏం జరగనుందో?బెంగాల్లో హాట్ సీట్‌గా భవానీపూర్మమతా బెనర్జీ వర్సెస్ అధికారి సువేందుగత ఎన్నికల్లో గురువు మమతను ఓడించిన బీజేపీ సువేందుఈసారి తనదే గెలుపని సువేందు ధీమాప్రారంభమైన కౌంటింగ్పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపుమమతా బెనర్జీ సంచలన ఆరోపణలుబెంగాల్ కౌంటింగ్ వేళ మమతా బెనర్జీ సంచలన ఆరోపణలుపలు ప్రాంతాల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీటీవీలు పని చేయడం లేదన్న దీదీస్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు పలు వాహనాలు వచ్చి వెళ్లాయని ఆరోపణఈ చర్యల వెనుక బీజేపీ ఉందని మమతా బెనర్జీ వ్యాఖ్య అప్రమత్తంగా ఉండాలని టీఎంసీ శ్రేణులకు పిలుపుఅనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచనమమత సూచనలతో రాత్రంతా స్ట్రాంగ్ రూమ్‌ల వద్దే పడిగాపులు కాసిన టీఎంసీ శ్రేణులుఅందరి చూపు బెంగాల్ వైపు.. కాసేపట్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంఅందరి చూపు పశ్చిమ బెంగాల్ వైపుటీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాలుగోసారి సీఎం అవుతారా?దీదీ విజయపరంపరకు, ఆధిపత్యానికి బీజేపీ చెక్ పెడుతుందా?ఎస్ఐఆర్(ఓట్ల తొలగింపు ప్రక్రియ) నేపథ్యంలో ఆసక్తికరం కానున్న ఫలితాలుజాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఫలితం కావడంతో ఉత్కంఠకౌంటింగ్ కోసం ఈసీ.. బెంగాల్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఈసీ భారీ ఏర్పాటుభారీగా నమోదైన పోలింగ్ శాతం77 ఓటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్75 వేల మంది భద్రతా సిబ్బందిఫాల్తాలో ఈ నెల 21న రీపోలింగ్.. 24 కౌంటింగ్మిగిలిన 293 స్థానాలకు ఇవాళ జరగనున్న కౌంటింగ్ -
స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకోవడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మే 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్‌రూమ్ వద్ద భారీ భద్రత మోహరించగా, ఓటర్ల తీర్పు ఎవరికి పట్టం కట్టనుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.ప్రశాంతంగా రీ-పోలింగ్.. ఫాల్తాలో మళ్లీ ఎన్నికదక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గాల్లోని 15 కేంద్రాల్లో శనివారం ప్రశాంతంగా రీ-పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 87 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు ఫాల్తా నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ఫలితాలు మే 24న వెలువడనున్నాయి. అంతకుముందు ఫాల్తాలో కొందరు టీఎంసీ కార్యకర్తలు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగడం తీవ్ర కలకలం రేపింది. #WATCH | TMC candidate from Beleghata Assembly, Kunal Ghosh, kept a watch with TMC leaders outside the strongroom at Netaji Indoor Stadium in Kolkata, West Bengal. https://t.co/OWiDOu4xg2 pic.twitter.com/oab2KphAA1— ANI (@ANI) May 2, 2026దీదీ ధీమా.. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిఘాఓట్ల లెక్కింపునకు ముందే టీఎంసీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలుస్తామని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాజ్యసభ ఎంపీ రాజీవ్ కుమార్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించారు. బెలేఘాటా అభ్యర్థి కునాల్ ఘోష్ వంటి నేతలు స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద స్వయంగా పహారా కాస్తూ అప్రమత్తంగా ఉన్నారు.టీఎంసీ ఓటమి ఖాయం: బీజేపీ ధీమాటీఎంసీ నేతలు ఓటమి భయంతో వణికిపోతున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని, ఆమె ముఖంలో భయం కనిపిస్తోందని ఎన్జేపీ నాయకురాలు దేబశ్రీ చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుమారు 90 శాతం రికార్డు స్థాయి పోలింగ్ జరగడం అధికార మార్పునకు స్పష్టమైన సంకేతమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. మే 4 కౌంటింగ్‌కు ముందు తమ అభ్యర్థులంతా దేవాలయాలను సందర్శిస్తారని, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మహిళా కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటారని బీజేపీ ప్రకటించింది.ఇది కూడా చదవండి: బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్ -
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఒకే పార్టీకి పట్టం కట్టడం, సుదీర్ఘకాలం పాటు వారికే అధికారం కట్టబెట్టడం ఇక్కడి ‘బాంగ్లార్ మానుష్’ (బెంగాల్ ప్రజల) నైజం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, వామపక్షాలు, ఆ తర్వాత మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఇక్కడ ఒక్కొక్కటిగా తమ ప్రాభవాన్ని చాటాయి. అయితే, ప్రస్తుత 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక సరికొత్త హై-వోల్టేజ్ పోరుకు తెరలేపాయి. 15 ఏళ్లుగా ఎదురులేని శక్తిగా కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పుడు దూకుడు మీదున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూపంలో అత్యంత క్లిష్టమైన సవాలు ఎదురవుతోంది. ‘బెంగాల్లో టీఎంసీకి సూర్యాస్తమయం ఖాయం’ అన్న బీజేపీ అధిష్టానం మాటల వెనుక ఉన్న కథేంటి? అసలు దశాబ్దాలుగా బెంగాల్ రాజకీయ ప్రస్తానం ఎలా మారుతూ వచ్చిందో ఈ విశ్లేషణలో చూద్దాం.కాంగ్రెస్ శకం: పునాదులు, పోరాటాలుస్వాతంత్య్రానంతరం బెంగాల్ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ బలమైన పునాదులు వేసింది. 1947 దేశ విభజన సంక్షోభం తర్వాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, విచ్ఛిన్నమైన సమాజాన్ని ఒక్కటి చేయడంతో పాటు ఆధునిక బెంగాల్‌కు ఆకృతినిచ్చారు. సాల్ట్ లేక్ సిటీ నిర్మాణం ఆయన దార్శనికతకు నిదర్శనం. అప్పట్లో కలకత్తా కేవలం రాజధాని మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువు. వందేమాతరం గీతాలాపన నుంచి స్వరాజ్య నినాదం వరకు కలకత్తా వేదికగానే జరిగాయి. అయితే, అంతర్గత విభేదాలు, బంగ్లా కాంగ్రెస్ ఆవిర్భావం, నెహ్రూ, శాస్త్రి వంటి జాతీయ దిగ్గజాల మరణంతో కాంగ్రెస్ పట్టు నెమ్మదిగా సడలుతూ వచ్చింది. 1967 ఎన్నికలు కాంగ్రెస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాయి.ఎర్రకోట: వామపక్షాల సుదీర్ఘ ఆధిపత్యంజాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ బలపడుతున్న సమయంలోనే బెంగాల్ భిన్నమైన మార్గం ఎంచుకుంది. 1977లో జ్యోతి బసు నేతృత్వంలోని వామపక్ష కూటమి (లెఫ్ట్ ఫ్రంట్) బలమైన సైద్ధాంతిక పునాదితో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ బర్గా’ ద్వారా కౌలుదారుల హక్కులు పరిరక్షించడం, 1978లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వారు బలమైన ఓటు బ్యాంకును సృష్టించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం (1977-2011) ప్రజాస్వామ్యబద్ధంగా పాలించిన కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా రికార్డు సృష్టించారు. 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రి అయ్యాక పారిశ్రామికీకరణపై దృష్టి పెట్టినా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో పెరిగిన అసంతృప్తి ఒక కొత్త రాజకీయ శక్తికి మార్గం సుగమం చేసింది.మమతా ప్రభంజనం: దశాబ్దాల కంచుకోట బద్దలుసరిగ్గా అప్పుడే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఎగసిన సరికొత్త నాయకురాలు మమతా బెనర్జీ. 2011 ఎన్నికల్లో వామపక్షాల దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించుతూ, తన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీతో 184 స్థానాలు సాధించి సంచలనం సృష్టించారు. బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె చరిత్రకెక్కారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కనపెట్టిన బెంగాల్ ప్రజలు మమతకు బ్రహ్మరథం పట్టారు. కేంద్రంలో వాజ్‌పేయి హయాంలో అధికారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో బెంగాల్లో బీజేపీ పాత్ర నామమాత్రమే. 2016 నాటికి 200లకు పైగా సీట్లతో మమత మరింత బలపడ్డారు. ఆమె సంక్షేమ పథకాలు, ప్రజలతో ఉన్న బలమైన అనుబంధం టీఎంసీని అజేయమైన శక్తిగా మార్చాయి.బీజేపీ ఉప్పెన: బలమైన ప్రతిపక్షంగా..2021 అసెంబ్లీ ఎన్నికలతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ మునుపెన్నడూ లేని స్థాయిలో ప్రచారం నిర్వహించింది. దీదీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, బీజేపీ ఏకంగా 77 స్థానాలు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. కాంగ్రెస్, వామపక్షాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఒకప్పుడు బెంగాల్లో ఉనికి కోసం పోరాడిన బీజేపీ, అధికార టీఎంసీకి ఏకైక ప్రత్యమ్నాయంగా ఎదగడం రాజకీయంగా, వ్యూహాత్మకంగా అతిపెద్ద మలుపు. ఈ పరిణామం దీదీకి భవిష్యత్ సవాళ్లపై స్పష్టమైన సంకేతం ఇచ్చింది.2026 కురుక్షేత్రం: అధికార మార్పిడి తథ్యమా?ప్రస్తుత 2026 ఎన్నికలు టీఎంసీ, బీజేపీ మధ్య ముఖాముఖీ సమరంగా మారాయి. మునుపెన్నడూ లేనివిధంగా భారీ పోలింగ్ నమోదు కావడం ఉత్కంఠ రేపుతోంది. భవానీపూర్ లాంటి టీఎంసీ కంచుకోటల్లో సైతం బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి, ఏ సీటునూ వదిలిపెట్టేది లేదన్న సంకేతాలిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం బీజేపీకి మొగ్గు చూపుతుండటం దీదీకి కలవరపెట్టే అంశమే. 2021లో నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమత, ఈసారి మరింత కఠినమైన పోరును ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా ఒకే పార్టీని సుదీర్ఘకాలం ఆదరించిన బెంగాల్ ప్రజలు.. ఈసారి మార్పు కోరుకుంటూ కొత్త చరిత్ర లిఖిస్తారా లేక దీదీకే మళ్లీ జై కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.ఇది కూడా చదవండి: దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం -
