winning candidates
-
గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్ఎస్ 54 స్థానాల్లో విజయం సాధించగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన టీఆర్ఎస్ ఈసారి మాత్రం 58-60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఇప్పటివరకు 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ఎంఐఎం తాను పోటీ చేసిన 52 స్థానాలకు గానూ 39 స్థానాల్లో గెలిచి.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా పార్టీల వారిగా వివిధ పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. టీఆర్ఎస్ కాప్రా - స్వర్ణ రాజ్ చర్లపల్లి - బొంతు శ్రీదేవి శేరిలింగం పల్లి - రాగం నాగేందర్ బోరబండ - బాబా ఫసియుద్దీన్ భారతీ నగర్ - సింధూ ఆదర్శ్ రెడ్డి మెట్టుగూడ - రాసూరి సునీత సూరారం - మంత్రి సత్యనారాయణ బాలాజీ నగర్ - పగడాల శిరీష రంగా రెడ్డి నగర్ - శేఖర్ గౌడ్ కెపీహెచ్బీ - మందాడి శ్రీనివాస్ రావ్ కూకట్ పల్లి - జూపల్లి సత్యనారాయణ పఠాన్ చెరువు - మెట్టు కుమార్ హైదర్ నగర్ - నార్నె శ్రీనివాస్ ఆల్వాల్ - చింతల విజయశాంతి రెడ్డి వెంకటాపురం - సబితా గౌడ్ జగద్గిరిగుట్ట - జగన్ వివేకానందనగర్ - మాదవరం రోజా గోల్నాక - దూసరి హఫీజ్ పేట్ - పూజిత కొండాపూర్ - హమీద్ పటేల్ యూసుఫ్ గూడ - రాజ్ కుమార్ పటేల్ ఫతేనగర్ - పండాల సతీష్ గౌడ్ నాచారం - శాంతి సాయిజేన్ ఖైరతాబాద్..విజయా రెడ్డి గాజులరామారం- రావుల శేషగిరి సోమాజిగూడ- వనం సంగీత బీజేపీ అమీర్ పేట్ - సరళ చిలుకా నగర్ - గోనె శైలజ హబ్సిగూడ - చేతన అక్బర్ బాగ్ - మినాజ్ ఉద్దీన్ హయత్ నగర్ - కళ్లెం నవజీవన్ రెడ్డి గచ్చి బౌలి - గంగా ధర్ రెడ్డి అడిక్ మెట్ - సునీత ప్రకాష్ గౌడ్ జీడిమెట్ల - తారా చంద్ర రెడ్డి గుడిమల్కాపూర్ - కర్ణాకర్ హస్తినాపురం - బానోతు సుజాత వనస్థలిపురం - వెంకటేశ్వర్ రెడ్డి చైతన్య పురి - నర్సింహ గుప్త మోండా మార్కెట్- దీపిక బేగంబజార్- శంకర్ యాదవ్ గోశామహల్ 51- లాల్ సింగ్ మంగల్ హాట్ - శశి కళ జాంబాగ్ - రాకేష్ జైస్వాల్ గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ ఎంఐఎం చావ్ని - ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ డబీర్ పుర - ఎంఐఎం ఉప్పుగూడ - ఆబ్దాద్ తలాబ్ చంచలం - సమీనా బేగం నవాబ్ సహేబ్ కుంట - షీరీన్ కాతూన్ మెహెదీ పట్నం- మాజిద్ హుస్సేన్ సంతోష్ నగర్ - ముజ్ఫర్ హుస్సేన్ దత్తత్రేయనగర్ - జాకీర్ బక్రి మొగల్పుర - నస్రీన్ సుల్తానా ఛాంద్రాయణగుట్ట - అబ్దుల్ వాహబ్ రియాసత్ నగర్- మిర్జా ముస్తాఫా బేగ్ ఆనంద్ నగర్ - నసీరుద్దీన్ రమాన్సపుర- అబ్దుల్ ఖాదీర్ జహనుమా-అబ్దుల్ ముక్తదీర్ శాస్ర్తీపురం కాంగ్రెస్ ఏస్ రావ్ నగర్ - సింగిరెడ్డి శిరీషా రెడ్డి ఉప్పల్ - రజిత -
మిర్యాలగూడ : అభ్యర్థుల్లో ఉత్కంఠ
సాక్షి, మిర్యాలగూడ : సాధారణ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ముగిసింది. దాంతో ప్రచార ఆర్భాటాలు, ఓటర్లకు గాలం వేయడం ముగిసింది. ఎన్నికల్లో ప్రధాన అంకమైన పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు అంకమైన కౌంటింగ్ ఈ నెల 11వ తేదీన ఉంది. ఇంతకాలం పాటు ఎన్నికల ఆర్భాటాల్లో ఉన్న అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. పోటీ చేసిన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా రాజకీయ ఉద్దండులే కావడం గమనార్హం. టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన భాస్కర్‌రావు గత ఎన్నికల్లో తెలంగాణ వాదం ఉన్నప్పటికీ కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్. కృష్ణయ్య 40సంవత్సరాలుగా బీసీ ఉద్యమ నేతగా కొనసాగుతున్నారు. సీపీఎం తరుపున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డి 40సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండటంతో పాటు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా ఈ ముగ్గురు కూడా ఈ ఎన్నికల్లో ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మండలాల వారీగా ఆయా పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి ఓట్ల శా తాన్ని లెక్కించుకుంటున్నారు. ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయంతో పాటు తమకు ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో ఎవరికి వారుగా తమదే విజయం అని పేర్కొంటున్నారు. పెరిగిన పోలింగ్‌పై చర్చ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 79.13 శాతం ఉన్న పోలింగ్ ఈ ఎన్నికల్లో 84.57కు పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం తమకంటే తమకే అనుకూలంగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ ఆయననే గెలిపించాలని ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొన్నారని టీఆర్ఎస్ నాయకులు భావిస్తుండగా, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థులంతా ఏకమయ్యారని, అందుకు తమకే అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్ష పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం చేకూరనుందో మరో రోజు వేచి చూడాల్సిందే. స్వతంత్రుల ఓట్లు ఎవరికి గండిపడునో.. గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎన్నికల్లో 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాంతో రెండు ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేశారు. రెండు మిషన్లు పక్కపక్కనే పెట్టడం వల్ల కూడా ఓటర్లు కొంతమంది అనుకున్న గుర్తుకు ఓటే వేయలేదని, దాంతో స్వతంత్ర అభ్యర్థులకు అధికంగా ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులకు అనుకున్నట్లుగానే ఎక్కువ ఓట్లు వస్తే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఓట్లకు గండిపడే అవకాశం ఉంది. దాని వల్ల ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములపై కూడా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. -
గెలుపుపై ధీమా...
సాక్షి, మహబూబాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. గెలిచేందుకు ఎత్తుగడలు వేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఒక వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు గ్రామాల్లోని పలు స్థాయిల్లో గల నాయకులను పార్టీల్లో చేర్చుకుంటున్నారు.మానుకోట అసెంబ్లీ ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. జరుగుతున్న ప్రచారం, చేరికలతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. మానుకోట నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్(ఐ), టీడీపీ, సీపీఐ రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకసారి, పీడీఎఫ్, ఎస్సీఎఫ్ కూడా ఒక్కొక్కసారి గెలిచాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుస్తామనే ధీమాతో దూసుకెళ్తున్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కేవలం పది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. నలుగురి మధ్యే ప్రధాన పోటీ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బానోత్ మోహన్‌లాల్, బీజేపీ అభ్యర్థిగా జాటోత్ హుస్సేన్నాయక్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆ నలుగురు అభ్యర్థులు ఎక్కడ ప్రచా రం నిర్వహించినా భారీ సంఖ్యలో జనం హాజరవుతున్నారు. పోటా పోటీగా ప్రచారం కొనసాగుతుంది. ఆ నలుగురి మధ్య పోటీ ఉంటుందని దానిపైనే ప్రజలు అంచనాలు వేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థి రేసులో ఉండడం తీవ్రంగా చర్చ నడుస్తుంది. చేరికలతో వేడెక్కిన రాజకీయం.... తొలుత టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో చేరికలు ఎక్కువగా జరిగాయి. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన హుస్సేన్‌నాయక్ వెంటనే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకోవడం జరిగింది. కొంత ఆలస్యంగానే బీజేపీ అభ్యర్థిగా హుస్సేన్‌నాయక్ ఆ పార్టీలో చేరిన వెంటనే ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలు పార్టీల నాయకులను భారీగా పార్టీలో చేర్చుకున్నారు. చేరికల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ ఆధ్వర్యంలోనూ గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన కొంత మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారిలో ఒకరు జెడ్పీటీసీతో పాటు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి బానోత్ మోహన్‌లాల్ తాను కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ పార్టీలోను టీడీపీ, టీఆర్ఎస్ నుంచి చేరికలు జరిగాయి. ఎవరి ధీమా వారిదే..... టీఆర్ఎస్ ముందుగానే టికెట్లు ఖరారు చేయడంతో బానోత్ శంకర్‌నాయక్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సుమారు రెండు నెలలకు పైగా ప్రచారంలో ఉన్నారు. దాదాపు తండాల్లోని ప్రతీ ఇంటికి వెళ్లడంతో పాటు రెండో విడత ప్రచారం కూడా దాదాపు ముగించారు. నేటికి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అవ్వడంతో గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ముందుకు పోతున్నారు. దానికి తోడు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో, తాను చేసిన అభివృద్ధి ప్రజలకు కేసీఆర్‌పైన ఉన్న నమ్మకం తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని మానుకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ కేంద్ర మాజీ మంత్రిగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు, ముందు నుంచి ఎంపీ అభ్యర్థి అనుకున్న తరుణంలో చివరి క్షణంలో అధిష్టానం బలరాంనాయక్‌కు టికెట్ ఇచ్చింది. ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్ గెలవడం కాంగ్రెస్‌కు కంచుకోటగా ముద్ర పడడం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో తీర్చుకోవాలని చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో గతంలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థి బానోత్ మోహన్‌లాల్ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొన్ని పరిణామాల దృష్ట్యా టీఆర్ఎస్లోకి వెళ్లడం అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ టీడీపీకి వచ్చిన మహాకూటిమి సీట్ల సర్ధుబాటులో తనకు టికెట్ రాదని తెలవడంతో చేసిన కుట్రలను గమనించి వెంటనే బీఎల్ఎఫ్లో చేరారు. చేరికల సందర్భంగా మానుకోటలో ఏర్పాటు చేసిన బహిరంగసభ విజయవంతమైంది. గతంలో ఓటమి పాలయ్యారనే సానుభూతి, తనకు టీడీపీ ఇతర పార్టీల నాయకులతో ఉన్న సంబం«ధాలతో, చేరికలతో గెలుపు తధ్యమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చాలా తండాలు ఏకగ్రీవంగా తనకే ఓటు వేస్తామని తీర్మాణాలు కూడా చేస్తున్నాయని తనకు జరిగిన అన్యాయాన్ని, తాను చేసిన సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్‌నాయక్ తాను గూడూరు మండలం కావడం వల్ల స్థానికుడనే ముద్ర ఉంది. ఆ లోకల్ తోనే ప్రజలు ఆలోచించి తనకే ఓటు వేస్తారని బలమైన నమ్మకంతో ముందుకు పోతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించి పార్టీ పరంగానే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దాంతో హుస్సేన్‌నాయక్ పేరు పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. ఆ తరువాత కాంగ్రెస్ టికెట్ పట్ల జరుగుతున్న కుట్రలను చూసి వెంటనే బీజేపీలో చేరారు. ప్రతి మండలంలో కొంత బలమైన నాయకులను భారీ ఎత్తున పార్టీలో చేర్పించుకున్నారు. చేరికల పర్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు సంబంధించిన కొంత మంది అనుచరులతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు పార్టీలో చేరారు. బలమైన నాయకులే పార్టీలో చేరడంతో ప్రచారంలో దూసుకెళ్లడం వాటి వల్ల బీజేపీ అభ్యర్థి హుస్సేన్‌నాయక్ గెలుపు తధ్యమనే ధీమాతో ఉన్నారు. చేరికలతో ఎవరికి నష్టం బీజేపీ, బీఎల్ఎఫ్లో చేరుతున్న నాయకులతో ఏ పార్టీ ఓటు బ్యాంక్ తమ వైపు తిప్పుకుంటున్నారో టీఆర్ఎస్ లేక మహాకూటమికి నష్టం జరుగుతుందా అనే చర్చ మాత్రం తీవ్రంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ నాయకుల ఓటు బ్యాంకును తమ వైపు మలచుకుంటున్నారు వారి వల్ల కూడా కొంత ఓటు బ్యాంక్ మారనుంది. ఆ నలుగురు అభ్యర్థులు మాత్రం చేస్తున్న ప్రచారం, చేరికలతో అంచనా వేయలేని స్థితిలో ఉన్నా అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుస్తామనే ధీమా, పట్టుదల వారిలో కనిపిస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం అభ్యర్థులు ప్రధానంగా ద్వితీయ శ్రేణి క్యాడర్‌పైన దృష్టి సారించారు. వారి బలాబలాలను చూసి వా రిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
గెలుపెవరిదో?
