అదనపు కట్నం కోసం భర్తే హతమార్చాడని..
విజయవాడ: నగరంలోని అయోధ్య నగర్లో రైల్వే ఉద్యోగి భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం ఆమె భర్తే హతమార్చాడని మృతురాలి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చూరీకి తరలించగా బంధువులు ధర్నాకు దిగారు.
ఈ నేపథ్యంలో మార్చూరీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.