ఈసీ కీలక నిర్ణయం.. బెంగాల్‌లోని ఆ స్థానంలో రీపోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా నియోజక వర్గంలో ఉన్న అన్ని 285 పోలింగ్ స్టేషన్లలో (సహాయక పోలింగ్ స్టేషన్లు కూడా కలిపి) రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఆదేశాలు జారీ చేసింది. 2026 మే 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, ఓట్ల లెక్కింపు మే 24న జరుగుతుందని ఈసీఐ పేర్కొంది.ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నేరాలు, ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీసే చర్యలు చోటుచేసుకున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేశామని ఈసీఐ చెప్పింది. కాగా, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్తా ప్రాంతంలో స్థానికులు నిరసన చేపట్టారు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాము అధికార పార్టీకి ఓటు వేసినా తమపై దాడి జరిగిందని ఓ మహిళ ఆరోపించింది. “మేము టీఎంసీకి ఓటు వేసినా కూడా వారు మాపై దాడి చేశారు. వారిని అరెస్ట్ చేయాలి, మహిళలకు భద్రత కావాలి” అని ఆమె తెలిపింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ ముగిసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. -
దీదీకి షాకిచ్చిన బీజేపీ త్రయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మమతా బెనర్జీ కంచుకోటను బద్దలు కొడుతూ బీజేపీ అనూహ్య ఆధిక్యం దిశగా దూసుకుపోతుండటం వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్. సంస్థాగత నైపుణ్యాలకు మారుపేరైన బన్సాల్.. భూపేంద్ర యాదవ్, బిప్లబ్ దేబ్ వంటి హేమాహేమీలతో కలిసి తన సైలెంట్ ఆపరేషన్‌తో టీఎంసీ అధినేత్రిని ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు చర్చనీయాంశంగా మారింది.క్షేత్రస్థాయిలో ప్రకంపనలు‘భయం వీడండి, నమ్మకం ఉంచండి’ అనే బలమైన నినాదంతో సునీల్ బన్సాల్ బెంగాల్ రణరంగాన్ని సిద్ధం చేశారు. భారీ బహిరంగ సభల కంటే చిన్నపాటి స్ట్రీట్ మీటింగ్స్పైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 12,000 వీధి సభలు నిర్వహించారు. అలాగే, ముఖ్యంగా మహిళలు, ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు లక్షా 65 వేల చిన్న సమావేశాలు ఏర్పాటు చేశారు.ఎమ్మెల్యేలనే టార్గెట్ చేస్తూ..ఈ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యూహంలో భాగంగా ప్రారంభంలో నేరుగా మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోకుండా, టీఎంసీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను వాడుకున్నారు. సుమారు 220 నియోజకవర్గాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్లు విడుదల చేస్తూ 80కి పైగా ప్రెస్ మీట్లు పెట్టారు. అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ వ్యూహాత్మక దాడితో ఏకంగా 77 మంది అభ్యర్థులను మార్చుకోవాల్సిన ఒత్తిడి టీఎంసీపై పడింది. ఆ తర్వాత మొదలైన 10 వేల కిలోమీటర్ల ‘పరివర్తన్ యాత్ర’ బీజేపీకి మరింత ఊపునిచ్చింది.బ్రిగేడ్ సభతో బూస్ట్.. భావోద్వేగాల అస్త్రం‘బ్రిగేడ్ మైదానాన్ని గెలిచిన వారే బెంగాల్‌ను గెలుస్తారు’ అన్న వాదనను నిజం చేస్తూ, ప్రధాని మోదీ సభకు 5 లక్షల మందికి పైగా హాజరుకావడం మమత శిబిరంలో గుబులు రేపింది. ‘మా-మాటి-మానుష్’ పేరుతో జరిగిన అకృత్యాలను గుర్తుచేస్తూ, ఆర్జీ కర్, సందేశ్ ఖాలీ బాధితుల కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా బెంగాలీల సెంటిమెంట్‌ను బీజేపీ బలంగా తాకింది. యువత, మహిళల కోసం ‘యువ కార్డ్’, ‘మాతృశక్తి కార్డ్’ వంటి పథకాలతో నేరుగా వారిని ఆకర్షించారు. మొత్తంగా 640కి పైగా ర్యాలీలతో సునీల్ బన్సాల్ బృందం బెంగాల్‌ను ముట్టడించి, చరిత్ర సృష్టించే దిశగా బలమైన అడుగులు వేసిందని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: 44 జాతీయ పక్షులు మృతి.. కర్ణాటకలో హై అలర్ట్ -
టీఎంసీ-బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతుండగా, టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు, తృణమూల్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లాలోని ఫల్తాలో స్థానికులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఇదిలా ఉంచితే, మధ్యాహ్నం 2 గంటలకు మగ్రాహత్ పశ్చిమ్‌లో 56.33 శాతం, డైమండ్ హార్బర్లో 54.9 శాతం ఓటింగ్ నమోదవ్వగా, మొత్తం పోలింగ్ శాతం 55.57 శాతంగా ఉంది.పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌత్ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీ పోలింగ్ సజావుగా సాగుతోందని స్థానిక ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, సాంకేతిక లోపాలు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టాయి. డైమండ్ హార్బర్లోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ గంటకు పైగా నిలిచిపోయింది. దీనితో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. గత పోలింగ్ రోజున, అలాగే ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సి రావడం వల్ల రెండు రోజుల వేతనం కోల్పోయాను అని నిషా మందా అనే మహిళా ఓటరు ఆవేదన వ్యక్తం చేశారు.ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం పాత పోలింగ్‌ను రద్దు చేసింది. మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రత్యేక ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తులను టేపులతో దాచిపెట్టారనే ఆరోపణలు స్థానిక ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ అబ్జర్వర్ల నివేదిక ఆధారంగా, పకడ్బందీ భద్రతా నడుమ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.రీపోలింగ్ వ్యవహారం అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రీపోలింగ్ నిర్ణయాన్ని బీజేపీ వర్గాలు స్వాగతిస్తూనే, మరింత ఎక్కువ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, వెంటనే అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై, పనితీరుపై తీవ్ర అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎలాంటి కనీస పారదర్శకత లేకుండా, తమ పార్టీ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చెలరేగిన పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. #WATCH | West Bengal Elections | Voters queuing up outside the polling booth at Uttar Yearpur F.P. School in Magrahat Paschim Assembly Constituency in South 24 Parganas district.Re-polling at 11 booths in Magrahat Paschim and four booths in Diamond Harbour for the West Bengal… pic.twitter.com/pBY8NNz7ED— ANI (@ANI) May 2, 2026 -
బెంగాల్లో హోరాహోరి!
న్యూఢిల్లీ: పార్టీల పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా ఒకట్రెండు సంచలన అంచనాలతో హోరెత్తాయి.పశ్చిమ బెంగాల్లో తుది విడత పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఫలితాలను ఆయా సర్వే సంస్థలు ప్రకటించాయి. కీలక రాష్ట్రమైన బెంగాల్లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకి పరాజయం తప్పదని కొన్ని సంస్థలు వెల్లడించగా, ఆమె వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడం తథ్యమని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి. మరో పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో అధికార డీఎంకే కూటమి స్పష్టమైన మెజార్టీతో మళ్లీ జయకేతనం ఎగురవేయనున్నట్లు అత్యధిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మూడో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇక్కడ అన్నాడీఎంకే కూటమి రెండో స్థానంలో నిలుస్తుందని వెల్లడించాయి. అయితే విజయ్ మరో ఎంజీఆర్‌గా అవతరించబోతున్నారని యాక్సిస్ మై ఇండియా సంస్థ ప్రకటించడం గమనార్హం. టీవీకే పార్టీ 35 శాతం ఓట్లతో 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అతిపెద్ద పార్టీగా నిలవబోతోందని ఆ సంస్థ తేల్చిచెప్పింది. అస్సాంలో ఎన్డీయే మరోసారి నెగ్గడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేశాయి. కమ్యూనిస్టుల అడ్డా అయిన కేరళలో ఈసారి వారికి పరాభవం తప్పదని, పినరయి విజయన్ గద్దె దిగబోతున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ ఓడిపోతుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే సూచనలున్నాయని వెల్లడించాయి. కేరళ ప్రజలు మార్పునకు అనుకూలంగా ఓటు వేశారని తెలిపాయి. పుదుచ్చేరిలో ఎన్డీయేకు మళ్లీ స్పష్టమైన విజయావకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. టీఎంసీపై బీజేపీకి స్వల్ప ఆధిక్యం పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌పై బీజేపీ స్పల్ప ఆధిక్యత సాధిస్తుందని మాట్రిజ్, పి–మార్క్ ఫలితాలు తెలియజేశాయి. టీఎంసీకి 125–140 స్థానాలు వస్తాయని, బీజేపీకి 146–161 స్థానాలు లభిస్తాయని మాట్రిజ్ వెల్లడించింది. పి–మార్క్ అంచనా ప్రకారం బీజేపీకి 150–174 సీట్లు, టీఎంసీకి 118–138 సీట్లు లభిస్తాయి. బీజేపీకి 142–171, టీఎంసీకి 99–127 సీట్లు లభించేందుకు ఆస్కారం ఉన్నట్లు ‘పోల్ డైరీ’ఎగ్జిట్ పోల్ తేల్చింది. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వాస్తవమైన ఫలితాలను అంచనా వేయడంలో అవి విఫలమయ్యాయి. -
బెంగాల్ పోలింగ్: టేపుతో ఈవీఎంల ట్యాంపరింగ్?
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ.. అధికార, ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలకు దిగాయి. కేంద్ర బలగాల సాయంతో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదుల్లా వ్యవహరిస్తున్నారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే ఓడిపోతున్నాననే భయంతో ఆమె అలా మాట్లాడుతున్నారని.. రౌడీయిజంతో ఆ పార్టీనే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగానే..పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలపై గుర్తులకు టేప్ అంటించి ఉండడం కలకలం రేపింది. పలు నియోజకవర్గాల్లో అధికార పక్షం తమ కమలం గుర్తును దాచేసి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. సౌత్ 24 పరగణాలోని పోలింగ్ బూత్‌ల్లో.. అదీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పట్టున చోట ఇది ఎక్కువగా జరిగిందని అంటోంది.ఇంతకాలంగా మమతా బెనర్జీని రక్షిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా? అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. అభిషేక్ బెనర్జీ కూడా ఈ మోడల్‌తోనే లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గారా? అంటూ బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవీయా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఫల్తా నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో బీజేపీ గుర్తు ఉన్న బటన్‌ను టేప్‌తో కప్పి, ఓటర్లు ఓటు వేయకుండా అడ్డుకున్నారు. ఈ విధానాన్ని వారు “డైమండ్ హార్బర్ మోడల్” అని పిలుస్తున్నారు. ఇది మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గతంలో గెలుపు కోసం ఉపయోగించిన టెంప్లేట్ అయి ఉండొచ్చు. మమతా బెనర్జీ తన క్రిమినల్ కేసులున్న టీఎంసీ అభ్యర్థి జెహంగీర్ ఖాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ మోడల్‌ను రక్షిస్తున్నారు అని మాలవీయా విమర్శించారాయన. అదే సమయంలో పలు చోట్ల తమ గుర్తును కూడా టేపుతో దాచేశారని సీపీఎం ఆరోపిస్తోంది. ఈ సంచలన ఆరోపణల నడుమ.. ఆ వీడియో వైరల్ అవుతోంది.అయితే టీఎంసీ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. బీజేపీ తప్పుడు ప్రచారానికి దిగిందని అంటోంది. మాలవీయా సోషల్ మీడియాలో పోస్టులు చేసే బదులు తమ బాసుల దృష్టికి విషయం తీసుకెళ్తే సరిపోతుంది కదా.. అప్పుడు వాళ్లు ఈసీని ప్రయోగించి చేయాల్సింది చేస్తారు అని ఎద్దేవా చేస్తోంది. మరోవైపు.. ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దర్యాప్తులో వాస్తవమని తేలితే రీపోలింగ్ అంశం పరిశీలిస్తామని చెబుతోంది. This is what Mamata Banerjee was defending when she spoke up for Jehangir Khan, a criminal contesting on a TMC ticket from Falta in Diamond Harbour.In several polling booths, the option to vote for the BJP has been blocked using a tape, effectively preventing voters from… pic.twitter.com/sKw3mcdA86— Amit Malviya (@amitmalviya) April 29, 2026 -
బెంగాల్ పోలింగ్: ఐదు గంటలకే 90 శాతం దాటిన పోలింగ్
పశ్చిమ బెంగాల్ రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. -
మలి యుద్ధం నేడే
కోల్‌కతా: దశాబ్దన్నరకాలంగా పశ్చిమబెంగాల్ రాజకీయాలను శాసిస్తూ అధికారపీఠంపై కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించే లక్ష్యంతో కమలనాథులు చేసిన విస్తృతప్రచారం, ప్రజాకర్షక పథకాలతో బెంగాళీలను మెప్పించానని చెబుతూ ప్రచారంచేసిన దీదీ మాటలు ఓట్లరూపంలో ఏమేరకు సఫలీకృతమవుతుందనేది నేటితో తేలిపోనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన 142 నియోజకవర్గాల్లో నేడు జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన తొలిదఫా పోలింగ్‌లో భారీ ఓటింగ్ నమోదుకావడంతో ఇది ప్రభుత్వవ్యతిరేక సరళి అని ఢంకా భజాయించిన బీజేపీ నేతలు అదేఊపుతో దక్షిణ ప్రాంత జిల్లాల్లోనూ విస్తృత ప్రచారంచేశారు.అయితే అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటలైన కోల్‌కతా, హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, నదియా, హుగ్లీ, పూర్బా బర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ ఆధిపత్యం సాధించాల్సి ఉంది. నేడు పోలింగ్ జరగనున్న 142 స్థానాల్లో గతంలో టీఎంసీ హవా కొనసాగింది. 2021 శాసనసభ ఎన్నికల్లో ఈ 142లో 123 చోట్ల టీఎంసీ గెలవగా 18 చోట్ల బీజేపీ, ఒక స్థానంలో ఐఎస్ఎఫ్ గెలిచాయి. గత ఐదేళ్లుగా ఈ 142 స్థానాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో బాగా వేళ్లూనుకుంది. అయినాసరే ఈసారి కూడా ఉత్తర 24 పరగణాలు(33 సీట్లు), దక్షిణ 24 పరగణాలు(31 సీట్లు), హౌరా(16), నదియా(17), హుగ్లీ(18), పూర్బా బర్ధమాన్(16), కోల్‌కతా(11 సీట్లు) ఈదఫా ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారాయి.నేడు జరగబోయే ఎన్నికల్లో మొత్తంగా 3,21,73,837 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,64,35,627 మంది పురుషులుకాగా 1,57,37,418 మంది స్త్రీలు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. మొత్తంగా 41,001 పోలింగ్స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 142 మంది సాధారణ పర్యవేక్షకులు, 95 మంది పోలీస్ పర్యవేక్షకులు, 100 మంది ప్రత్యేక పర్యవేక్షకులు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన మథువా హిందూ శరణార్థులు, పౌరసత్వ సవరణ చట్టం, ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటం వంటివి బీజేపీకి ఈదఫా సానుకూల అంశాలుగా కన్పిస్తున్నాయి. పదేళ్లు పాలించిన 2021లో మమతను మళ్లీ బెంగాళీలు గెలిపించడం తమ పార్టీకి ఇంకా అత్యంత ప్రజాదరణ ఉందని టీఎంసీ ప్రకటించింది. అదేఊపుతో నాలుగోసారి నెగ్గుకురాగలమనే ధీమా పార్టీలో ఎక్కువైంది. అయితే కట్ మనీ, బొగ్గు కుంభకోణం, పథకాల్లో అవినీతి, టీఎంసీ గూండాయిజం, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి ముస్లింల చొరబాట్లు, ఖాళీ ప్రాంతాల ఆక్రమణల అంశాలు ఈసారి టీఎంసీకి వ్యతిరేకతను పెంచేలా కన్పిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు కీలక జిల్లాల్లో చాలా ప్రచారసభల్లో పాల్గొని భారీ స్థాయిలో హామీల వర్షం కురిపించారు. మమతా బెనర్జీ సైతం టీఎంసీ తరఫున సుడిగాలి పర్యటనలు చేసి మరోమారు తన పార్టీని ఆశీర్వదించాలని ఓటరు మహాశయులను వేడుకున్నారు. ఎక్కడా అవాంఛనీయఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నడూలేనంతటి భారీ సంఖ్యలో కేంద్రరిజర్వ్ బలగాలను పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మోహరించింది.తొలి దశ ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్ నమోదవడంతో రెండోది, చివరిదైన ఈ దఫాలో ఎంతటి పోలింగ్ నమోదవుతుందనేది ఆసక్తికరంగా మారింది. కంచుకోట భవానీపూర్ నుంచి మమతాబెనర్జీ పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ అగ్రనేత సువేంధు అధికారి నిలబడ్డారు. బెంగాళీలు, గుజరాతీలు, మార్వాడీలు, జైనులు, సిక్కులు, ముస్లింలు, బిహార్, జార్ఖండ్ శరణార్థులతో నిండిన భవానీపూర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మరింత ఎక్కువైంది. -
‘గంగ’ చుట్టూ బెంగాల్ రాజకీయం..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రెండో దశ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న వేళ పవిత్ర గంగా నది చుట్టూ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కాలుష్యమయంగా మారిన గంగా నది శుద్ధి, పరీవాహక ప్రాంత ప్రజల జీవనోపాధి, మత్స్యకారుల సమస్యలు, పెరుగుతున్న భూక్షయం వంటి అంశాలు పార్టీలకు రాజకీయ అ్రస్తాలుగా మారుతున్నాయి.బెంగాల్లో ముఖ్యమైన నది అయిన గంగ ఉత్తర నుండి దక్షిణం వరకు సుమారు 520 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 7 జిల్లాల్లోని సుమారు 90 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నది ప్రవహిస్తోంది. తీర ప్రాంతాల్లో 2.80 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నట్లు అంచనా. రెండో దశలో ఎన్నికలు జరుగనున్న ముర్షిదాబాద్, నాదియా, మాల్దా, హౌరా, ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు వంటి జిల్లాల్లో గంగా నది ప్రక్షాళన అంశమే ప్రచారాస్త్రంగా మారింది. తృణమూల్‌దే హవా ప్రతి ఏటా వర్షాకాలంలో గంగా నదికి భారీ వస్తోంది. తీర ప్రాంతాల్లో 8,000–10,000 హెక్టార్ల భూమి కోతకు గురై భూక్షయానికి కారణమవుతోంది. ముర్షిదాబాద్, మాల్డా జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. పంటలు, ఇళ్లు నష్టపోతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. అధిక వర్షాల సమయంలో మత్స్యకారుల జీవనోపాధికి భరోసా లేకుండా పోతోంది. దీనికి తోడు పరీవాహక ప్రాంతాల్లో కాలుష్యం వల్ల తాగునీటి ఇక్కట్లు పెరుగుతున్నాయి.అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, గంగా నదిని పరిశుభ్రంగా మారుస్తామని ప్రధాన పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గంగా పరీవాహక ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది. 2016, 2021 ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా 80 శాతానికి పైగా సీట్లు గెల్చుకుంది. 2026 ఎన్నికల్లోనూ తమకు తిరుగులేదని తృణమూల్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ తన పట్టు పెంచుకొనేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గంగా నదిపై ఆధారపడిన ఓటర్ల మనసులు గెల్చుకుంటే విజయం తథ్యమని ప్రధాన పార్టీలు నిర్ణయానికొచ్చాయి. ఆ దిశగానే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. పోటాపోటీ విమర్శలుగంగా నది చుట్టూ పెనవేసుకున్న సమస్యల పరిష్కారం కోసం తీర రక్షణ గోడల నిర్మాణం, వరద నియంత్రణ ప్రాజెక్టులు, మత్స్యకారులకు ఆర్థిక సాయం, గంగా శుద్ధి ప్రణాళికలు వంటివి ప్రతిసారీ రాజకీయ హామీలుగా తెరపైకి వస్తున్నాయి. గంగా నది వరద నియంత్రణకు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేశామని, మరో రూ.100 కోట్లు మంజూరు చేశామని ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. వరద ప్రభావిత కుటుంబాలకు రూ.1,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు తెలిపారు. గంగా నది శుద్ధికి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న మాదిరిగా బెంగాల్‌కు నిధులు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయినప్పటికీ నది ప్రక్షాళనకు రాష్ట్ర నిధులు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.ప్రధాని నరేంద్ర మోదీపై సైతం ఎన్నికల ప్రచారంలో గంగా నదిపై దృష్టి పెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ‘‘బీహార్ తర్వాత గంగా నది పశ్చిమ బెంగాల్‌ను శుభ్రం చేస్తుంది’’అని వ్యాఖ్యానించారు. బీహార్‌లో పాగా వేశామని, ఇకపై బెంగాలో జెండా ఎగురవేయబోతున్నామని పరోక్షంగా తేల్చిచెప్పారు. నమామి గంగే కార్యక్రమం ద్వారా గంగా శుద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సరైన విధంగా సహకరించడం లేదని, అందుకే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.నది ప్రక్షాళన కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బెంగాల్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే స్వచ్ఛమైన నది సాకారమవుతుందని ఎన్నికల ప్రచారంలో తేల్చి చెబుతున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ఆయన గంగా నదిలో పడవపై విహరించారు. ఈ విహారాన్ని సైతం సీఎం మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రధానమంత్రి ఢిల్లీలోని యమునా నదికి వెళ్లి స్నానం చేస్తారా? అక్కడ నదిలో ప్రయాణించే సాహసం చేయగలరా? అని సవాల్ విసిరారు. మొత్తానికి గంగా నది వ్యవహారం అధికార, విపక్షాలకు ప్రచార ఆయుధంగా మారిపోయింది. -
