శ్వేతనాగును సంచిలో బంధిస్తున్న ప్రకాశరావు
మామిడికుదురు: అతి ప్రమాదకరమైన ఆరడుగుల శ్వేతనాగు పెదపట్నంలంకలో స్థానికులను శుక్రవారం కలవరపాటుకు గురి చేసింది. స్థానికంగా కొమ్ముల శంకరం ఇంటిలోకి ఆ పాము రావడంతో స్థానికులు అప్పనపల్లికి చెందిన పాములు పట్టే యాళ్ల ప్రకాశరావును ఆశ్రయించారు. అతను వచ్చే సరికి పాము ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి డొక్కల రాశులోకి వెళ్లింది. ప్రకాశరావు దానిని అతి చాకచక్యంగా బంధించి ఊరి పొలిమేరలకు తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. ఇది అరుదైన శ్వేతజాతికి చెందిన తాచుపామని ప్రకాశరావు చెప్పారు. దీని శరీరం తెలుపు రంగులో ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమైనదన్నారు.
చదవండి:
ఈ ఆవు దూడ ఎంత లక్కీ అంటే..
పెళ్లిరోజు.. అంతలోనే ఊహించని విషాదం
Comments
Please login to add a commentAdd a comment