సమాలోచనల్లో అభ్యర్థులు సెలైంట్ ఓటింగ్‌పైనే తర్జనభర్జనలు అనుయాయులతో కలిసి లెక్కలేస్తున్న అభ్యర్థులు గెలుపోటములపై భారీ బెట్టింగ్‌లు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు గెలుపు అవకాశాలపై లెక్కల్లో మునిగిపోయారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి.. పోలింగ్ సరళి ఎవరికి లాభించే అవకాశముందనే అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఓటర్ల సెలైంట్ ఓటింగ్ కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. సెలైంట్ ఓటింగ్ ఎటు పడిందో అంచనా వేయడం కష్టంగా మారడంతో అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు కట్టే పనిలో పడ్డారు. మరోపక్క సీమాంధ్ర అంతటా ఫ్యాన్‌గాలి సెలైంట్‌గా వీచిందని, వైఎస్సార్సీపీకి అనుకూల పవనాలు వీచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసినప్పటికీ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిలాక్స్ కాలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన అభ్యర్థులు గురువారం ఉదయం నుంచే ఓట్ల లెక్కలు కట్టే పనిలో పడ్డారు. తమ అనుయాయులతో కూర్చుని అనుకూల, ప్రతికూల పరిస్థితులను బేరీజు వేస్తూ ఓట్ల కూడికలు, తీసివేతల లెక్కల్లో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గాల పరిధిలోని కీలక నాయకులను పిలిపించుకుని ఆంతరంగిక సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని పోలయ్యాయి.. వాటిలో ఎవరికెన్ని ఓట్లు వస్తాయి.. తదితర కోణాల్లో అంచనాలు వేస్తున్నారు. సెలైంట్ ఓటింగ్‌పై టీడీపీలో కలవరం... జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ ప్రధాన పోరు సాగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పురిటిగడ్డలో ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. సెలైంట్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అదే జరిగితే జిల్లాలో చాలా సీట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థులు తమ అనుయాయులతో కలిసి ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ‘గాలి ఎటువైపు వీచిందంటావ్’ అంటూ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు సైతం తమ అనుయాయులతో కలిసి ఓట్ల శాతం, పోలింగ్ సరళి, సమీకరణలు వంటి వాటిని బేరీజు వేస్తున్నారు. ఓటింగ్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి బలాబలాలు అంచనా వేస్తున్నారు. బెట్టింగ్‌ల జోరు.. మరోపక్క ఎన్నికల పోలింగ్ ముగియడంతో పందేల రాయుళ్ల జోరు మొదలైంది. ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించేందుకు క్రికెట్ బుకీలు రంగంలోకి దిగారు. దీంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ బుకీల వ్యవస్థ మళ్లీ పుంజుకుంది. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం వరకు టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన పందేలు పోలింగ్ అనంతరం వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిపోయాయి. సీమాంధ్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తుందని, 110 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 21 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయని పెద్ద ఎత్తున పందేలు సాగుతున్నాయి. జిల్లాలోనూ ఎక్కువ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని పందేలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల ఓట్లు, మెజార్టీలు తదితర అంశాలపై కూడా బెట్టింగ్‌లు వేయడం గమనార్హం. విశ్రాంతి కోసం విహార యాత్రలకు సిద్ధం.. వరుస ఎన్నికలతో అలిసిపోయిన రాజకీయ పార్టీల నేతలు, కేడర్ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గురువారం జిల్లా అంతటా బలాబలాలపై లెక్కలు కట్టిన అభ్యర్థులు రానున్న రెండు రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, పార్టీ ముఖ్య నేతలతో మరికొందరు అభ్యర్థులు విహారయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12న మున్సిపాలిటీలు, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ లోగానే విహార యాత్రలు పూర్తిచేసుకునేలా కొంతమంది, ఫలితాలు తేలాకే వెళ్లేలా మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.