మోదీజీ.. యమునలో స్నానం చేయండి: మమత సవాల్
కోల్కత్తా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం.. గంగా, హుగ్లీ నది గురించి మాట్లాడటంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గంగానది శుభ్రంగా ఉందని, యమునా మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. “ఢిల్లీ యమునాలో ఒకసారి స్నానం చేసి చూపించండి. అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునాను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగానది మీద ఫోటోలు దిగడానికి వస్తారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో ప్రధానమంత్రి పర్యటనను మమతా బెనర్జీ స్వాగతించారు. కానీ నదిని శుభ్రపరచడానికి మరియు దాని నదీ తీరాన్ని సుందరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టడానికే ఆయన పడవ ప్రయాణం చేశారని ఆమె ఆరోపించారు. కానీ, బెంగాలీలు అంత అమాయకులు కాదంటూ వ్యాఖ్యానించారు.హూగ్లీలో మోదీ పడవ షికారు.. ఇక, అంతకుముందు ప్రధాని మోదీ.. హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్ర నదీజలాలు వెంట తీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్‌కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. -
పోలింగ్ బూత్ వద్ద పేలుడు.. ప్రాణభయంతో పరుగులు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ తొలి విడత ఎన్నికల పోలింగ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఉత్సాహంగా సాగుతున్న ప్రజాస్వామ్య పండుగలో కలకలం చోటుచేసుకుంది. ముర్షిదాబాద్ జిల్లాలోని నవ్దా ప్రాంతంలో ఓటర్లు బారులు తీరిన సమయంలో దుండగులు నాటు బాంబులతో విరుచుకుపడటం ఆందోళనకు దారితీసింది.బాంబుల దాడిగురువారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, నవ్‌దాలోని ఓటింగ్ కేంద్రం సమీపంలో ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ హఠాత్పరిణామంతో ఓటర్లు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పోలింగ్ ప్రక్రియకు ఒక్కసారిగా తీవ్ర ఆటంకం ఏర్పడింది. VIDEO | West Bengal Election 2026: Several people injured as unidentified people hurled crude bomb in Nowda, Murshidabad district. More details are awaited.#AssemblyPollsWithPTI#WestBengalPollsWithPTI(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/W7G5A9OqR6— Press Trust of India (@PTI_News) April 23, 2026#WATCH | Murshidabad, West Bengal: ASP Majid Khan, says, "The situation is peaceful. Nothing has happened anywhere..." https://t.co/EnfCtiAmLd pic.twitter.com/8tA8M18anU— ANI (@ANI) April 23, 2026రంగంలోకి భద్రతా దళాలుఈ ఘటనలో పలువురు గాయపడగా, వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి సంఖ్య, తీవ్రతపై అధికారులు ఇంకా వెల్లడించలేదు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎక్కడా ఏమీ జరగలేదని ముర్షిదాబాద్ ఏఎస్పీ మజిద్ ఖాన్ విలేకరులతో పేర్కొనడం గమనార్హం. 152 స్థానాలు.. ఉత్కంఠ పోరుతొలి విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది సుమారు 3.22 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికార పీఠం దక్కించుకుంటారా? లేదా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనేది ఈ రెండు విడతల ఎన్నికల్లో తేలనుంది. -
బెంగాల్లో నేడు తొలి దశ పోలింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు తొలి దశ పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని మొత్తం 294 స్థానాలకు గాను 152 సీట్లకు ఎన్నిక జరగనుంది. ఉత్తర బెంగాల్‌లోని 8 జిల్లాలతోపాటు ముర్షిదాబాద్, హుగ్లీ, నడియా, బిర్భూమ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 54 సీట్లు బీజేపీకి కీలకంగా మారాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పోలింగ్‌లో 3.60 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 167 మంది మహిళలు సహా మొత్తం 1,478 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన 8 వేలకు పైగా పోలింగ్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈసీ రికార్డు స్థాయిలో 2,450 కంపెనీల బలగాలను మోహరించింది. వీరితోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. ప్రభావం చూపే కీలకాంశాలివే.. అవినీతి, నిరుద్యోగం వంటి కీలక అంశాల కంటే ఈసారి సామాజిక గుర్తింపు, పౌరసత్వం, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగిన విభిన్న పరిస్థితులు నెలకొన్న వేళ ఈ జిల్లాల్లో సాధించే ఆధిక్యాన్ని బట్టే బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రతిపక్షంగా ఎదిగేందుకు ఉత్తర బెంగాల్లో సాధించిన ఫలితాలే కీలకంగా మారాయి. ఇదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశలో ఈ ప్రాంతంలో ఉన్న 152 సీట్లకుగాను బీజేపీ 59 చోట్ల విజయం సాధించగా, అధికార టీఎంసీ 93 సీట్లు దక్కించుకుంది. ఉత్తరబెంగాల్‌లో బీజేపీ ప్రభావాన్ని అడ్డుకోవడం అధికార పక్షానికి కూడా చాలా కీలకం. ఎందుకంటే, ఇది రెండో దశతోపాటు రాష్ట్రంలో మొత్తం రాజకీయ వాతావరణంపైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రాంతాలేవైనా సర్ ఒక్కటే.. ఉత్తర బెంగాల్లో తేయాకు తోటలున్న జల్పాయ్గురి అలీపూర్‌దువార్, కొండప్రాంతాలైన డార్జిలింగ్, కాలింపాంగ్, రాజ్బన్షీలున్న కూచ్ బెహార్ ఉన్నాయి. సరిహద్దుల్లోని మల్దా, ఉత్తర దినాజ్‌పూర్, మైనారిటీల ప్రాబల్యమున్న ముర్షిదాబాద్, నడియాలున్నాయి. ఎన్ని తేడాలున్నప్పటికీ, ప్రతి జిల్లాలోనూ ఓటింగ్ సరళిని ప్రభావితం చేయనున్న ఏకైక అంశం ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) అనే చెప్పుకోవాలి. రాష్ట్రంలో సర్ కారణంగా 91 లక్షలకు పైగా పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ఇవి సుమారు 12 శాతం. ఒక్క ముర్షిదాబాద్ జిల్లాలోనే 7.48 లక్షల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తర్వాత, నడియాలో 4.85 లక్షలు, మాల్దాలో 4.59 లక్షలు, ఉత్తర్ దినాజ్పూర్లో 3.63 లక్షలు, కూచ్ బెహార్లో 2.42లక్షలకు పైగా ఓట్లను పక్కనబెట్టారు. దీంతో, ఎన్నికల్లో ప్రచారాంశాలే ఏకంగా మారిపోయాయి. అవినీతి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు అప్రాధాన్యాంశాలు కాగా, పౌరసత్వం, చొరబాట్లు, బోగస్ ఓట్లు, తొలగింపునకు గురైన ఓటర్లు, విదేశీయులు వంటివాటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. చొరబాట్లు, పౌరసత్వం అంశాలకు సర్‌ను రెఫరెండంగా బీజేపీ అభివర్ణించగా, నిజమైన ఓటర్లను ముఖ్యంగా మైనారిటీలు, వలస కార్మికులు, పేదల పేర్లను తొలగించారంటూ టీఎంసీ ప్రచారం చేసుకుంది. బరిలో పలువురు ప్రముఖులు మొదటి దశ బరిలో పలువురు ప్రముఖ నేతలున్నారు. ముఖ్యంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఒకరు. 2021 ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీని ఆయన ఇక్కడ ఓడించారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయాలు ఈయన చుట్టూతా నడుస్తున్నాయి. ఈసారి ఇక్కడ సువేందుకు నమ్మినబంటుగా ఉన్న పబిత్రా కర్ టీఎంసీ తరఫున బరిలో ఉన్నారు. అదేవిధంగా, బహరంపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత ఆధిర్ రంజన్ చౌదరి, బీజేపీ ఎమ్మెల్యే సుబ్రతా మైత్రా పోటీ పడుతున్నారు. మాతాభంగలో కేంద్ర మాజీ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పోటీ చేస్తున్నారు. ఖరగ్‌పూర్ సదర్‌లో రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, టీఎంసీకి చెందిన ప్రదీప్ సర్కార్ తలపడుతున్నారు.నన్ను భయపెట్టాలని చూస్తున్నారు: మమతఆమ్డాంగా(పశ్చిమ బెంగాల్): పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ భారీ సంఖ్యలో శాంతి భద్రతల కోసమంటూ సాయుధ బలగాలను మోహరించడంతోపాటు సీఆర్పీఎఫ్ వాహనాలను రంగంలోకి దించడంపై సీఎం మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలాదిగా బలగాలను తరలించి కేంద్రం తనను భయపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. సీఎం మమత బుధవారం ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్లతోపాట రైల్వే బలగాలను కూడా కేంద్రం ఇక్కడ ఎన్నికల కోసం తీసుకువచి్చంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగ మాత్రమే, ఎవరినీ చంపడానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల కోసం బెంగాల్‌కు మునుపెన్నడూ లేని విధంగా సుమారు రెండు లక్షల కేంద్ర బలగాలను తీసుకువచ్చారు. ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరించి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?’అంటూ కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. -
‘మమత చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టాయి’
న్యూఢిల్లీ: కేంద్ర సంస్థ దర్యాప్తు జరుపుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోకి వెళ్లడం సరైంది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో గురువారం (ఏప్రిల్ 23)న మొదటి దశ పోలింగ్ జరగాల్సి ఉండగా, బుధవారం కోర్టు నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.జనవరిలో మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ అధికారులు కొందరు కలిసి తమ దర్యాప్తు, సోదాల్లో జోక్యం చేసుకున్నారని ఈడీ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది."ఇది రాష్ట్రం-కేంద్రం మధ్య వివాదం కాదు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు మధ్యలోకి వెళ్లి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. దీన్ని రాష్ట్ర -కేంద్ర వివాదంగా మార్చవద్దు అని చెప్పలేరు" అని సుప్రీంకోర్టు తెలిపింది.ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. మమతా బెనర్జీ రాష్ట్ర అధికారులతో కలిసి ఐ-ప్యాక్ కార్యాలయం, దాని స్థాపకుడు ప్రతిక్ జైన్ నివాసంలోకి వెళ్లి, ఈడీ దర్యాప్తు జరుగుతుండగా ల్యాప్‌టాప్, ఫోన్, పత్రాలు తీసుకెళ్లారు.అందుకే, "ఇది ఒక వ్యక్తి చేసిన చర్య అయినా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది" అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈడీ దాడులు రాజకీయ ఉద్దేశంతో జరిగాయని, ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌ను బలహీనపరచే ప్రయత్నం చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాదించింది. -
పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
-
బెంగాల్లో మళ్లీ అదే రిపీట్ అవుద్ది: మోదీ
