భార్య అదృశ్యం.. భర్త ఆత్మహత్య
దండేపల్లి: భార్య కనిపించకుండా పోవటంతో మనస్తాపం చెందిన భర్త బలవన్మరణం చెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చుంచు రమేష్(35) భార్య సునీత రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు.