white snake
-
రియల్ శ్వేతనాగును చూశారా! వీడియో వైరల్
-
కలవరపెట్టిన ఆరడుగుల శ్వేతనాగు..
మామిడికుదురు: అతి ప్రమాదకరమైన ఆరడుగుల శ్వేతనాగు పెదపట్నంలంకలో స్థానికులను శుక్రవారం కలవరపాటుకు గురి చేసింది. స్థానికంగా కొమ్ముల శంకరం ఇంటిలోకి ఆ పాము రావడంతో స్థానికులు అప్పనపల్లికి చెందిన పాములు పట్టే యాళ్ల ప్రకాశరావును ఆశ్రయించారు. అతను వచ్చే సరికి పాము ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి డొక్కల రాశులోకి వెళ్లింది. ప్రకాశరావు దానిని అతి చాకచక్యంగా బంధించి ఊరి పొలిమేరలకు తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. ఇది అరుదైన శ్వేతజాతికి చెందిన తాచుపామని ప్రకాశరావు చెప్పారు. దీని శరీరం తెలుపు రంగులో ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమైనదన్నారు. చదవండి: ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే.. పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం -
శివరాత్రి రోజున శ్వేత నాగు దర్శనం; జన్మ ధన్యం!
సాక్షి, మంచిర్యాల: జిల్లాలోని లక్సీట్టిపెట్ మునిసిపాలిటీ పరిధిలోని కోర్టు ఆవరణలో మహా శివరాత్రి పర్వదినాన పసుపునుటి సంతోష్ ఇనే వ్యక్తి ఇంటి పరిధిలో అరుదైన పెద్ద శ్వేతనాగు దర్శనం ఇచ్చింది. కాలనీ వాసులు పెద్దఎత్తున శ్వేత నాగు పాముకు పూజలు చేసి పాలు పోశారు. మహాశివరాత్రి రోజు ఈ శ్వేత దర్శనం ఇవ్వడంతో జన్మ ధన్యమైందని భక్తులు అన్నారు. ఈ శ్వేత నాగును దర్శించుకునేందుకు కాలనీ వాసులు తరలివచ్చారు. స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో.. శ్వేతనాగును పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: కడతేరిన ‘ఫేస్బుక్’ ప్రేమ రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో.. -
శివరాత్రి రోజున అరుదైన శ్వేత నాగు దర్శనం
-
తెల్లతాచు హడావుడి
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : తుర్పు గోదావరి జిల్లాలోని బొమ్మూరు 220 కేవీ సబ్స్టేçÙ¯ŒSకు చెందిన యార్డులో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో తెల్లతాచు పాము కలియతిరిగింది. దీన్ని గమనించిన ఉద్యోగులు వెంటనే హత మార్చారు. యార్డు ఆవరణలో అనేక రకాల పాములు నిత్యం సంచరిస్తుటాయని, తెల్లతాచు రావడం ఇదే ప్రథమనని చెప్పారు.