హాల్దియా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్లో మార్పుల రాబోతుందని చెప్పారు. మోదీ గురువారం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈ సారి భవానీపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు."రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను ఓడించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయించారు. అని నేను చూశాను. ఈ ఉత్సాహం, ఉత్తేజంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. ఇది మార్పును తీసుకువచ్చే తుపాను. ఇది టీఎంసీ సర్కారుకు వీడ్కోలు. ఐదు సంవత్సరాల క్రితం మేదినిపూర్, నందిగ్రామ్ మార్పునకు మార్గాన్ని చూపాయి. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే దారిలో నడవడం ప్రారంభించింది.ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించింది. బెంగాల్లో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. బెంగాల్‌ను అభివృద్ధి వైపుగా తీసుకెళ్లడానికి పునాదిని శక్తిమంతంగా వేసే ఎన్నికలు ఇవి. టీఎంసీ సర్కారును గద్దె దించడం అవసరం. ఇప్పుడు భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో వృద్ధి వేగవంతంగా ఉందంటే అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. కానీ దేశం ముందుకు వెళ్తుండగా, టీఎంసీ సర్కార్ బెంగాల్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.చొరబాటుదారుల పరిశ్రమలు పెరిగాయి.. ఒకప్పుడు భారత పురోగతికి పునాది వేసిన తయారీ, వాణిజ్యాన్ని బలపరిచిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని అభివృద్ధి సూచికల్లో దిగజార్చిందని మోదీ చెప్పారు. ‘ఈ పరిస్థితి మేదినిపూర్, హాల్దియా ప్రజల కంటే ఎవరికి బాగా ఎవరు తెలుసు? శతాబ్దాల క్రితమే చారిత్రక తమ్రలిప్త (Tamralipta Kingdom)తో వాణిజ్యం జరిగిన పోర్ట్ నగరం. హాల్దియా ఆధునిక భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. కానీ ఇటీవల దశాబ్దాల్లో హాల్దియాలో కర్మాగారాలు మూతపడ్డాయి. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు హాల్దియాకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి యువత ఉద్యోగాల కోసం అండమాన్, ఒడిశాకు వలస వెళ్తున్నారు. టీఎంసీ సర్కార్‌లో చొరబాటుదారుల పరిశ్రమలు మాత్రమే పెరిగాయి. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువుల అక్రమ రవాణా వంటి రంగాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
భయానికి, భరోసాకు పోరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘మహా జంగిల్‌రాజ్’ను నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ సృష్టించిన భయానికి, బీజేపీ ఇస్తున్న భరోసాకు మధ్య జరుగుతున్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులపై అల్లరి మూకలు దౌర్జన్యానికి దిగి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. చొరబాటుదార్లను ఇక్కడి పాలకులు ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ప్రోద్బలంతోనే పొరుగుదేశం నుంచి జనం అక్రమంగా వలస వస్తున్నారని, దాంతో స్థానికంగాజనాభా నిష్పత్తిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటుదార్ల వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. జ్యుడీషియల్ అధికారులకు కూడా రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను కాపాడుతుందన్న విశ్వాసం లేదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మహా జంగిల్‌రాజ్‌కు మాల్డా ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. బెంగాల్లో శాంతి భద్రతలకు అంత్యక్రియలు నిర్వహించడానికి అధికార పార్టీ కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. గూండాల బెదిరింపులను లెక్కచేయొద్దు కట్‌మనీ, అవినీతికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని, అభివృద్ధి చేసి చూపించే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలను కచ్చితంగా అడ్డుకుంటామని, చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న జనాభా నిష్పత్తి కారణంగా సొంత గడ్డపై స్వేచ్ఛను కోల్పోతామనే భయం ప్రజల్లో ఉందన్నారు. ప్రజలు సొంత గడ్డపై గర్వంగా తల ఎత్తుకొని జీవించే పరిస్థితి తీసుకొస్తామని వెల్లడించారు. చొరబాటుదార్లను కాపాడేందుకే ఎస్ఐఆర్, సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందూ శరణార్థులకు భారతదేశ పౌరసత్వం దక్కడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగా బెంగాల్ గుర్తింపునకు ముప్పు ఏర్పడిందన్నారు. బెంగాల్ అస్తిత్వాన్ని పణంగా పెట్టిన పార్టీలకు ఈసారి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. పోలింగ్ రోజు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఎన్ని బెదిరింపులకు దిగితే లెక్కచేయొద్దని ప్రజలకు మోదీ సూచించారు. చట్టంపై విశ్వాసంతో పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్నికల సంఘంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. మే 4వ తేదీ తర్వాత చట్టం తన పని తాను చేస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అరాచకాలపై తప్పనిసరిగా దర్యాప్తు జరిపిస్తామని పునరుద్ఘాటించారు. దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బెంగాల్ మహిళలకు భద్రత, గౌరవం, సాధికారత కల్పిస్తామని, ఇది తన గ్యారంటీ అంటూ స్పష్టంచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన లఖ్పతి దీదీ పథకం గురించి ప్రస్తావించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పెంపులో ఎలాంటి అన్యాయం జరగదని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం, హక్కులకు కచ్చితంగా రక్షణ ఉంటుందన్నారు. -
దర్యాప్తు పేరుతో స్థానికులకు వేధింపులు: మమత ఆరోపణలు
మాల్దా: న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనకు బాధ్యులైన నేరగాళ్లు తప్పించుకుపోగా, దర్యాప్తు అధికారులు అమాయకులైన స్థానికులను వేధిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. మాల్దా జిల్లా మోతాబరిలో బుధవారం రాత్రి న్యాయాధికారులను గంటలపాటు నిర్బంధించిన ఘటనపై ఎన్ఐఐ దర్యాప్తు చేపట్టడం తెల్సిందే.శనివారం సీఎం మమత మాల్దాలోని మానిక్చక్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్), ఎంఐఎంలనుద్దేశించి పరోక్షంగా ఆమె.. ‘జడ్జీలను ఘెరావ్ చేసిన ఆ రెండు మత పార్టీల వాళ్లు తప్పించుకుపోయారు. ఎన్ఐఏ అధికారులు విచారణ పేరుతో స్థానికులను వేధిస్తున్నారు. సుమారు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు’అని ఆరోపించారు. సర్‌లో పేర్ల తొలగింపునకు గురైన వారు న్యాయాధికారుల దగ్గరికి వెళ్లవద్దని, ఓటరు జాబితాలో తిరిగి తమ పేర్లను చేర్చాలంటూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోయిన వారిని చేతులెత్తాలని ఆమె కోరగా సభలో పాల్గొన్న చాలా మంది స్పందించడంపై విస్మయం వ్యక్తం చేశారు. ‘ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని ట్రిబ్యునళ్ల వద్దకు వెళ్లేలా చేయడమే మా కర్తవ్యం’అని అన్నారు. -
2014 నుంచి వాళ్లంతా మార్పును చూశారు: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు. భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్‌లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు. గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది. -
మహువా వ్యాఖ్యల కలకలం.. రంగంలోకి మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. తన వాగ్ధాటితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ఎంపీ మహువా మోయిత్రా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీని ఇరకాటంలో పడేశాయి. గుజరాతీ సమాజంపై ఆమె చేసిన విమర్శలు వివాదాస్పదం కావడంతో, స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి క్షమాపణలు కోరాల్సి వచ్చింది.అసలేం జరిగింది?మూడు రోజుల క్రితం తృణమూల్ భవన్లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మహువా మోయిత్రా స్వాతంత్ర్య పోరాటంలో బెంగాలీల పాత్రను ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మీరు కాలాపానీ (అండమాన్ సెల్యులార్ జైలు)కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరి పేర్లు కనిపిస్తాయి? అక్కడ ఎంతమంది గుజరాతీలు ఉన్నారు? జైలు శిక్ష అనుభవించిన వారిలో 68 శాతం మంది బెంగాలీలే.. ఆ తర్వాత పంజాబీలు ఉంటారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.భవానీపూర్‌లో సెగ.. దీదీ క్షమాపణలుమహువా చేసిన ఈ వ్యాఖ్యలపై భవానీపూర్లోని గుజరాతీ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో గుజరాతీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దీంతో అప్రమత్తమైన టీఎంసీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వార్డు నంబర్ 70 కౌన్సిలర్ అసిమ్ బసు ద్వారా మమతా బెనర్జీ ఒక బహిరంగ క్షమాపణ లేఖను విడుదల చేశారు. ‘నా గుజరాతీ సోదర సోదరీమణులకు నేను వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నాను. మీ పట్ల నాకు ఎంతో గర్వం ఉంది. సంబంధిత ఎంపీ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవి అత్యంత బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు. మేము వాటిని సమర్థించం’ అని మమత తన సందేశంలో పేర్కొన్నారు.పార్టీ అనుమతి లేని వ్యాఖ్యలుఎంపీ మహువా మోయిత్రా పార్టీ అనుమతి లేకుండానే ఈ వ్యాఖ్యలు చేశారని కౌన్సిలర్ అసిమ్ బసు తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌ను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ప్రత్యేకంగా గుజరాతీ భాషలోనూ విడుదల చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో ఈ వార్డులో టీఎంసీ వెనుకబడి ఉండటంతో, ప్రస్తుతం ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’ -
Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?
పశ్చిమ బెంగాల్ అనగానే అందరికీ అక్కడి కళలు, సాహిత్యం.. అంతకు మించి ఘుమఘుమలాడే చేపల పులుసు గుర్తుకువస్తాయి. అయితే ఇప్పుడు అదే చేప రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. అభివృద్ధి, నిరుద్యోగం వంటి అంశాలను పక్కనబెట్టి, ఓటర్ల కంచంలో ఉండే ‘చేప ముక్క’ చుట్టూ ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తోంది. బెంగాలీయుల ప్రాణప్రదమైన ఆహారపు అలవాట్లను అస్త్రంగా చేసుకుని సాగుతున్న ఈ ‘ఫిష్ పాలిటిక్స్’ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.చేపతో బీజేపీ ప్రచారం.. షాకైన ఓటర్లుబీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమలం పార్టీ నేతలు వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ శరద్వత్ ముఖర్జీ ఏకంగా 5 కిలోల బరువున్న 'కట్ల' చేపను చేత్తో పట్టుకుని వీధుల్లో ప్రచారం నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘మేము చేపలకు వ్యతిరేకం కాదు.. మా సంస్కృతిలో భాగం’ అంటూ ఓటర్లకు భరోసా ఇచ్చేందుకే ఈ ఫీట్ చేశానని ఆయన చెబుతున్నారు.దీదీ ఘాటు విమర్శలు: ‘మీ కంచంపై కన్నేస్తారు’ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రసంగాల్లో బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ‘వారు మీ పళ్లెంలో చేపను ఉండనివ్వరు, గుడ్లను తాకనివ్వరు. చివరికి మీరు బెంగాలీ మాట్లాడితే బంగ్లాదేశీయులని ముద్ర వేస్తారు’ అంటూ భావోద్వేగపూరిత విమర్శలు చేస్తున్నారు. బెంగాలీ అస్తిత్వాన్ని, ఆహారపు అలవాట్లను కాపాడుకోవాలంటే తృణమూల్‌కే ఓటు వేయాలని ఆమె గట్టిగా పిలుపునిస్తున్నారు.బీజేపీ కౌంటర్: ‘స్వామి వివేకానందుడే చెప్పారు’మమత ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తీవ్రంగా స్పందించారు. స్వామి వివేకానందుడి బోధనలను గుర్తు చేస్తూ.. ఆహారపు అలవాట్లపై తాము ఎప్పుడూ ఆంక్షలు విధించబోమని స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే దీదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెంగాల్ సంస్కృతిని తమ కంటే బాగా ఎవరూ గౌరవించలేరని ఆయన కౌంటర్ ఇచ్చారు.ఓటర్ల మనోగతం: ‘ఆహారాన్ని రాజకీయం చేయకండి’రాజకీయ నాయకుల వాదోపవాదాలు ఎలా ఉన్నా, సామాన్య ఓటర్లు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు. ‘మా పళ్లెంలో చేపను దూరం చేసే ఎవరికైనా ఓటు వేయబోము’ అని కొందరు స్పష్టం చేస్తుండగా, మరికొందరు మహిళా ఓటర్లు అసలు సమస్యను తెరపైకి తెస్తున్నారు. చేపల ధరల కంటే, ఆ చేపను వండే గ్యాస్ ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, వాటి గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.గణాంకాలు చెబుతున్న 'చేప' పవర్!బెంగాల్లో చేపల వినియోగం కేవలం ఆహారం మాత్రమే కాదు, అదొక ఆర్థిక వ్యవస్థ. వరల్డ్ బ్యాంక్ లెక్కల ప్రకారం బెంగాలీయులు ఏడాదికి 8.36 లక్షల టన్నుల చేపలను ఆరగిస్తున్నారు. తమ మొత్తం ఆహార ఖర్చులో 18.9 శాతం కేవలం చేపలు, మాంసం కోసమే ఖర్చు చేస్తారు. పెళ్లిళ్లలో కూడా చేపను కానుకగా ఇచ్చే ఈ రాష్ట్రంలో, చేప చుట్టూ తిరిగే రాజకీయం ఎన్నికల ఫలితాలను ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి!ఇది కూడా చదవండి: కేరళ పోరు: రంగంలోకి మోదీ, సోనియా.. ‘యోగి’ ఎక్కడ? -
