ఢిల్లీలో ‘అంకురం’
ఖమ్మం స్పోర్ట్స్: ఢిల్లీలో జరుగుతున్న అండర్–15 జాతీయస్థాయి క్రికెట్ టోర్నీలో ఖమ్మానికి చెందిన క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (సీఏటీ) తరఫున పాల్గొన్న క్రికెటర్లు చక్కని ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. తమిళనాడు–సీఏటీ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో అంకుర్సింగ్ మూడు వికెట్లు తీసి రాణించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సీఏటీ నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులు చేసింది. 109 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరభించిన తమిళనాడు 96 పరుగులకే కుప్పకూలింది. సీఏటీ బుధవారం ఆంధ్రతో తలపడుతుందని కోచ్ రాజు టక్కర్ తెలిపారు.