ముస్లింల ఓట్లే ‘కీ’లకం
(సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి) పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయ వాగ్భాణాలు, ప్రత్యేక వ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులు సహజం. కానీ వాటిని మించి కులాలు, మతాలు, ప్రాంతీయ సమీకరణాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. బెంగాల్ ఓటర్లలో దాదాపు 30 శాతం మంది ముస్లింలే. దాంతో అక్కడి పార్టీల తలరాతను మార్చగలిగే శక్తిగా ముస్లింలు ఎదిగారు. దీంతో ఈసారి వాళ్లు ఎవరికి పట్టంకడతారనే చర్చ మొదలైంది. ముఖ్యంగా తృణమూల్‌కు మొదటి నుంచీ ముస్లింలు అండగా ఉంటూ వస్తున్నారు. వీరి దన్నుతోనే మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈసారి ముస్లిం ఓట్లలో చీలిక తెస్తూనే హిందూ ఓట్లను ఐక్యం చేసే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముస్లిం ఓటర్లు రాష్ట్రంలోని కనీసం 110 స్థానాల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. దీంతో మరోసారి ముస్లింల ఐక్యత మరోసారి తృణమూల్‌ను విజయతీరాలకు చేరుస్తుందా? లేదంటే వీరిలో ఐక్యత దీపం కొండెక్కి తృణమూల్ పడవను ఓటమి సముద్రంలో ముంచేస్తుందా? లేదంటే చీలిక తెచ్చి బీజేపీ ఘన విజయం సాధిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిదాయకంగా మారింది. పథకాలతో లబ్ధిపొందిన ముస్లింలు ముస్లింల మద్దతు వెనుక కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేకాకుండా పక్కాగా అమలు చేసిన వ్యూహాలు, సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సమీకరణాలున్నాయి. ముఖ్యంగా...టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి మద్దతును ఏర్పరచాయి. మహిళల కోసం ‘లక్ష్మీ భండార్’, విద్యార్థుల కోసం ‘సబుజ్ సాథి’, బాలికల విద్యను ప్రోత్సహించే ‘కన్యాశ్రీ’వంటి పథకాలు సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రత్యక్ష లాభం చేకూర్చాయి. ఈ పథకాలు మతాలకు అతీతంగా అమలయ్యాయి. దీంతో ముస్లిం వర్గాలు ఈ పథకాల నుంచి ఎక్కువ మంది లబ్దిపొందాయి. మైనారిటీ వర్గాలపై టీఎంసీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మదర్సాల అభివృద్ధి, ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్లు, మతపరమైన నాయకులకు గౌరవ వేతనాలు వంటి చర్యలు ‘ప్రభుత్వం మన కోసం పని చేస్తుంది’అనే భావనను ముస్లింలలో బలంగా నాటాయి. ఈ భావన రాజకీయంగా టీఎంసీకి కీలక మద్దతుగా మారింది. గడిచిన పదేళ్లుగా ప్రధాన పోరు బీజేపీ, టీఎంసీల మధ్యే నెలకొంది. బీజేపీ హిందూ రాజకీయాలతో పోలిస్తే టీఎంసీ సర్వమత సహకార భావనే ముస్లింలను ఆ పార్టీకి దగ్గర చేసిందని తెలుస్తోంది. ముస్లింల ఈ రక్షణాత్మక భావనే తమ గెలుపునకు భరోసా అని టీఎంసీ నేతలు ఆశిస్తున్నారు. టీఎంసీ అయితేనే తమ ప్రయోజనాలకు పరిరక్షణగా నిలబడుతుందనే యోచన ముస్లింలలో బలంగా నాటుకుపోయింది. ఈ ఐక్యతే టీఎంసీకి గతంలో గంపగుత్తగా ఓట్లు పడేలా చేసింది. స్థానికంగా ముస్లిం నాయకత్వానికి టీఎంసీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ తరఫున ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం, ప్రాంతీయ నాయకులను ప్రోత్సహించడంతో ప్రజల్లో ప్రాతినిధ్యం ఉన్న భావన పెరిగింది. ఇది ఓటర్లతో నేరుగా అనుబంధాన్ని ఏర్పరచింది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణాలు వంటి ముస్లిం ప్రభావిత జిల్లాల్లో టీఎంసీకి బలమైన కేడర్ ఉంది. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోంది. ఎన్నికల సమయంలో ఓటును సమీకరించడంలో ఇవన్నీ కీలకంగా మారాయి. ప్రతిపక్ష పార్టీల బలహీనత టీఎంసీకి అనుకూలంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒకింత ముస్లిం ఓటు బ్యాంక్ ఉండేది. అయితే క్రమంగా ఈ రెండు పార్టీలు ప్రభావం కోల్పోవడంతో ప్రత్యామ్నాయం లేక ముస్లింలు టీఎంసీని ఆశ్రయించారు. హిందువులను ఐక్యం చేసే పనిలో కమలదళం బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ఎదుగుదల వెనుక ఉన్న ప్రధాన వ్యూహాల్లో ఒకటి ముస్లిం ఓటును విభజించడం. రెండోది హిందూ ఓటును ఐక్యంగా మార్చడం. ఈ ద్వంద్వ వ్యూహమే 2019 నుంచి పార్టీని బెంగాల్లో ముందుకు నడిపిస్తోంది. ముస్లిం ఓటర్లు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయకుండా వాళ్లను రెండు, మూడు పార్టీల వైపు చూసేలా చేయడమే బీజేపీ లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రత్యక్షంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కన్నా కాంగ్రెస్, లెఫ్ట్, చిన్న ప్రాంతీయ పార్టీల వైపు ముస్లిం ఓటర్లు చూసేలా బీజేపీ పరోక్ష రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని వార్తలొచ్చాయి. హిందువులను ఏకం చేసి ఒక రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంపై బీజేపీ ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం బీజేపీ మతపరమైన గుర్తింపును బలంగా ప్రస్తావిస్తోంది. సమూహ భావనను బీజేపీ ముందుకు తెస్తోంది. ముఖ్యంగా ‘సాంస్కృతిక పరిరక్షణ’, దేవాలయాలపై దాడులు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ హిందువుల్లో ఐక్యత పెంపొందేలా శతథా కృషిచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నమశూద్రులు, రాజ్బంశీలు వంటి వర్గాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని పెంచుకుంది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఈ వర్గాల మధ్య ప్రస్తావించడం ద్వారా తమ మద్దతును బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జంగిల్‌మహల్ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పార్టీ ప్రభావం పెంచుకుంది. బెంగాల్ ఉత్తర ప్రాంతాల్లో హిందువుల జనాభా ఎక్కువ. ఇక్కడ బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కబీర్ మరో ఒవైసీ అవుతారా..? తృణమూల్‌కు చెందిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ‘బాబ్రీ మసీదు నమూనాలో మసీదు కడతా’ అంటూ ఆయన మొదటుపెట్టిన రాజకీయాలు తీవ్ర అలజడిని రేపుతున్నాయి. కబీర్‌తో ముస్లిం ఓటు విభజనకు గురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కబీర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిపోవడంతో సుమారు 10 నుంచి 15 శాతం వరకు ఓటు చీలిపోయే ఆస్కారముంది. ఈ చీలిక నేరుగా తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండికొడుతుంది. వీరిద్దరూ కలిసి 140 స్థానాల్లో పోటీలో ఉంటారన్న అంచనాలు తృణమూల్‌ను కంగారు పెడుతున్నాయి. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో హుమయున్ కబీర్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిణామాలను బిహార్ రాజకీయాలతో పోల్చుతున్నారు. అక్కడ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటును విభజించి, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసింది. ఆర్జేడీ ఓటమికి పరోక్షంగా కారణమైంది. ఇప్పుడు అచ్చం అలాగే హుమాయున్ కబీర్ కారణంగా ముస్లిం ఓటు చీలితే టీఎంసీ విజయావకాశాలు తగ్గి బీజేపీ అధికారపీఠానికి చేరువయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
మమత Vs సువెందు : రసవత్తరంగా బెంగాల్ పోరు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆరంభంలోనే రసవత్తరంగా మారుతోంది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న ఎన్నికలకు గాను అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 3 స్థానాలను డార్జిలింగ్ ప్రాంతంలో అనిత్ థాపా నేతృత్వంలోని BGPM పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అభ్యర్థుల వివరాలను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ10 మంది మహిళలకు చోటివ్వగా టీఎంసీ లిస్టులో 52 మంది మహిళలు ఉన్నారు.సై అంటే సై అంటున్న దీదీబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తన నియోజకవర్గమైన భవానీపూర్ నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారిపై తలపడేందుకు దీదీ సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడించిన సువేందు అధికారిపై ఆమె మరోసారి నేరుగా ఢీకొంటుండటం విశేషం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటి నుండి సువేందును బీజేపీ అభ్యర్థిగా ప్రకటించింది.గెలుపు మాదే దీదీ ధీమా: వరుసగా నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి తాము 226 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ ఎస్ఐఆర్పై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని బీజేపీని తిప్పికొట్టి, తృణమూల్‌కు ఓటు వేసి గెలిపించాలని దీదీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ అస్థిత్వం కోసం జరిగే పోరు ఇది అని మమతా వ్యాఖ్యానించారు.కాగా 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన తర్వాత, మమత భవానీపూర్ ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీలోకి ప్రవేశించారు. 2021లో TMC 213 సీట్లు సాధించగా, బీజేపీ 77 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ సారి ఎలామైనా మమతను ఓడించి బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటికే బీజేపీ 144 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 2021లో ఇలా2021 అసెంబ్లీ ఎన్నికలలో, టీఎంసీ 213 స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్ గెలుపు సాధించింది. నందిగ్రామ్‌లో మమత ఓడిపోయినప్పటికీ టీఎంసీ తన స్థానాల సంఖ్యను రెండు పెంచుకుంది. 2016లో కేవలం మూడు స్థానాలకు పరిమితమైన బీజేపీ 2021 లో 77 స్థానాలకు పుంజుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రచారంలోదూకుడుతోపాటు, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్‌ల వైఫల్యం బీజేపీకి కలిసి వచ్చింది. -
బెంగాల్లో తృణమూల్, బీజేపీ నువ్వా నేనా?
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు మరోసారి దేశమంతటి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఒకరకంగా చెప్పాలంటే ‘సర్’కు ముందు, తర్వాత అన్నట్టుగా పరిణమించాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియకు ముందు వరకూ సీఎం మమతా బెనర్జీయే రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వెలుగొందారు. కానీ ఓటర్ల జాబితా సవరణతో అధికార తృణమూల్ పార్టీ ఓటు బ్యాంకు భారీగా ప్రభావితమైనట్టు కన్పిస్తోంది. దాంతో ఈ ఎన్నికల్లో ‘సర్’ప్రక్రియనే ప్రధాన ప్రచారాంశంగా చేసుకోవాలని దీదీ నిర్ణయించారు! ‘సర్’సాకుతో బెంగాలీల అస్తిత్వంపైనే దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. దాంతో సర్ ప్రక్రియ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసేలా కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర అంశాలు, సమస్యలు ఎన్నున్నా ఈసారి కూడా రాష్ట్రంలో ఎన్నికలు మరోసారి ‘మమత వర్సెస్ మోదీ’అన్నట్టుగానే జరగనున్నాయి.ఇద్దరు పాపులర్ నేతల పోరులో అంతిమంగా పైచేయి సాధించేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దూకుడుకు మరోసారి ముకుతాడేసి వరుసగా నాలుగోసారి విజయఢంకా మోగించాలని తృణమూల్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యలు, పలు రంగాల్లో మమత సర్కారు వైఫల్యాలు తదితరాలను అస్త్రాలుగా మార్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2021 ఎన్నికల్లో తృణమూల్‌కు గట్టి పోటీ ఇచ్చి 77 సీట్లు కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా చొచ్చుకుపోయి బెంగాల్‌పై తొలిసారిగా కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో సున్నా చుట్టి పూర్తిగా చతికిలపడ్డ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.పశ్చిమబెంగాల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అధికార బీజేపీ, విపక్ష తృణమూల్ కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. మమత దూకుడుకు ముకుతాడేసి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా విజయఢంకా మోగించాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి బెంగాల్‌పై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. త్వరలో వారిద్దరూ రాష్ట్రంలో సుడిగాలి ప్రచారానికి తెర తీయనున్నారు. మోదీ కరిష్మా రాష్ట్రంలో ఈసారి అధికారం కట్టబెట్టడం ఖాయమని బీజేపీ విశ్వసిస్తోంది. 15 ఏళ్లుగా సాగుతున్న తృణమూల్ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత బాగా కలిసొచ్చే అంశమన్నది ఆ పార్టీ భావన. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయన్న ప్రచారం కూడా తృణమూల్‌కు గట్టిగానే చేటుచేసేలా కన్పిస్తోంది.ముఖ్యంగా మహిళలకు భద్రతే లేకుండా పోయిందంటూ బీజేపీ ఇప్పటికే హోరెత్తిస్తోంది. హిందూత్వవాదంపై కూడా కాషాయ పార్టీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. తద్వారా ముస్లిమేతర ఓట్లు సంఘటితం అవుతాయని, పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపోటములను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. మొండితనానికి, పోరాటానికి మారుపేరైన దీదీ కూడా కాషాయ దళానికి దీటుగా ఎన్నికల వ్యూహరచన చేస్తోంది. సర్ ప్రక్రియను వ్యతిరేకించే క్రమంలో ఆమె ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్లడం వంటివి కలిసొస్తాయని తృణమూల్ భావిస్తోంది. మమతకున్న ‘సామాన్యురాలి’ ఇమేజీపైనే మరోసారి నమ్మకం పెట్టుకుంది. అయితే మంత్రులు, నేతల అవినీతి బాగోతాలు అధికార పార్టీకి తీవ్రంగా చేటుచేసేలా కన్పిస్తున్నాయి. అవినీతి ఆరోపణల మచ్చను ఏ మేరకు చెరుపుకోగలదన్నది ఆసక్తికరం.లెఫ్ట్, కాంగ్రెస్ నేల చూపులు 1977 నుంచి 2011 దాకా బెంగాల్‌ను సుదీర్ఘంగా పాలించిన వామపక్ష కూటమి పరిస్థితి రాష్ట్రంలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఓట్ల శాతం కేవలం 4.73కి పడిపోయిన పరిస్థితి! కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. లెఫ్ట్ ఫ్రంట్‌కు, హస్తం పార్టీకి గత ఎన్నికల్లో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా రాలేదు! దాంతో అవి ఈసారి ఎంతోకొంత పుంజుకుని ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాయి.బీజేపీకి ‘ఎల్పీజీ’దడ ఎన్నికలు సమీపించిన తరుణంలో పశ్చిమాసియా యుద్ధం బీజేపీకి అనుకోని సమస్య తెచ్చిపెట్టింది. నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరత సామాన్య ప్రజలతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. పరిస్థితి తక్షణం చక్కబడకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రతికూలాంశంగా మారగలదని బీజేపీ వర్గాలు ఆందోళన పడుతున్నాయి. మరోవైపు మమతకు మాత్రం ఈ అంశం అనుకోకుండా అందివచ్చిన అస్త్రంగా మారేలా కనిపిస్తోంది. పోలింగ్‌కు మరో నెల రోజులున్నందున ఈలోపు సమస్యను మోదీ సర్కారు ఏ మేరకు చక్కదిద్దగలదన్నది చూడాల్సిందే.కీలకంగా ‘సర్’ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియ బెంగాల్లో కీలక ఎన్నికల అంశంగా మారింది. ఓటర్ల జాబితా సవరణ ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్లకు తగ్గింది. ఏకంగా 1.2 కోట్లకు పైగా ఓట్లు తొలగింపుకు గురవడంతో పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకరణాలే అనూహ్యంగా తారుమారయ్యే పరిస్థతి నెలకొంది! ముఖ్యంగా 60 లక్షలకు పైగా ముస్లిం ఓట్ల తొలగింపు తృణమూల్‌ను గట్టిగా దెబ్బతీయనుంది.రాజధాని కోల్‌కతాతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దాని ఓటు బ్యాంకు తగ్గడం బీజేపీకి లాభించేలా కన్పిస్తోంది. ఆయాచోట్ల తమ ఓట్లు భారీగా తొలగింపుకు గురైనట్టు తృణమూల్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించింది. అందుకే సర్ ప్రక్రియను కీలక ప్రచారాస్త్రంగా మలచుకోవాలని మమత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని బెంగాలీల అస్తిత్వంపై కేంద్రం దాడిగా చిత్రిస్తున్నారు. సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏకంగా సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు విన్పించారామె! ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆమె ఇమేజీని మరింత పెంచిందని తృణమూల్ అంటోంది.అయితే 24 పరగణాలు, నాదియా వంటి బంగ్లా సరిహద్దు జిల్లాల్లో బీజేపీ ఓటుబ్యాంకుకు కూడా సర్ ప్రక్రియ కొంతమేరకు గండి కొట్టింది. అక్కడ బీజేపీకి పట్టున్న మథువా, రాజ్‌బన్షీ సామాజిక వర్గాల ఓటర్లు భారీగా తొలగింపుకు గురయ్యారు. అయినా సరే, అక్రమ వలసదారుల ఓట్లతోనే మమత అధికారం చేపడుతూ వస్తున్నారని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. బీజేపీ సానుకూలతలు డబుల్ ఇంజన్ ప్రభుత్వ నినాదం మమత ప్రభుత్వంపై వ్యతిరేకత సర్ ప్రక్రియతో పలు అసెంబ్లీ స్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగవడం టీచర్లు, ఆశా వర్కర్లు తదితరుల దన్ను ప్రతికూలతలు చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడం తృణమూల్‌తో పోలిస్తే క్షేత్రస్థాయిలో బలహీనం కేంద్ర నాయకత్వంపై ఆధారపడటం సర్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం నానాటికీ తీవ్రమవుతున్న ఎల్పీజీ కొరతతృణమూల్ కాంగ్రెస్ సానుకూలతలు మమత పాపులారిటీ మహిళల్లో ఆదరణ క్షేత్రస్థాయిలో పార్టీకున్న పట్టు లక్ష్మీర్ బంధర్, స్వాస్థ్య సాథి, యువ సాథి వంటి పథకాలు సర్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహం ఎన్నికలను రాష్ట్రం వర్సెస్ కేంద్రంగా మలచడంలో విజయం ప్రతికూలతలు 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత నేతలు, మంత్రులపై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో పెచ్చరిల్లిన నేరాలు సర్ ప్రక్రియతో పలుచోట్ల ఓటు బ్యాంకుకు గండి -
తృణమూల్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో చొరబాటుదార్లను కాపాడేందుకే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. చొరబాటుదార్ల కారణంగా రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో జనాభా సమతూకంలో విపరీతమైన మార్పులు వచ్చాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే బెంగాలీ హిందువులను మైనార్టీ లుగా మార్చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో లబ్ధి కోసం చొరబాట్లను ప్రోత్సహించిందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శనివారం పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.రూ.18,680 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. రెండు రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఓడరేవుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కోల్‌కతాలో బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిర్వహించిన పరివర్తన్ యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలపై దాడి చేసిందని ఆరోపించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు.రాజకీయ మార్పు తీసుకురావాలని ప్రజలకు సూచించారు బెంగాల్ ఆత్మను కాపాడేందుకు, కట్ మనీ సంస్కృతిని అంతం చేసేందుకు, భయం నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు జరగబోతున్నాయని స్పష్టంచేశారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో ఈ ఎన్నికలు నిర్ణయాత్మక పోరాటమని అభివర్ణించారు. బెంగాల్లో జంగిల్ రాజ్ అంతం కాక తప్పదన్నారు. ఎస్ఐఆర్తో ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదార్ల పేర్లుతొలగిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. మృతి చెందినవారి పేర్లు కూడా తొలగించకూడదా? అని నిలదీశారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే.. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఇన్నాళ్లూ ప్రజలను భయపెట్టారని, ఇక ఆ గూండాలే భయపడే రోజులు వచ్చాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేరగాళ్లు, చొరబాటుదార్లు, బుజ్జగింపు రాజకీయాలు చేసేవాళ్లు చట్టానికి భయపడాల్సిందేనని ఉద్ఘాటించారు. నేరగాళ్లు ఉండాల్సిన చోటు జైలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో తాము అధికారంలోకి రాగానే వారిని జైలుకు పంపిస్తామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారిపై, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన వచ్చే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినవారిని, అరాచకాలకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పొరుగుదేశాల్లో మతపరమైన వివక్షను ఎదుర్కొంటున్న మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందువులకు భారత పౌరసత్వం కల్పించడం తృణమూల్ కాంగ్రెస్‌కు ఇష్టం లేదని ఆక్షేపించారు. ఎందుకంటే హిందువులను ఆ పార్టీ ఓటు బ్యాంకుగా భావించడం లేదన్నారు. కేవలం నేరస్థుల అండతోనే మమతా బెనర్జీ సర్కారు మనుగడ సాగిస్తోందని విమర్శించారు.ఎస్ఐఆర్ నిర్వహించినందుకు రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ ప్రధానమంత్రి మండిపడ్డారు. దళిత మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును తృణమూల్ కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. కేవలం రాష్ట్రపతినే కాకుండా.. దేశంలోని గిరిజనులు, రాజ్యాంగాన్ని అవమానించినట్లు ధ్వజమెత్తారు. ఆ పార్టీ అన్ని హద్దులూ దాటేసిందన్నారు. తృణమూల్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ కోల్‌కతాలో ప్రధాని మోదీ హాజరైన సభ కంటే అరగంట ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తమ పార్టీలకు అనుకూలంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో బీజేపీ నాయకుడితోపాటు ఓ పోలీసు అధికారి గాయపడ్డారు. బహిరంగ సభకు వస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను రెచ్చగొట్టి దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలం సిల్చార్: మన దేశంపై ప్రపంచ సంక్షోభాలు, యుద్ధాల ప్రభావాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడానికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మోదీ స్పష్టంచేశారు. పశ్చిమాసియా పరిణామాల పట్ల మన దేశంలో ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరైంది కాదని సూచించారు. మోదీ వరుసగా రెండోరోజు శనివారం కూడా అస్సాంలో పర్యటించారు.రూ.23,550 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. సిల్చార్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధాన్ని అడ్డంపెట్టుకొని ప్రజల్లో అలజడి సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అభివృద్ధి గురించి ఏమీ తెలియదన్నారు. మోదీని దూషించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, అబద్ధాలు చెప్పడం, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. -
బెంగాల్ ఎన్నికల పోరు.. ఎవరిది జోరు?
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ తరపున ప్రచారం సాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రచార బాధ్యతను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకున్నారు. ఈసారి బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే ఆ పరిస్థితి ఉందా అంటే.. లేదనే అంటోంది తాజా సర్వే.మళ్లీ దీదీకే చాన్స్మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని 'ఓట్ వైబ్' సర్వే అంచనా వేసింది. దీని ప్రకారం 39.6 శాతం మంది ఓటర్లు దీదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. కమలం పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన వారు 30.5 శాతం మంది మాత్రమే. నిమ్న వర్గాల నుంచి కాషాయ పార్టీకి ఎక్కువ మద్దతు లభించడం ఆసక్తికర పరిణామం. ఎస్సీ (50%), ఎస్టీ (38%), ఓబీసీ ఓటర్లలో (44%) అధిక శాతం బీజేపీ వైపు మొగ్గు చూపారు. మైనారిటీలు మమతా బెనర్జీ పార్టీకే జై కొట్టారు. ముస్లిం ఓటర్లలో 54 శాతం మంది తృణమూల్ వైపు నిలిచారు. హిందూ సాధారణ వర్గం ఓటర్లలో అత్యధిక మద్దతు కూడా తృణమూల్ కాంగ్రెస్‌కే దక్కడం విశేషం.ప్రభుత్వ పనితీరు.. ప్చ్బెంగాల్ యువత ఎక్కువగా బీజేపీకి మద్దతుగా ఉన్నారని సర్వే వెల్లడించింది. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారు కాషాయపార్టీకి అండగా ఉన్నారు. సీనియర్ సిటిజనులు మాత్రం మమతా బెనర్జీపైనే నమ్మకం ఉంచారు. అయితే దీదీ ప్రభుత్వ పనితీరుపై మాత్రం బెంగాల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వం బాలేదని 40.6 శాతం మంది నిర్మోహమాటంగా తేల్చేశారు. 38.3 శాతం మంది మాత్రం ప్రభుత్వ పనితీరు బాగుదంటూ కితాబిచ్చారు. ముస్లింల్లో సగానికి పైగా మమతా ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. ఎస్సీ, ఎస్టీల్లో మాత్రం 50 శాతం కంటే ఎక్కువ మంది పేలవం అంటూ పెదవి విరిచారు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయం తీసుకోని వారు 18.5 శాతం మంది అని సర్వే తెలిపింది.దీదీ బెస్ట్ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ మాత్రమే సరైన నాయకురాలని బెంగాల్ ప్రజలు క్లియర్‌కట్‌గా తేల్చేశారు. సర్వేలో ఆమెకు 35.4 శాతం మంది మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు సువేందు అధికారికి 20.9 శాతం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య (Samik Bhattacharya) 14.8 శాతం మద్దతుతో రెండుమూడు స్థానాల్లో నిలిచారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. నిరుద్యోగంపై బెంగఉపాధిలేమి బెంగాల్ ప్రజలను బాగా కలవరపెడుతోంది. నిరుద్యోగం (Unemployment) పట్ల 33.8 శాతం మంది ఓటర్లు ఆందోళన వెలిచ్చారు. శాంతిభద్రతలు/మహిళల భద్రత (19.1%), అవినీతి (18.3%) గురించి కూడా బెంగాలీలు బెంగగా ఉన్నారు. మతపరమైన ధ్రువీకరణ (కమ్యునల్ పోలరైజేషన్) గురించి మాత్రం బెంగాల్ ఓటర్లు (3 శాతం) పెద్దగా పట్టించుకోలేదు. నాయకత్వం లేదా సిద్ధాంతం ఆధారంగా కాకుండా.. ప్రభుత్వ పనితీరును చూసే ఓటు వేస్తామని 29.3 శాతం మంది చెప్పడం గమనించాల్సిన విషయం. ఎమ్మెల్యేలపై వ్యతిరేకతఎమ్మెల్యేల స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టు సర్వే బయటపెట్టింది. కేవలం 26.9 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను తిరిగి ఎన్నుకునేందుకు అనుకూలంగా ఉన్నారు. అదే పార్టీ నుండి వేరే అభ్యర్థిని నిలబెట్టాలని ఎక్కువ మంది ఓటర్లు కోరుకుంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని మార్చకపోతే ప్రత్యర్థి పార్టీకి ఓటు వేయాలని యోచిస్తున్నారు.బీజేపీకి అదే మైనస్బెంగాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు అంతర్గత కలహాలు, వర్గ విభేదాలని 20 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. బెంగాల్ సంస్కృతిని (Bengal culture) అర్థం చేసుకోలేదనే అభిప్రాయాన్ని 16.2 శాతం మంది సర్వేలో వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన రాష్ట్ర నాయకుడు లేకపోవడం బీజేపీకి మరో మైనస్ అని 14.5 శాతం మంది పేర్కొన్నారు.చదవండి: చిరాగ్ పాశ్వాన్ ఈసారైనా చక్రం తిప్పుతారా?టీఎంసీకి కబీర్ ఎఫెక్ట్టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir).. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్‌కు గండి కొట్టే అవకాశముందని ఓటర్లలో 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆయన వెనుక బీజేపీ లేదా టీఎంసీ ఉండివుండొచ్చన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేయడం గమనార్హం. కాగా ముర్షిదాబాద్ జిల్లా రెజినగర్‌లో బాబ్రీ మాదిరి మసీదు నిర్మాణానికి పూనుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. -
బెంగాల్‌పై బీజేపీ ఫుల్ ఫోకస్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కమలం పార్టీ పశ్చిమ బెంగాల్‌పై ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే బెంగాల్ ఎన్నికల ప్రచార కార్యాచరణ చేపట్టింది. ఎన్నికలకు 5 నెలలు ముందుగానే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి, ఆరు రాష్ట్రాల నుంచి 12 మంది సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది.పశ్చిమ బెంగాల్లోనూ జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తామని బిహార్ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించారు. బిహార్ విజయం బెంగాల్లో గెలుపునకు బాట వేసిందని వ్యాఖ్యానించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇదేరకమైన వ్యాఖ్యలు చేశారు. తమ తదుపరి లక్ష్యం బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయడమేనని ఉద్ఘాటించారు. బెంగాల్లో అరాచక పాలనకు చరమగీతం పాడతామని ప్రతిన బూనారు. వీరి మాటలను బట్టి చూస్తేనే అర్థమవుతుంది.. బెంగాల్ ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో.త్రిముఖ వ్యూహంబెంగాల్లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పదిహేనేళ్ల పాలనకు ముగింపు పలికి అధికారాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది బీజేపీ. ఇందుకోసం క్షేత్రస్థాయి కార్యాచరణ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పశ్చిమ బెంగాల్‌ను 5 అధిక ప్రాధాన్యత గల జోన్లుగా విభజించి.. ప్రతి జోన్‌కు ఒక మంత్రిని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని నియమించారు. వీరంతా ఎన్నికల వరకు బెంగాల్లోనే మకాం వేస్తారు. బీజేపీ క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, బూత్-స్థాయి యంత్రాంగాన్ని ఏకీకృతం చేయడం, తృణమూల్ కాంగ్రెస్ బలమైన కోటల్లోకి ప్రవేశించడం వంటి లక్ష్యాలతో వీరు పనిచేస్తారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly Election 2026) వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి.రాధా-బంగా జోన్ (పురులియా–బర్ధమాన్)పురులియా, బర్ధమాన్‌లో తమ పార్టీ ఉనికిని పెంచుకోవాలని బీజేపీ (BJP) భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోగా సంస్థాగతంగా బలపడాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతో ఈ జోన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) పవన్ సాయిని పర్యవేక్షుడిగా బీజేపీ అధినాయకత్వం నియమించింది. ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ సహా-పర్యవేక్షుడిగా బాధ్యతలు అప్పగించింది.హౌరా–హూగ్లీ–మేదినీపూర్ జోన్హౌరా–హూగ్లీ పర్యవేక్షణను ఢిల్లీ సంస్థాగత మంత్రి పవన్ రాణా (Pavan Rana) చూసుకుంటారు. ఆయనకు హరియాణాకు చెందిన సీనియర్ సంజయ్ భాటియా సహకారం అందిస్తారు. మేదినీపూర్ బాధ్యతలు ఉత్తరప్రదేశ్ మంత్రి జేపీఎస్ రాథోడ్‌కు కట్టబెట్టారు. టీఎంసీ- బీజేపీ మధ్య ఘర్షణలతో రాజకీయంగా సున్నితమైన ప్రాంతంగా మేదినీపూర్‌ను పరిగణిస్తున్నారు. బీజేపీ నేత సువేందు అధికారి ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది.కోల్‌కతా మెట్రోపాలిటన్ & సౌత్ 24 పరగణాలుబీజేపీ అత్యంత కఠినమైన ప్రాంతాలలో ఒకటైన ఈ బెల్ట్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ కార్యదర్శి ఎం. సిద్ధార్థన్ పర్యవేక్షిస్తారు. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి ఆయనతో కలిసి పని చేస్తారు. ఈ జిల్లాల్లో చాలా కాలంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.నబద్వీప్ & నార్త్ 24 పరగణాలుఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి మధుకర్ నూకల (Madhukar Nukala) ఈ ప్రాంతంలో కాషాయ పార్టీ ప్రచార బాధ్యతలు చూస్తారు. యూపీ మంత్రి సురేష్ రాణా సహ-ఇన్చార్జ్గా ఉంటారు. సరిహద్దు జిల్లా అయిన నార్త్ 24 పరగణాలను రాజకీయంగా వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ సంస్థాగతంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది.చదవండి: సిద్ధూ వర్సెస్ డీకే.. తెరపైకి మూడో పేరు!ఉత్తర బెంగాల్ (మాల్డా–సిలిగురి డివిజన్)అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ కార్యదర్శి అనంత్ నారాయణ్ మిశ్రాకు మాల్డా ప్రాంత పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ బిన్నాడి.. సిలిగురి ప్రాంతం బాధ్యతలు నిర్వహిస్తారు. బీజేపీ సాంప్రదాయ మద్దతు స్థావరాలలో ఒకటిగా పరిగణించబడే ఉత్తర బెంగాల్ ప్రాంతం అంతటా మాజీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి చురుకైన పర్యవేక్షక పాత్రను పోషించనున్నారు. -
2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..
-
కాంగ్రెస్ పొత్తుతో లయ తప్పాం: సీపీఎం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన సీపీఎం ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో జత కట్టి లయతప్పామని పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. సోమవారం ఇక్కడ జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఇటీవల పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ జయాపజయాలపై సమీక్షించారు. -
మార్పు దిశగా అస్సాం
ప్రచారంలో హోరాహోరీగా తలపడ్డ బీజేపీ-కాంగ్రెస్ ♦ మార్పు, చొరబాట్లే బీజేపీ ప్రచారాస్త్రాలు ♦ అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకెళ్లిన గొగోయ్ ♦ నేడు చివరి విడత ఎన్నికలు గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: అస్సాం పీఠాన్ని నాలుగోసారి దక్కించుకోవాలని కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం చేసింది. అభివృద్ధే గెలిపిస్తుందని ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆశలు పెట్టుకున్నారు. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల్లో 7 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉంది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, మార్పు తథ్యమని చెబుతోంది. మార్పు, బంగ్లా నుంచి చొరబాట్లే ప్రధాన ప్రచారాస్త్రంగా ప్రచారంలో దూసుకుపోయింది. అస్సాంలో సోమవారం చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు(61స్థానాల్లో) జరగనున్నాయి. అభివృద్ధే కాపాడాలి: కాంగ్రెస్ అస్సాం కోసం 15 ఏళ్లుగా చేసిన అభివృద్ధి తనకు కలిసొస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి, అస్తవ్యస్త పాలన ఆ పార్టీకి గుదిబండలా మారాయి. కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకు ఏఐయూడీఎఫ్ వైపు మొగ్గడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలకు ముందే రూ.2 కిలో బియ్యం పథకంతో పాటు బరాక్ లోయ ప్రజలకు గొగోయ్ ప్యాకేజీ ప్రకటించారు. రెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అస్సాంకు చేసిందేమీ లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. కొన్ని వర్గాలకు ఎస్టీ హోదా ఇస్తామని చెప్పి విస్మరించారని, చొరబాట్ల నిరోధంలో విఫలమయ్యారంటూ విమర్శించింది. చొరబాట్ల అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రం చేయడం వెనుక మత విద్వేషాలు రెచ్చగొట్టడడమే లక్ష్యమని ఆరోపణలు గుప్పించింది. మా గెలుపు పక్కా : బీజేపీ మార్పు నినాదంతో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 7స్థానాలు గెల్చుకున్నప్పటి నుంచే అసెంబ్లీ పోరుకు కసరత్తు మొదలుపెట్టింది. అస్సాం నిర్మాణ్ పేరిట సదస్సులు నిర్వహించి ఎజెండా రూపొందించింది. బీజేపీకి ఓటేస్తే కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామంటూ వాగ్దానం చేసింది. సీఎం అభ్యర్థిగా సర్వానంద సోనోవాల్‌ను ముందుగానే ప్రకటించింది. 15 ఏళ్ల కిందట చక్రం తిప్పిన అస్సాం గణ పరిషత్‌ను తన వైపు తిప్పుకోవడంలో సఫలమైంది. బొడోలాండ్ ప్రాంతంలో పట్టున్న బీపీఎఫ్‌ను కూడా తన కూటమిలో చేర్చుకుని గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. కాంగ్రెస్ పాలనతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని బీజేపీ సీఎం అభ్యర్థి సోనోవాల్ ‘సాక్షి’తో అన్నారు. తమకు అధికారమిస్తే అవినీతి రహిత సుపరిపాలన అందిస్తామని చెప్పారు. చక్రం తిప్పుతాం: ఏఐయుడీఎఫ్ రాష్ట్రంలో దాదాపు 30 స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం ఓటర్ల మద్దతుపై ఏఐయూడీఎఫ్ ఆశలు పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీ సీట్లు గెలుచుకున్న ఊపుతో రాష్ట్రంలో చక్రం తిప్పాలని భావిస్తోంది. నేడు బెంగాల్ తొలి దశ రెండో భాగం కోల్‌కతా: సోమవారం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ రెండో భాగం ఎన్నికలు జరగనున్నాయి.


